హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Facebook: ఫేసుబుక్​లో కొత్తగా టూ ఫ్యాక్టర్​ అథెంటికేషన్ ఫీచర్​​.. వీఐపీల ఖాతాలకు మరింత భద్రత

Facebook: ఫేసుబుక్​లో కొత్తగా టూ ఫ్యాక్టర్​ అథెంటికేషన్ ఫీచర్​​.. వీఐపీల ఖాతాలకు మరింత భద్రత

ఫేస్‌బుక్‌కు మరింత భద్రత పెంచిన మెటా (PC: Facebook)

ఫేస్‌బుక్‌కు మరింత భద్రత పెంచిన మెటా (PC: Facebook)

Facebook: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఖాతాలేని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అనేక మంది ప్రముఖులు నిత్యం సోషల్ మీడియా (Social Media) ద్వారా కోట్లాది మందికి తమ అభిప్రాయాలు వెల్లడించగలుగుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రముఖ ఖాతాలు హ్యకర్ల భారీన పడుతున్నాయి.

ఇంకా చదవండి ...

ఇంటర్నెట్ (Internet) అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా (Social Media) ఫ్లాట్ ఫామ్స్ లో ఖాతాలేని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అనేక మంది ప్రముఖులు నిత్యం సోషల్ మీడియా (Social Media) ద్వారా కోట్లాది మందికి తమ అభిప్రాయాలు వెల్లడించగలుగుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రముఖ (Celebrities) ఖాతాలు  హ్యకర్ల భారీన పడుతున్నాయి. మన దేశంలో మానవ హక్కుల పరిరక్షకులు, పాత్రికేయులు, ప్రభుత్వఅధికారులను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు (Hackers)చెలరేగిపోతున్నారు. దేశంలో వీఐపీ(VIP)ల ఖాతాలను సురక్షితంగా ఉంచేందుకు ఫేస్‌బుక్‌ (Facebook) భద్రతా విధానాలను (Privacy Policy) విస్తరిస్తోంది. వీఐపీల ఖాతాలను మరింత సురక్షితంగా ఉంచేందుకు టు ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ( Two Factor Authentification) తో పాటు, హ్యాకర్ల దాడి నుంచి ఎప్పటికప్పుడు ఖాతాల రక్షణను పర్యవేక్షిస్తోంది. 2018లోనే ఫేస్‌బుక్‌ ప్రొటెక్ట్ (Facebook Protect) ను పరీక్షించింది. 2020 అమెరికాలో ఎన్నికలకు ముందు దాన్ని విస్తరించింది.

‘‘ మేము మా వినియోగదారుల ఖాతాలకు మరింత భద్రత కల్పిస్తున్నాం.ఇప్పటికే 15 లక్షల ఖాతాలకు ఫేస్‌బుక్‌ ప్రొటెక్ట్ (FacebookProtect)ను ప్రారంభించాం. వాటిల్లో దాదాపు 9.5 లక్షల మంది టు ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ నమోదు చేసుకున్నారు.’’ అని మెటా సెక్యూరిటీ పాలసీ అధిపతి నథానియల్ గ్లీచెర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా,అమెరికా సహా, ఇండియా, పోర్చుగల్ దేశాలతోపాటు ఈ ఏడాది చివరి నాటికి 50 కంటే ఎక్కువ దేశాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నామని నథానియల్ చెప్పారు.

Green hydrogen car: హైడ్రోజన్​ కారును కొనుగోలు చేసిన నితిన్​ గడ్కరీ.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?



హ్యాకర్ల దాడి నుంచి ఖాతాలకు రక్షణ..

ఫేస్‌బుక్‌ నుంచి ఈ ఫీచర్​నుపొందడానికి నోటిఫికేషన్ వస్తుంది. ఫేస్‌బుక్‌ ప్రొటెక్ట్ ద్వారా వినియోగదారులకు మెరుగైన అనుభవం, మద్దతు అందించేందుకు టు ప్యాక్టర్ ప్రమాణీకరణను నమోదు చేయడానికి పని చేస్తామని కంపెనీ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 50 కంటే ఎక్కువ ప్రభుత్వేతర సంస్థలు అంటే ఎన్.జి.ఒలతో భాగస్వామ్యం కుదర్చుకున్నాం. యూకేలో పోర్న్ వీడియోలు ఆపడానికి స్టాప్ ఎన్.సి.ఐ,ఐ ( non-consensual sharing of intimate images) సంస్థకు మద్దతు ఇస్తున్నామని ఫేస్‌బుక్‌ తెలిపింది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా రిస్ట్రిక్ట్​ ఫీచర్​.. నచ్చని వారిని బ్లాక్​, అన్​ఫాలో చేయడం ఇలా


స్టాప్ ఎన్.సి.ఐ.ఐ డాట్ ఓఆర్జీ (StopNCII.org) వ్యక్తుల పరికరాల్లో ఇమేజెస్, వీడియోలను హ్యాష్ చేసే సాంకేతికతను ఉపయోగిస్తోంది. దీని ద్వారా ఆ ఇమేజెస్, వీడియోలు ఇతరులకు పంపినప్పుడు వాటిని మార్చడానికి అవకాశం ఉండదు. కాగా, 2004లో ఫేస్‌బుక్‌ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ పబ్లిషర్ సంస్థను మార్క్ జుకెర్ బర్గ్ అమెరికాలో ప్రారంభించారు. అప్పటి నుంచి కోట్లాది మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 285 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగిస్తున్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 11 భాషల్లో ఫేస్‌బుక్‌ సేవలు అందిస్తోంది. పలు దేశాలు ఇప్పటికే ఫేస్‌బుక్‌ సేవలను బ్యాన్ చేశాయి. మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. గడచిన 17 సంవత్సరాల్లో తన సేవలు, భద్రతా అంశాల్లో అనేక మార్పులు చేసుకున్న ఫేస్‌బుక్‌, తాజాగా వీఐపీల ఖాతాల రక్షణ చర్యలకు ఉపక్రమించింది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Cyber security, Facebook, Internet, Meta

ఉత్తమ కథలు