#MeToo: ఇన్‌స్టాగ్రామ్‌లో మీటూ హ్యాష్‌ట్యాగ్ టాప్

ఇన్‌స్టాగ్రామ్ ఇయర్ ఇన్ రివ్యూ 2018 రిపోర్ట్ ప్రకారం మొదటి స్థానంలో #MeToo ఉండగా రెండో స్థానంలో #timesup(5,97,000 సార్లు) మూడోస్థానంలో #marchforourlives(5,62,000 సార్లు) ఉపయోగించారు.

news18-telugu
Updated: December 13, 2018, 6:02 PM IST
#MeToo: ఇన్‌స్టాగ్రామ్‌లో మీటూ హ్యాష్‌ట్యాగ్ టాప్
#MeToo: ఇన్‌స్టాగ్రామ్‌లో మీటూ హ్యాష్‌ట్యాగ్ టాప్ (File image: Reuters)
news18-telugu
Updated: December 13, 2018, 6:02 PM IST
#MeToo... బాలీవుడ్ నుంచి మీడియా ఇండస్ట్రీ వరకు మీటూ ఉద్యమం ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంత కలకలం రేపిందో చూశాం. ఇప్పటికీ ఇండియాలో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ మీటూ. ఈ ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మీటూ హ్యాష్‌ట్యాగ్ టాప్‌లో నిలిచింది. 15 లక్షల హ్యాష్‌ట్యాగ్స్ ఉపయోగించినట్టు కంపెనీ ప్రకటించింది.

ఇన్‌స్టాగ్రామ్ ఇయర్ ఇన్ రివ్యూ 2018 రిపోర్ట్ ప్రకారం మొదటి స్థానంలో #MeToo ఉండగా రెండో స్థానంలో #timesup(5,97,000 సార్లు) మూడోస్థానంలో #marchforourlives(5,62,000 సార్లు) ఉపయోగించారు. ప్రేమ, జాలి, దయ లాంటి అంశాలు ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అయ్యాయని తేల్చింది ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్. #love, #instagood, #fashion, #lovequotes లాంటి హ్యాష్‌ట్యాగ్స్ కూడా ట్రెండింగ్‌లో కనిపించాయి.

ఇక ఫోర్ట్‌నైట్ గేమ్ పాపులర్ కావడంతో #fortnite కూడా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. ఇక గిఫీ స్టిక్కర్స్‌లోని "హార్ట్ లవ్ స్టిక్కర్" ఎక్కువగా ఉపయోగించారు.

ఇవి కూడా చదవండి:



హీరోయిన్ సోనాక్షి సిన్హాకు షాక్... హెడ్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే రాడ్డు వచ్చింది

ఇడియట్ అని సెర్చ్ చేస్తే ట్రంప్ ప్రత్యక్షం... కారణం చెప్పిన గూగుల్

నోట్లు మారబోతున్నాయా? కొత్త కరెన్సీ రానుందా?
Loading...
ఆ డాక్యుమెంట్ ఇవ్వకపోతే మీ జీతానికి కోత తప్పదు
First published: December 13, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...