META FACEBOOK ADDS A DEDICATED CALLS TAB TO MESSENGER APP DETAILS HERE GH MKS
Calls Tab In Messenger : వాట్సాప్ బాటలో ఫేస్బుక్ మెసెంజర్.. కాల్స్ కోసం సరికొత్త ఫీచర్ లాంచ్..
ప్రతీకాత్మక చిత్రం
మెసెంజర్‌ను వాట్సాప్ (WhatsApp) లాగా మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దేందుకు మెటా సంస్థ సరికొత్త ఫీచర్లను లాంచ్ చేస్తోంది. తాజాగా మెసెంజర్ ద్వారా ఈజీగా కాల్స్ చేసుకునేందుకు కొత్త కాల్స్ (Calls) ట్యాబ్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది.
సాధారణంగా ఫేస్బుక్ (Facebook) వాడే యూజర్లు మెసెంజర్ (Messenger) ద్వారా బంధుమిత్రులకు మెసేజ్‌లు పంపుతుంటారు. కాల్స్ చేసుకోవడానికి వీలుగా ఇందులో కాలింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అయితే మెసెంజర్‌ను వాట్సాప్ (WhatsApp) లాగా మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దేందుకు మెటా సంస్థ సరికొత్త ఫీచర్లను లాంచ్ చేస్తోంది.
తాజాగా మెసెంజర్ ద్వారా ఈజీగా కాల్స్ చేసుకునేందుకు కొత్త కాల్స్ (Calls) ట్యాబ్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. మొదటగా కొందరు సెలెక్టెడ్ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈ ట్యాబ్ మెసెంజర్ యాప్‌లోని చాట్ పేజీలో కింద కనిపిస్తుంది. కాల్స్ (Calls) అని కొత్తగా కనిపించే ఈ ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈజీగా కాల్స్ చేసుకోవచ్చు.
CM KCR | BRS : కేసీఆర్ అనూహ్యం.. ప్రాంతీయ ఫార్ములాతోనే జాతీయ పార్టీ -ఎన్టీఆర్, పీవీ బొమ్మలతో..
అంతేకాదు, కొత్త ట్యాబ్‌పై క్లిక్ చేస్తే... ఇన్కమింగ్ కాల్స్ లేదా ఔట్‌గోయింగ్ కాల్స్ హిస్టరీ ఒకే చోట కనిపిస్తుంది. ఇక్కడ ఒక ట్యాప్‌తో కాల్స్ కనెక్ట్ చేయడం వీలవుతుంది. దీనర్థం వాట్సాప్‌లో కాల్స్ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే ఎలా కాల్ హిస్టరీ కనిపిస్తుందో అలాగే మెసెంజర్లో కూడా కనిపిస్తుంది. ఈ ఫంక్షన్ యాప్ స్క్రీన్ దిగువ భాగంలో పీపుల్ (People), చాట్స్ (Chats) ట్యాబ్‌ల మధ్య ఉంది. దశలవారీగా రిలీజ్ అవుతున్న ఈ అప్డేట్ త్వరలోనే ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (iOS) యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.
మెటా వివరణ ప్రకారం, చాట్ విండో ద్వారా వీడియో, ఆడియో కాల్స్ గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ మెసెంజర్ యాప్ మెయిన్ స్క్రీన్‌లో కాల్స్ కోసం ఓ ఫీచర్‌ని మెటా లాంచ్ చేసింది. యాప్‌లో ఎవరికైనా కాల్ చేయడానికి, యూజర్లు ఒక ఐడీని వాట్సాప్‌లో లాగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా కనిపించిన కాంటాక్ట్స్ పక్కనే ఉన్న వీడియో లేదా ఆడియో అనే బటన్స్‌పై నొక్కి కాల్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ వల్ల మెసెంజర్లో కాల్‌లను మరింత యాక్సెస్ చేయడం సాధ్యమవుతుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లను కాల్స్ ఎక్కువగా చేసేలా ప్రోత్సహించినట్లు అవుతుంది.
గణాంకాల ప్రకారం 2020కి ముందు కంటే ఇప్పుడు 40 శాతం ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు. కోవిడ్-19 తరువాత చాలా కంపెనీలు, ఉద్యోగులను సమావేశాలను నిర్వహించడానికి వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉన్న యాప్స్‌ను ఎక్కువగా వాడటం ప్రారంభించారు. ఈ క్రమంలో మెసెంజర్ యాప్ కూడా బెస్ట్ చాయిస్ అయింది. అలా ప్రస్తుతం ప్రతి రోజు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెసెంజర్ యూజర్లు 300 మిలియన్లకు పైగా వాయిస్, వీడియో కాల్లు చేస్తున్నారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫేస్బుక్ మెసెంజర్ యాప్‌ల్లో కాల్స్ సెక్షన్ ఒకేసారి రిలీజ్ అవుతోంది. కాల్స్ చాలా వేగంగా సులభంగా చేసుకునేందుకు వీలుగా ఈ ఫీచర్ యూజ్ అవుతుందని మెటా చెబుతోంది. మెటా సంస్థ వాట్సాప్ నుంచి ఈ ఫీచర్‌ను డెవలప్ చేసింది. ఫేస్బుక్ ప్రతిష్ట దిగజారుతున్నప్పటికీ ఇప్పటికీ చాలా మంది యూజర్లు ఫేస్బుక్ మెసెంజర్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. మెసెంజర్, వాట్సాప్ రెండూ మెటా సంస్థకే చెందినవి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.