ఎంఐ 11 సిరీస్‌లో ఇండియాలో మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది షావోమీ ఇండియా. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో, ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. వీటిలో ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎంఐ 11 అల్ట్రా సేల్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఇదే సిరీస్‌లో ఎంఐ 11 లైట్ మోడల్‌ను పరిచయం చేసింది షావోమీ ఇండియా. అన్ని స్మార్ట్ఫోన్ల కన్నా ఈ స్మార్ట్‌ఫోన్ బరువు చాలా తక్కువ. ఎంఐ 11 లైట్ బరువు కేవలం 157 గ్రాములు మాత్రమే. అంతేకాదు... ప్రపంచంలోనే సన్నని స్మార్ట్‌ఫోన్ కూడా ఇదేనని చెబుతోంది షావోమీ. కేవలం 6.8ఎంఎం సన్నగా ఈ స్మార్ట్‌ఫోన్ ఉంటుంది.
ఎంఐ 11 లైట్ ప్రారంభ ధర 21,999. ఇది 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.23,999. పలు ఆఫర్స్ ప్రకటించింది షావోమీ. ప్రీ-ఆర్డర్ చేసేవారికి రూ.1,500 ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ ఉపయోగించేవారికి రూ.1,500 డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది. అంటే ఎంఐ 11 లైట్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.18,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.20,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. జూన్ 25 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, Mi.com, మి హోమ్ స్టోర్స్, ఇతర రీటైల్ స్టోర్లలో ప్రీ-ఆర్డర్ మొదలవుతుంది. మొదటి సేల్ జూన్ 28న జరగనుంది.
ఎంఐ 11 లైట్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ + 5 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరాలో ఏఐ బ్యూటిఫై, నైట్ మోడ్, టైమ్ బర్స్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎంఐ 11 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో 4,250ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. జాజ్ బ్లూ, టస్కనీ కోరల్, వినైల్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఎంఐ 11 లైట్ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే స్పందనను చూసి ఎంఐ 11 లైట్ 5జీ మోడల్ లాంఛ్ చేస్తామని షావోమీ ఇండియా ప్రకటించింది.
ఎంఐ 11 లైట్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్టీవ్ రిలీజ్ చేసింది షావోమీ. ధర రూ.8,999. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటు 117 పైగా స్పోర్ట్స్ మోడ్స్, ఫిట్నెస్ అనాలిసిస్, వైటల్స్ ట్రాకర్, బిల్ట్ ఇన్ అలెక్సా, 110 పైగా వాచ్ ఫేసెస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. జూన్ 25న ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్టీవ్ సేల్ మొదలవుతుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.