హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Meta Layoffs: మెటర్నటీ లీవ్‌లో ఉన్న ఫేస్‌బుక్ ఉద్యోగికి లేఆఫ్.. ఉద్యోగం నుంచి తొలగించడంపై ఎమోషనల్ పోస్ట్..

Meta Layoffs: మెటర్నటీ లీవ్‌లో ఉన్న ఫేస్‌బుక్ ఉద్యోగికి లేఆఫ్.. ఉద్యోగం నుంచి తొలగించడంపై ఎమోషనల్ పోస్ట్..

Meta Layoffs: మెటర్నటీ లీవ్‌లో ఉన్న ఫేస్‌బుక్ ఉద్యోగికి లేఆఫ్.. ఉద్యోగం నుంచి తొలగించడంపై ఎమోషనల్ పోస్ట్..

Meta Layoffs: మెటర్నటీ లీవ్‌లో ఉన్న ఫేస్‌బుక్ ఉద్యోగికి లేఆఫ్.. ఉద్యోగం నుంచి తొలగించడంపై ఎమోషనల్ పోస్ట్..

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించిన భారీ లేఆఫ్స్‌ బాధితుల్లో రెండు, మూడు రోజుల కింద జాయిన్ అయిన వారితో పాటు సెలవుల్లో ఉన్నవారు కూడా ప్రభావితమయ్యారు.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

2022 సంవత్సరం టెక్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు చాలా నిరాశను మిగిల్చింది. ట్విట్టర్(Twitter), మైక్రోసాఫ్ట్(Microsoft), బైజూస్ వంటి టెక్ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఇదే బాట పట్టిన ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta) ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించిన ఈ భారీ తొలగింపులలో రెండు, మూడు రోజుల కింద జాయిన్ అయిన వారితో పాటు సెలవుల్లో ఉన్నవారు కూడా ప్రభావితమయ్యారు. వారిలో అన్నెకా పటేల్ అనే మహిళ కూడా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో కమ్యూనికేషన్స్(Communications) మేనేజర్‌గా పనిచేసిన అన్నెకా, ప్రసూతి సెలవులో ఉన్న సమయంలోనే ఈ బ్యాడ్ న్యూస్ అందుకున్నారు.

TSPSC Exam Date: టీఎస్పీఎస్సీ నుంచి కీలక ప్రకటన.. ఆ పరీక్ష్క్ష తేదీ ఖరారు..

మెటా బుధవారం లేఆఫ్ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఫేస్‌బుక్‌ మాజీ కమ్యూనికేషన్ మేనేజర్ అన్నెకాకి ఈమెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌ ద్వారా తన ఉద్యోగం పోయినట్లు తెలుసుకున్న తరువాత మానసికంగా కుంగిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చారు. 3 నెలల పాప ఎమిలియాకు తల్లి అయిన అన్నెకా ఈ తొలగింపు తనని ఎంతగా కలిసివేసిందో ఒక లింక్డ్‌ఇన్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

రెండేళ్ల క్రితం జాయినింగ్

అన్నెకా జాయిన్ 2020, మేలో ఫేస్‌బుక్‌ కంపెనీలో అయ్యారు. తొమ్మిదేళ్ల క్రితం లండన్ నుంచి బే ఏరియాకు మకాం మార్చిన ఆమె ఫేస్‌బుక్‌లో పనిచేయడమే తన డ్రీమ్ అనుకున్నారు. రెండేళ్ల క్రితం తన కలను సాకారం కూడా చేసుకున్నారు. గర్భం దాల్చడంతో ఈ మధ్యనే సెలవు తీసుకున్నారు. మళ్లీ కంపెనీలో జాయిన్ అయ్యి హ్యాపీగా జాబ్ చేసుకుందామనుకుంటున్న సమయంలోనే తనని తొలగించారనే వార్త విని ఆమె తట్టుకోలేకపోయారు.

‘మెటా లేఆఫ్‌ల వల్ల ప్రభావితమైన 11,000 మంది ఉద్యోగులలో నేను ఒకరినని ఈ ఉదయం తెలుసుకున్నాను. నేను ప్రస్తుతం మెటర్నటీ లీవ్‌లో ఉన్నందున ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ-మెయిల్ అందుకోగానే గుండె పగిలిపోయింది. ఫేస్‌బుక్ గ్రూప్స్‌ ప్రొడక్ట్‌పై 2.5 ఏళ్లుగా పని చేశాను. ఇది ఫేస్‌బుక్‌లో అత్యుత్తమ భాగం అని నేను నిజంగా భావిస్తున్నాను.’ అని ఆమె అన్నారు. ఈ కాలం పాటైనా తనకు ఫేస్‌బుక్‌లో పనిచేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన పోస్ట్‌లో తన మెటర్నటీ లీవ్ ఫిబ్రవరిలో ముగుస్తుందని అన్నేకా వెల్లడించారు.

లింక్డ్‌ఇన్ పోస్ట్ ప్రకారం, ఆమె వచ్చే ఏడాది నుంచి వర్క్ చేయడం మొదలు పెడతారు. కొత్త జాబ్‌లో జాయిన్ కావడానికి ముందు కొద్ది నెలల సమయాన్ని తన కుమార్తె కోసం కేటాయిస్తానని చెప్పారు. కొత్త సంవత్సరంలో ఏదైనా కంపెనీలో కమ్యూనికేషన్స్ రోల్ తనకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని ఎవరైనా అనుకుంటే తనను రిఫర్ చేయాలని కోరుతూ ఆమె తన పోస్ట్ ముగించారు. ఒక్క అన్నెకా మాత్రమే కాదు ఈ ఏడాది భారీ లేఆఫ్స్‌ వల్ల చాలామంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

First published:

Tags: 5g technology, Facebook, Lay offs, Meta

ఉత్తమ కథలు