ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ షావోమీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనే కాదు స్మార్ట్‌టీవీ మార్కెట్లోనూ దూసుకుపోతోంది. వరుసగా స్మార్ట్‌టీవీలను విడుదల చేస్తూ భారత మార్కెట్లో విస్తరిస్తోంది. షావోమీ తాజాగా, 32- అంగుళాల Mi LED TV 4C ని భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. హెచ్డీ సపోర్ట్ గల ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ప్యాచ్‌వాల్ యూఐతో పనిచేస్తుంది. దీనిలో అనేక అద్భుతమైన ఫీచర్లను అందించారు. అవేంటో చూద్దాం. Mi LED TV 4C స్మార్ట్‌టీవీ భారత మార్కెట్లో రూ.15,999 ధర వద్ద లభిస్తుంది. Mi.com వెబ్సైట్లో సేల్ మొదలైంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లు వారి క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి రూ .1,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
Mi LED TV 4C స్మార్ట్‌టీవీ 32-అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఎల్ఈడీ ప్యానెల్ 60Hz రిఫ్రెష్ రేట్, 178-డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్, 8ms రెస్పాన్స్ టైం కలిగి ఉంటుంది. అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్ సపోర్ట్‌ను అందించారు. Mi TV 4C 64 బిట్ అమోలాజిక్ కొటెక్స్-A53 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది మాలి -450 MP3 GPU చిప్సెట్తో వస్తుంది. దీనిలో 1GB ర్యామ్, 8GB స్టోరేజ్ అందించారు. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆధారిత ప్యాచ్‌వాల్ యూఐపై పనిచేస్తుంది. దీనిలోని ఎంఐ క్విక్ వేక్ ఫీచర్ సహాయంతో 5 సెకన్లలోపు టీవీని ఆన్ చేయవచ్చు.
ఇక, కనెక్టివిటీ ఫీచర్లను పరిశీలిస్తే.. Mi LED TV 4C వైర్లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 4.2, వైఫై సపోర్ట్ వంటివి అందించింది. వైర్డ్ కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికొస్తే, మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB 2.0 పోర్ట్‌లు, AV పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటివి అందించారు. ఇది క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో వస్తుంది. దీనిలోని రెండు 10W స్పీకర్లు అద్భుతమైన DTS HD ఆడియో ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఈ స్మార్ట్ టీవీ రిమోట్లో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోల కోసం స్పెషన్ బటన్స్ కూడా చేర్చింది. తద్వారా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోని కంటెంట్‌ని ఆస్వాదించవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.