MI 10I VS ONEPLUS NORD VS MOTO G 5G KNOW COMPARISON BETWEEN THESE THREE 5G SMARTPHONES SS
Mi 10i vs OnePlus Nord vs Moto g 5g: ఈ మూడు 5జీ స్మార్ట్ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి
Mi 10i vs OnePlus Nord vs Moto g 5g: ఈ మూడు 5జీ స్మార్ట్ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి
Mi 10i vs OnePlus Nord vs Moto g 5g | మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇండియన్ మార్కెట్లో 5జీ మొబైల్స్ వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఎంఐ 10ఐ, వన్‌ప్లస్ నార్డ్, మోటో జీ 5జీ స్మార్ట్ఫోన్ల మధ్య తేడాలు తెలుసుకోండి.
ఇండియన్ మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. షావోమీ ఇండియా ఎంఐ 10ఐ మోడల్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో 5జీ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. వాటిలో వన్‌ప్లస్ నార్డ్ 5జీ, మోటో జీ 5జీ లాంటి పాపులర్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటికి పోటీగా ఎంఐ 10ఐ మోడల్ వచ్చేసింది. ఎంఐ 10ఐ, వన్‌ప్లస్ నార్డ్, మోటో జీ 5జీ... ఈ మూడూ 5జీ స్మార్ట్ఫోన్లే. కానీ వేటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో 108మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్ విశేషాలు చూస్తే 48మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 6.7 అంగుళాల భారీ డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ ప్రత్యేకతలు చూస్తే స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్, 48మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 6.44 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే, 4,115ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మరి ఈ మూడు స్మార్ట్ఫోన్ల స్పెసిఫికేషన్స్, ధరలు, వీటి మధ్య తేడాలు ఎలా ఉన్నాయో ఈ కింది చార్ట్‌లో తెలుసుకోండి.
ఇలా ఈ మూడు స్మార్ట్ఫోన్లలో వేటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి. ఈ మూడూ 5జీ స్మార్ట్ఫోన్లే అయినా ఇండియాలో ఇంకా 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇండియాలో 5జీ నెట్వర్క్ ప్రారంభమైన తర్వాత ఈ స్మార్ట్ఫోన్లలో 5జీ నెట్వర్క్ ఉపయోగించుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.