Home /News /technology /

UPTIS Technology: పంక్చ‌ర్ లెస్‌టైర్ల‌ను త‌యారు చేసిన "మిచెలిన్"

UPTIS Technology: పంక్చ‌ర్ లెస్‌టైర్ల‌ను త‌యారు చేసిన "మిచెలిన్"

Uptis tires (photo Credit- Twitter)

Uptis tires (photo Credit- Twitter)

ప్ర‌ముఖ టైర్ల కంపెనీ మిచెలిన్ (Michelin) పంక్చ‌ర్ ఫ్రూప్ (Unique Puncture-Proof Tire System) టైర్ల‌ను తయారు చేసింది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. 2024 కల్లా ఈ టైర్లను మార్కెట్ లోకి తేవడానికి సంస్థ ప్రయత్నిస్తోంది.

ఇంకా చదవండి ...
    ప్ర‌ముఖ టైర్ల కంపెనీ మిచెలిన్ (Michelin) పంక్చ‌ర్ ఫ్రూప్ (Unique Puncture-Proof Tire System) టైర్ల‌ను మార్కెట్‌లోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. దాదాపుగా ప‌దేళ్ల నుంచి మిచెలిన్‌ పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లపై పనిచేస్తోంది. సంస్థ‌ భవిష్యత్తులో రానున్న ఎలక్ట్రిక్‌ (Electric) వాహనాలకు పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్ల (Tires)ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మిచెలిన్‌ భవిష్యత్తులో పర్యావరణానికి అనుకూలంగా ఉండే గ్రీన్‌ టైర్ల (Green Tiers) ను అందుబాటులోకి తీసుకురానుంది. యూనిక్‌ పంక్చర్‌ప్రూఫ్ టైర్ సిస్టమ్ ద్వారా ఎయిర్‌లెస్ టైర్, పంక్చర్‌ ప్రూఫ్‌ (Puncture proof)  టైర్లను అందించనుంది. 3 డీ ప్రింటింగ్‌తో తయారుచేసిన టైర్లను మిచెలిన్‌ అందుబాటులోకి తీసుకురానుంది.



    2017 నుంచి ప్రయత్నాలు..
    మిచెలిన్‌ 2017లో పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్ల వీడియోను విడుద‌ల చేసింది. ఈ టైర్లను 2024లోపు మార్కెట్లలోకి తీసురావాలని మిచెలిన్‌ భావిస్తోంది. తొలుత రీసైకిలింగ్‌ (Recycling) చేయబడిన టైర్లనుపయోగించి పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను తయారు చేయనుంది. కంపెనీ డెవలప్‌ చేసిన టైర్లు గ్లాస్ ఫైబర్ రీఈన్‌ఫోర్స్‌డ్‌ ప్లాస్టిక్ తయారు చేయబడిన సౌకర్యవంతమైన లోడ్-బేరింగ్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇలాంటి టైర్లను మార్స్‌పైకి పంపిన రోవర్‌, క్యూరియాసిటీలో నాసా ఉపయోగించింది.



    ఎక్కువ పిక‌ప్ (Pickup) ఉండాలంటే వాహ‌నాల‌కు స‌రైన గాలి అవ‌స‌రం ట్యూబ్‌లెస్ (Tubeless) టైర్ల వ‌ల్ల కార్ల ప్ర‌యాణంలో ఎంతో మార్పులు వ‌చ్చాయి. అయితే పంక్చ‌ర్ అయితే చాలా ఇబ్బందులు త‌ప్ప‌డంలేదు. ట్యూబ్‌లెస్‌ టైర్లు పంక్చర్‌ అయితే కొంత దూరం మేర వచ్చినా.. ఈ టైర్లు కచ్చితంగా పంక్చర్‌ ప్రూఫ్‌ మాత్రం కాదు. తిరిగి వాటికి పంక్చర్‌ చేయల్సిందే. ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం క‌నిపెట్టేందుకు మిచెలిన్‌  సంస్థ ద‌శాబ్దకాలంగా ప‌రిశోధ‌న‌లు చేసి పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను త‌యారు చేసి ప‌రీశీలించింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAR, Electric vehicle, Latest Technology, Technology

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు