కరోనా వైరస్ సంక్షోభంతో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. థర్మామీటర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, గ్లూకోమీటర్, పల్స్ ఆక్సిమీటర్ లాంటివి కొంటున్నారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా ఇంట్లోనే ప్రాథమికంగా పరీక్షించుకుంటున్నారు. ఇలాంటి మెడికల్ గ్యాడ్జెట్స్ ఉంటే పర్లేదు. కానీ గ్యాడ్జెట్ లేనివాళ్ల పరిస్థితి ఏంటీ? వారికి స్మార్ట్‌ఫోన్‌నే హెల్త్ గ్యాడ్జెట్‌గా మార్చుకునే టెక్నాలజీ వచ్చింది. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ మీటర్‌గా మార్చుకోవచ్చు. హెల్త్ స్టార్టప్ ఎంఫైన్ ఈ టెక్నాలజీ రూపొందించింది. ఈ సంస్థ రూపొందించిన టూల్ ద్వారా మీ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌తో చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ బీటా వర్షన్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయింది. ఐఓఎస్ డివైజ్‌లకు త్వరలో ఈ యాప్ రానుంది.
ఎంఫైన్ రూపొందించిన బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ మీటర్ ఉపయోగించడానికి ముందుగా మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి MFine యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యాప్ ఓపెన్ చేయాలి. అందులో Mpulse పైన క్లిక్ చేయాలి. స్మార్ట్‌ఫోన్ కెమెరా, ఫ్లాష్ ఆన్ చేయాలి. కెమెరా, ఫ్లాష్ లైట్పైన మీ చేతి వేలిని పెట్టాలి. అప్పుడు స్క్రీన్ రెడ్ కలర్లోకి మారుతుంది. మీ బ్లడ్ వెస్సెల్స్ నుంచి వచ్చే రెడ్, బ్లూ లైట్‌ను ఏఐ ఆల్గరిథమ్ గుర్తిస్తుంది. మీ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్‌ను లెక్కిస్తుంది. 20 సెకన్లలో రిజల్ట్ తెలుస్తుంది. ఆ తర్వాత అనాలిసిస్ రిపోర్ట్ కనిపిస్తుంది. Mpulse యాప్‌తో బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ ఎలా చెక్ చేయాలో ఈ వీడియోలో కూడా చూడొచ్చు.
ఎంఫైన్ రూపొందించిన బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ టూల్ 80 శాతం మెడికల్ గ్రేడ్ యాక్యురసీతో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కాలంలో పల్స్ ఆక్సిమీటర్ అవసరమే. పల్స్ ఆక్సిమీటర్ కొనలేనివాళ్లు ఎంఫైన్ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ టూల్ ఉపయోగించొచ్చు. ఈ యాప్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
సాధారణంగా SpO2 లెవెల్ 95 నుంచి 100 శాతం ఉండాలి. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, ఛాతీ నొప్పి లాంటి సమస్యలు వస్తాయి. కోవిడ్ 19 తో పాటు ఆస్తమా, సీఓపీడీ, శ్వాసకోశ సంబంధత వ్యాధులు ఉన్నవారుక తరచూ SpO2 లెవెల్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.