• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • MI FAN FESTIVAL 2021 FROM APRIL 8 TO APRIL 13 KNOW OFFERS AND DEALS SS

Mi Fan Festival 2021: ఒక్క రూపాయికే స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్... ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌లో ఆఫర్స్ ఇవే

Mi Fan Festival 2021: ఒక్క రూపాయికే స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్... ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌లో ఆఫర్స్ ఇవే

Mi Fan Festival 2021: ఒక్క రూపాయికే స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్... ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌లో ఆఫర్స్ ఇవే (image: Xiaomi India)

Mi Fan Festival 2021 | ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ ఏప్రిల్ 8 నుంచి 13 వరకు జరగనుంది. ఈ ఫెస్టివల్‌లో నిర్వహించే ఫ్లాష్ సేల్‌లో ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ కొనొచ్చు.

  • Share this:
    షావోమీ మరోసారి ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ ప్రకటించింది. ఈ సేల్ ఏప్రిల్ 8న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 13 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది. ఎప్పట్లాగే అనేక ఆఫర్స్ ప్రకటించింది షావోమీ. ఈ ఫెస్టివల్‌లో హైలైట్స్ గురించి చెప్పాలంటే షావోమీ నిర్వహించే ఫ్లాష్ సేల్ ఆకట్టుకుంటోంది. కేవలం ఒక్క రూపాయికే స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇతర ప్రొడక్ట్స్‌ని అందించనుంది షావోమీ. ప్రతీ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ఫ్లాష్ సేల్ ఉంటుంది. దీంతో పాటు జాక్‌పాట్ ఆఫర్స్ అందిస్తోంది. ప్రతీ రోజు ఉదయం 10 గంటలకు క్రేజీ డీల్స్ కూడా ప్రకటించింది. ఇక రాత్రి 8 గంటలకు, అర్థరాత్రి 12 గంటల వరకు పిక్ ఎన్ చూజ్ సేల్ నిర్వహిస్తుంది.

    Air Cooler: కూలర్ కొంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే

    Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్


    ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1సీ, రెడ్‌‍మీ 20,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 2సీ, ఎంఐ నోట్‌బుక్ 14, ఎంఐ నోట్‌బుక్ 14 హొరైజన్, లాంటి ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్ అందించనుంది. ఇక ఎంఐ 10ఐ, ఎంఐ 10టీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో డిస్కౌంట్ లభిస్తుంది. ఇక రెడ్‌మీ నోట్ 10 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకునేవారికి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులపై ఆఫర్స్ ఉన్నాయి. ఇక స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ హోమ్ ప్రొడక్ట్స్ కొనేవారికి యాక్సిస్ బ్యాంకు కార్డులపై ఆఫర్స్ ఉన్నాయి. ఇక రూ.499 ధరకే ఎంఐ స్క్రీన్ ప్రొటెక్ట్, రూ.399 ధరకే ఎంఐ ఎక్స్‌టెండెడ్ వారెంటీ పొందొచ్చు.

    JioFiber: గుడ్ న్యూస్... జియోఫైబర్ ప్లాన్స్‌పై 30 రోజులు అదనంగా వేలిడిటీ

    Tata Sky: టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్... ఈ ప్రోమో కోడ్స్‌తో కొత్త ఆఫర్స్ పొందండి

    ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌లో ఎంఐ 10టీ ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు, ఎంఐ నోట్‌బుక్ హొరైజన్‌పై రూ.13,000 డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ఆడియో డివైజ్‌లపై రూ.12,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఎంఐ ఎయిర్ ప్యూరిఫయర్ 3, ఇతర స్మార్ట్ ప్రొడక్ట్స్‌పై రూ.4,499 వరకు తగ్గింపు పొందొచ్చు. ఇక రెడ్‌మీ ఇయర్‌బడ్స్ ఎస్ పై రూ.1,100 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాదు... ఎంఐ హోమ్ స్టోర్స్‌లో ప్రొడక్ట్స్ కొంటే రూ.10,000 విలువైన వోచర్స్ లభిస్తాయి. కల్ట్‌ఫిట్, మేక్‌మై ట్రిప్, జూమ్‌కార్ లాంటి బ్రాండ్ల నుంచి ఈ వోచర్స్ పొందొచ్చు. ప్రతీ రోజు ఒక కస్టమర్‌కు 100 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు