MI POWER BANK 3I TO REALME POWER BANK 2I KNOW ABOUT BEST POWER BANKS UNDER RS 1000 SS GH
Power Banks: పవర్ బ్యాంక్ కొనాలా? రూ.1,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే
Power Banks: పవర్ బ్యాంక్ కొనాలా? రూ.1,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
Power Banks | మీ స్మార్ట్‌ఫోన్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? మంచి పవర్ బ్యాంక్ (Power Bank) కొనాలని అనుకుంటున్నారా? రూ.1,000 లోపు లభిస్తున్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవే.
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చూడాల్సిన ముఖ్యమైన అంశం బ్యాటరీ బ్యాకప్. ఫోన్లో ఎన్ని ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ.. వాటిని ఆస్వాదించాలంటే తప్పనిసరిగా ఛార్జింగ్ ఉండాలి. అయితే, తరచూ ప్రయాణాలు చేసే వారికి ఛార్జింగ్ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే సౌలభ్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అటువంటి వారి కోసమే పవర్ బ్యాంక్‌లు (Power Bank) అందుబాటులోకి వచ్చాయి. సరసమైన ధరలోనే ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. రూ. 1,000 ధరలోపు భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ పవర్ బ్యాంకులను పరిశీలిద్దాం.
ఎంఐ పవర్ బ్యాంక్ 3ఐ
మీరు రూ. 1000లోపు బెస్ట్ పవర్ బ్యాంక్ కోసం చూస్తుంటే.. షావోమీ నుంచి వచ్చిన ఎంఐ పవర్ బ్యాంక్ 3ఐ బెస్ట్ ఆప్షన్.10,000mAh బ్యాటరీ గల ఈ పవర్ బ్యాంక్ కేవలం రూ. 899 ధర వద్ద లభిస్తుంది. Mi.com, అమెజాన్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉంది. ఈ పవర్ బ్యాంక్ డ్యుయల్ యూఎస్బీ అవుట్‌పుట్, మైక్రో-యూఎస్బీ పోర్ట్, ఛార్జింగ్ కోసం టైప్- సీ పోర్ట్‌తో వస్తుంది. ఇది టూ-వే ఫాస్ట్ ఛార్జింగ్‌కి మద్ధతిస్తుంది. 18W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు అనుమతిస్తుంది.
రియల్మీ పవర్ బ్యాంక్ 2ఐ కేవలం రూ. 899 ధర వద్ద లభిస్తుంది. 10,000mAh బ్యాటరీ గల ఈ పవర్‌బ్యాంక్ అమెజాన్, రియల్మీ.కామ్, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్లో అందుబాటులో ఉంది. ఈ పవర్ బ్యాంక్ 12W టూ-వే క్విక్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. 3 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. అవుట్‌పుట్ కోసం రెండు USB-A పోర్ట్‌లు, మైక్రో-యూఎస్బీ, ఇన్పుట్ కోసం టైప్-సి పోర్ట్‌లను చేర్చింది.
అంబ్రేన్ పవర్ బ్యాంక్
ఆంబ్రేన్ 15,000mAh పవర్ బ్యాంక్ కేవలం రూ. 899 ధర వద్ద లభిస్తుంది. అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ పవర్ బ్యాంక్ 9 లేయర్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ యూఎస్బీ టైప్-సీ, మైక్రో యూఎస్బీ పోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది రబ్బరైజ్డ్ ఫినిషింగ్‌తో వస్తుంది. అవుట్‌పుట్ కోసం దీనిలో రెండు USB-A పోర్ట్‌లను అందించింది.
సిస్కా P1037 పవర్ బ్యాంక్ కేవలం రూ. 999 వద్ద లభిస్తుంది. ఈ పవర్ బ్యాంక్ 10,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ 12W వరకు ఛార్జింగ్ స్పీడ్‌కు మద్దతిస్తుంది. ఇన్పుట్ కోసం మైక్రో యూఎస్బీ పోర్ట్, అవుట్‌పుట్ కోసం రెండు USB-A పోర్ట్‌లను అందించింది,
జీబ్రానిక్స్ ZEB-MD20000G3 పవర్ బ్యాంక్
అత్యధిక కెపాసిటీ కలిగిన పవర్ బ్యాంక్‌గా దీనికి పేరుంది. జీబ్రానిక్స్ ZEB-MD20000G3 పవర్‌బ్యాంక్ 20000mAh బ్యాటరీతో వస్తుంది. అమెజాన్‌లో దీన్నికేవలం రూ. 949 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ పవర్ బ్యాంక్ 12W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. దీని అవుట్‌పుట్ కోసం రెండు USB A పోర్ట్‌లు, యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌లను అందించింది. ఇన్పుట్ కోసం మైక్రో-యూఎస్బీ పోర్ట్‌లను చేర్చింది.
ఫిలిప్స్ పవర్ బ్యాంక్
ఫిలిప్స్ పవర్‌బ్యాంక్‌ను కేవలం రూ. 899 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ పవర్ బ్యాంక్ 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఇది ఎల్ఈడీ ఇండికేటర్‌తో వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ టార్చ్ లైట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఫిలిప్స్ పవర్ బ్యాంక్ 11,000mAh బ్యాటరీతో వస్తుంది. అవుట్‌పుట్ కోసం మూడు USB A పోర్ట్‌లు, ఇన్పుట్ కోసం మైక్రో- యూఎస్బీ పోర్ట్‌ను అందించింది.
అంబ్రేన్ పవర్ బ్యాంక్ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఇది 10,000mAh బ్యాటరీతో వస్తుంది. కేవలం రూ. 799 వద్ద దీన్ని అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లాక్, వైట్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆంబ్రేన్ పవర్ బ్యాంక్ 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది.
లెనోవో PA10400MAH పవర్ బ్యాంక్
లెనెవో Pa10400mAh పవర్ బ్యాంక్ కేవలం రూ. 899 వద్ద లభిస్తుంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ పవర్ బ్యాంక్‌లో రెండు యూఎస్బీ పోర్ట్‌లు, ఇన్పుట్ కోసం మైక్రో- యూఎస్బీ పోర్ట్‌లు ఉన్నాయి. ఇది ఎల్ఈడీ ఛార్జింగ్ ఇండికేటర్‌తో వస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.