Home /News /technology /

MI 11 ULTRA 67W FAST CHARGER IS SET TO LAUNCH IN INDIA AS A SEPARATE ACCESSORY SOON HERE FULL DETAILS NS GH

Mi Fast Charger: భారత్‌లో విడుదలకు సిద్ధమైన ఎంఐ కొత్త ఫాస్ట్ ఛార్జర్.. ప్రత్యేకతలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎంఐ ఫోన్లతో పాటు క్రమంగా ఎంఐ యాక్సెసిరీస్, ఇతర ప్రొడక్ట్‌లకు కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ సంస్థ త్వరలో ఒక ఫాస్ట్ ఛార్జర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎంఐ ఫోన్లకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. క్రమంగా ఎంఐ యాక్సెసిరీస్, ఇతర ప్రొడక్ట్‌లకు కూడా ఆదరణ లభించింది. ఈ సంస్థ త్వరలో ఒక ఫాస్ట్ ఛార్జర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఎంఐ 11 అల్ట్రా ఫోన్ కోసం రూపొందించిన 67W ఫాస్ట్ ఛార్జర్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని షియోమి సంస్థ కూడా ఖరారు చేసింది. గత నెలలోనే ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ దేశంలో విడుదలైంది. అయితే షియోమి 67W ఫాస్ట్ ఛార్జర్‌కు బదులుగా.. ఎంఐ 11 అల్ట్రా ఫోన్ రిటైల్ బాక్స్‌లో 55W అడాప్టర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఛార్జర్ ద్వారా 0 నుంచి 99 శాతం ఛార్జింగ్ అయ్యేందుకు గంట సమయం పడుతుంది. ఫోన్‌తో పాటు ఇచ్చిన అడాప్టర్‌తో పోలిస్తే ఫాస్ట్ ఛార్జర్‌తో అరగంట వేగంగా ఛార్జ్ అవుతుంది. ఈ వైర్డ్ ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అతి త్వరలోనే భారత్‌లో లాంచ్ కానుంది. అయితే ఎప్పుడు దీన్ని అందుబాటులోకి తీసుకువస్తారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు.
Television Price: టీవీ కొనాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్.. త్వరలో పెరగనున్న టీవీల ధరలు.. వెంటనే కొనేసుకోండి
Samsung Galaxy A22: త్వరలోనే శామ్‌సంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్.. తక్కవ ధర, అదిరే ఫీచర్లతో..

ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్త ఛార్జర్ ఇవ్వడానికి బదులుగా.. దాన్ని విడిగా అమ్మాలని కంపెనీ భావిస్తోంది. 67 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఎంఐ 11 అల్ట్రా యూనిట్‌కు విభిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న ఎంఐ 11 అల్ట్రా ఫోన్‌తో రిటైల్ బాక్స్ 55 డబ్ల్యూ ఛార్జర్‌ను ఇస్తున్నారు. దీని స్థానంలో 67 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై షియోమీ కచ్చితమైన సమాచారమివ్వలేదు. దీని వివరాలు కూడా పూర్తిగా ప్రకటించలేదు. అయితే ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 67 డబ్ల్యూ వైర్లెస్ ఛార్జర్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ ఛార్జర్ ఇతర డివైజ్‌లను కూడా 10డబ్ల్యూ వేగంతో ఛార్జ్ చేయగలదు.

షియోమీ సంస్థ గత నెలలోనే ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ.69,999గా ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాస్మిక్ బ్లాక్, కాస్మిక్ వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. భారత్‌లో ఎంఐ 11 అల్ట్రా లభ్యత గురించి సంస్థ ఇంకా ప్రకటించలేదు. దీన్ని ముందు అమెజాన్‌లో ప్రవేశపెట్టారు. దీంతో పాటు కంపెనీకి చెందిన ఎంఐ.కామ్ పోర్టల్లోనూ పొందుపరిచారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Redmi, Xiomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు