హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi Offer: ఇలాంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు.. రెడ్‌మి భారీ తగ్గింపు!

Redmi Offer: ఇలాంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు.. రెడ్‌మి భారీ తగ్గింపు!

ఇలాంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు.. రెడ్‌మి భారీ తగ్గింపు!

ఇలాంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు.. రెడ్‌మి భారీ తగ్గింపు!

Diwali With Mi Sale | దిగ్గజ ఈకామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటికి పోటీగా షావోమి కూడా సూపర్ సేల్ అందుబాటులోకి తెచ్చింది. దివాలీ విత్ ఎంఐ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భారీ ఆఫర్లు పొందొచ్చు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Xiaomi Sale | కేవలం ఇంకొన్నిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రెడ్‌మి (Redmi) ఫెస్టివ్ సేల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కంపెనీ పలు రకాల ఆఫర్లను ప్రకటించింది. భారీ తగ్గింపు అందిస్తోంది. మీరు ఇయర్ బడ్స్ (Earbuds) కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటే.. మీకోసం భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. రెడ్‌మి ఇండియా తన రెడ్‌మి ఇయర్‌బడ్స్ 3 ప్రోపై భారీ తగ్గింపు అందిస్తోంది. కంపెనీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

  రెడ్‌మి మంచి సౌండ్ క్వాలిటీతో ఇయర్‌బడ్స్ 3 ప్రోను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ. 4,500. అయితే ఇప్పుడు దివాలీ సేల్‌లో ఇయర్ బడ్స్‌ను కేవలం రూ. 1499కే కొనుగోలు చేయొచ్చు. ఈ ధరతో ఇవి తొలి సారి మార్కెట్‌లో అందుబాటులో ఉండబోతున్నాయి. అందువల్ల ఎవరైనా ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 19న డీల్ ఉంటుంది.

  ఆ భయాలతో కుప్పకూలిన బంగారం ధర.. 2 ఏళ్ల కనిష్టానికి పతనం.. ఇప్పుడు కొనొచ్చా?

  మీరు ఈ ఇయర్ బడ్స్ కొనుగోలు చేయాలని భావిస్తే.. కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నోటిఫై అనే బటన్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ సెట్ చేసుకోవాలి. అప్పుడు సేల్ ప్రారంభమైన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  చౌక ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లు.. టాప్ 10 ఆఫర్లు ఇవే!

  రెడ్‌మి ఇయర్‌బడ్స్ 3 ప్రోలో డ్యూయెల్ డైనమిక్ డ్రైవర్ ఉంటుంది. అలాగే ఇందులో క్వాల్‌కామ్ క్యూసీసీ3040 ప్రాసెసర్ ఉంది. అలాగే ఇందులో 5.2 బ్లూటూత్ ఉంది. ఇది అప్‌టెక్స్ అడాప్టిక్ కోడెక్‌కు సపోర్ట్ చేస్తుంది. టచ్ ఫర్ కంట్రోల్ ఫీచర్ ఉంది. అలాగే ఇందులో ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. చెవిలో నుంచి ఇయర్ ఫోన్స్ తీయగానే ఆటోమేటిక్‌గానే ఆఫ్ అవుతాయి. ప్రతి ఇయర్ బడ్‌లోనూ 43 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. కేస్ ప్యాక్‌లో 600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. చార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సీ పోర్ట్ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ 30 గంటల పాటు వస్తుందని కంపెనీ పేర్కొంటోంది.

  ఇకపోతే ఎంఐ దివాలీ సేల్‌లో ఇంకా ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫోన్లపై సహా ఇతర షావోమి ప్రొడక్టులు అన్నింటిపైనా ఆకర్షణీయ డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. షావోమి ఇటు అమెజాన్‌కు, అటు ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా ఈ సేల్‌ను తీసుకువచ్చినట్లు ఉంది. షావోమి కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇంకా అందుబాటులో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం షాపింగ్ ప్రారంభించండి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Earbuds, Latest offers, Redmi, Smart phone, Xiaomi

  ఉత్తమ కథలు