Mi 11 Ultra: Xiaomi ప్రియులకు గుడ్​న్యూస్​.. ఎంఐ 11 అల్ట్రా సేల్​ డేట్​ ఫిక్స్​... ఎప్పుడంటే?

ప్రతీకాత్మకచిత్రం

Xiaomi ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్​ఫోన్​ ఎట్టకేలకు అమ్మకానికి రానుంది. జూలై 15 మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ.కామ్​, ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్ ద్వారా దీని అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

  • Share this:
Xiaomi ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్​ఫోన్​ ఎట్టకేలకు అమ్మకానికి రానుంది. జూలై 15 మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ.కామ్​, ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్ ద్వారా దీని అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్​ను ఏప్రిల్‌ 23న లాంచ్​ చేసింది షియోమి సంస్థ. అదే రోజున ఎంఐ 11 సిరీస్​లో ఎంఐ 11 ఎక్స్​, ఎంఐ 11 ఎక్స్​ ప్రో మోడల్స్​ను కూడా పరిచయం చేసింది. అప్పుడు ఎంఐ 11 ఎక్స్​, 11 ఎక్స్​ ప్రో స్మార్ట్​ఫోన్స్​ సేల్​ను ప్రారంభించినా.. ఎంఐ 11 అల్ట్రా సేల్​ మాత్రం మొదలుకాలేదు. ఈ స్మార్ట్​ఫోన్​ను రిలీజ్​ చేసి రెండు నెలలు దాటిపోయినా సేల్​కు రాకపోవడంతో సోషల్​మీడియాలో చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి షియోమి ఫ్యాన్స్​ దీని కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఎట్టకేలకు తన ఫాన్స్​ నిరీక్షణకు తెరదించి సేల్​ డేట్​ అనౌన్స్​ చేసింది షియోమి సంస్థ.

ఎంఐ 11 అల్ట్రా ధర
షియోమి వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా ఎంఐ 11 అల్ట్రాను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్​, 256GB స్టోరేజ్​ గల సింగిల్ ​వేరియంట్​లోనే లభిస్తుంది. ఇది సిరామిక్ బ్లాక్, సిరామిక్ వైట్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్​లో రూ. 69,999 వద్ద అమ్మకానికి రానుంది. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.5,000 ఇన్​స్టన్ట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఎంఐ 11 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఎంఐ 11 అల్ట్రాలో అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12తో పనిచేస్తుంది. ఇది 6.81 అంగుళాల WQHD + E4 AMOLED డిస్​ప్లేతో వస్తుంది. దీని వెనుక భాగంలో 1.1 అంగుళాల సెకండరీ డిస్‌ప్లేను చేర్చింది. ఈ సెకండరీ డిస్‌ప్లే పక్కన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించింది. ఇక, ఈ స్మార్ట్​ఫోన్​ స్నాప్‌డ్రాగన్ 888 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. దీనిలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా వంటివి అందించింది.

సెల్ఫీల కోసం ప్రత్యేకంగా పంచ్ హోల్​ కటౌట్‌తో కూడిన 20 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాను చేర్చింది. ఇక, కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. 5 జి సపోర్ట్​, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ వి 5.2, జిపిఎస్, ఎజిపిఎస్, నావిక్ సపోర్ట్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి చేర్చింది. దీనిలోని 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్​ ఇస్తుంది.
Published by:Krishna Adithya
First published: