Tik Tok: ఆ వీడియోలపై టిక్ టాక్ వివరణ కోరాం: హోంశాఖ

Tik Tok | టిక్ టాక్‌లో అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేయడం పట్ల వివరణ కోరినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో వెల్లడించారు.

news18-telugu
Updated: July 24, 2019, 4:26 PM IST
Tik Tok: ఆ వీడియోలపై టిక్ టాక్ వివరణ కోరాం: హోంశాఖ
కిషన్ రెడ్డి (File)
news18-telugu
Updated: July 24, 2019, 4:26 PM IST
టిక్‌ టాక్‌లో పోస్ట్ చేస్తున్న అభ్యంతరకరమైన వీడియోలపై వివరణ కోరినట్లు కేంద్ర హోం శాఖ ధృవీకరించింది. టిక్‌ టాక్‌లో అభ్యంతరకరమైన వీడియోలపై వివరణ కోరుతూ ఇటీవల ఆ సంస్థకు నోటీసులు జారీ చేసిన కేంద్రం...దీనిపై సరైన వివరణ ఇవ్వకుంటే దేశలో నిషేధం విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. టిక్ టాక్ వివరణ కోరినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి స్వయంగా రాజ్యసభలో వెల్లడించారు.

కాగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ, డాక్టర్ శ్యామ్ ముఖర్జీ, పండిట్ దీన్ ఉపాధ్యాయల అనుమానాస్పద మరణాలపై నిజానిజాల నిర్ధారణకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని కేంద్ర హోం శాఖ స్పష్టంచేసింది. అయితే ఈ విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నిజనిర్ధారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పలు వర్గాల నుంచి అభ్యర్థనలు వచ్చినట్లు అంగీకరించింది.

First published: July 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...