Home /News /technology /

META OWNED APP WORKING ON QUICK REACTIONS FOR WHATSAPP STATUS UPDATES UMG GH

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్... స్టేటస్ అప్‌డేట్స్‌కు క్విక్ రియాక్షన్స్.. ఇలా యూజ్ చేసుకోండి..!

వాట్సాప్‌లో కొత్త ఫీచర్

వాట్సాప్‌లో కొత్త ఫీచర్

వాట్సాప్ కొద్ది నెలల క్రితం మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ పరిచయం చేసింది. ఇప్పుడు స్టేటస్‌కు కూడా క్విక్ ఎమోజీ రియాక్షన్స్ తీసుకొచ్చే పనిలో నిమగ్నం అయిందని వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు సింపుల్‌గా ఎమోజీలపై క్లిక్ చేసుకోండి.

ఇంకా చదవండి ...
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) నిత్యం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అలానే ఎడిట్ మెసేజెస్, కమ్యూనిటీస్‌ వంటి మరెన్నో అదిరిపోయే ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు క్విక్ రియాక్షన్స్ (Quick Reactions) పేరుతో మరో కొత్త ఫీచర్‌ను కూడా డెవలప్ చేయడం మొదలు పెట్టింది. ఈ ఫీచర్‌తో స్టేటస్‌ అప్‌డేట్‌లకు 8 ఎమోజీలతో క్విక్‌గా రియాక్ట్ అవ్వొచ్చు. వాట్సాప్ కొద్ది నెలల క్రితం మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ పరిచయం చేసింది. ఇప్పుడు స్టేటస్‌కు కూడా క్విక్ ఎమోజీ రియాక్షన్స్ తీసుకొచ్చే పనిలో నిమగ్నం అయిందని వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు సింపుల్‌గా ఎమోజీలపై క్లిక్ చేసి స్టేటస్‌ అప్‌డేట్‌లకు రియాక్ట్ అవ్వచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.22.16.10లో ఇంటర్నల్ టెస్టింగ్‌లో కనిపించింది. అంటే ఇంకా బీటా టెస్టర్లకు ఇది రిలీజ్ అవ్వలేదు. త్వరలోనే అందరికీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌ ద్వారా ఈ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకు రానుందని WABetaInfo పేర్కొంది. ఈ అదిరిపోయే ఫీచర్ వాట్సాప్ డెస్క్‌టాప్ బీటాలో దాదాపు మూడు నెలల క్రితమే కనిపించిందని ఆ వెబ్‌సైట్ తెలిపింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ వెర్షన్ కోసం ఈ ఫీచర్‌ను మెసేజింగ్ యాప్ డెవలప్ చేస్తోంది. వాట్సాప్‌ బీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో చెప్పేందుకు ఓ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. ఆ స్క్రీన్‌షాట్‌ ప్రకారం, స్టేటస్‌లో క్విక్ రియాక్షన్ ఫీచర్ కనిపించింది. ఇందులో రెడ్ హార్ట్ కళ్లతో నవ్వుతున్న ముఖం... ఆనందం, కన్నీళ్లతో కూడిన ముఖం... నోరు తెరిచిన ముఖం/వావ్ ఫేస్, ఏడుపు ముఖం.. నమస్కారం లాగా కలిపిన చేతులు.. చప్పట్లు కొట్టే చేతులు.. పార్టీ పాపర్ (Party Popper), 100% వంటి ఎనిమిది ఎమోజీలు ఉన్నాయి. ఈ ఎమోజీలతో స్టేటస్ అప్‌డేట్‌కి రియాక్ట్ అయిన తర్వాత, ఎమోజీ అనేది స్టేటస్ పెట్టినవారికి వెళ్లిపోతుంది. చాట్‌లో ఇది స్టేటస్‌కు రిప్లై వలె కనిపిస్తుంది. ఫీచర్ ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉంది కాబట్టి దాని లాంచ్ తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.



ఈ ఫ్లాట్‌ఫామ్ వీడియో కాల్స్ కోసం అవతార్స్‌ కూడా పరిచయం చేయడానికి సిద్ధమైంది. యూజర్లు అవతార్ క్రియేట్ చేసుకొని అదే అవతార్‌తో వీడియో కాల్స్‌లో మాట్లాడవచ్చని తెలుస్తోంది. అలానే స్టేటస్‌లో ఆడియో ఫైల్స్ అప్‌లోడ్ చేసుకునే వీలు కల్పించనుంది. వాట్సాప్ విండోస్ యాప్ కోసం కూడా అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా రీడిజైన్ గ్యాలరీ వ్యూ వాట్సాప్ డెస్క్‌టాప్‌ బీటాలో విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి విండోస్ వాట్సాప్ బీటా వెర్షన్‌ 2.2227.2.0లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవడం ద్వారా యూజర్లు ఈ ఫీచర్‌ని పొందొచ్చు.
Published by:Mahesh
First published:

Tags: New feature, New features, Whatsapp, Whatsapp tricks

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు