MICROMAX IN 1B AND MICROMAX IN NOTE 1 LAUNCHED KNOW PRICE AND SPECS SS
Micromax: మైక్రోమ్యాక్స్ సంచలనం... రెండు మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ఫోన్లు రిలీజ్
Micromax: మైక్రోమ్యాక్స్ సంచలనం... రెండు మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ఫోన్లు రిలీజ్
(image: Micromax)
Micromax Smartphones | మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ఫోన్లు కొనాలనుకునేవారికి శుభవార్త. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1, మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ స్మార్ట్‌ఫోన్స్ ఇండియాలో రిలీజ్ అయ్యాయి.
మైక్రోమ్యాక్స్... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ. ఒకప్పుడు ఇండియన్ మొబైల్ మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చిన మైక్రోమ్యాక్స్ ఆ తర్వాత రాణించలేకపోయింది. సాంసంగ్, షావోమీ, రియల్మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీల దూకుడుకు తట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి మైక్రోమ్యాక్స్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసి షావోమీ, రియల్మీ, సాంసంగ్ కంపెనీలకు సవాల్ విసురుతోంది. ప్రస్తుతం యాంటీ చైనా సెంటిమెంట్ దేశమంతా నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలదే ఆధిపత్యం. ఆ ఆధిపత్యాన్ని ఢీకొట్టేందుకు మైక్రోమ్యాక్స్ మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో రంగంలోకి దిగుతోంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1, మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ మోడల్స్‌ను పరిచయం చేసింది. ఒకటి బేసిక్ స్మార్ట్‌ఫోన్ అయితే, ఇంకొకటి మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మైక్రోమ్యాక్స్ అధికారిక స్టోర్‌లో నవంబర్ 26న సేల్ మొదలవుతుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రారంభ ధర రూ.10,999 కాగా, మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ ప్రారంభ ధర రూ.6,999.
ఈ రెండు స్మార్ట్ఫోన్ల ఫీచర్స్ చూస్తే ఇప్పటికే మార్కెట్లో ఉన్న బడా బ్రాండ్స్ మోడల్స్‌కు గట్టిపోటీ ఇచ్చేలా ఉన్నాయి. ఇవి స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు. అంటే ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర యాప్స్ ఏవీ ఉండవు. రెండేళ్ల పాటు రెగ్యులర్‌గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ లభిస్తాయి. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 మోడల్లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.