భారతదేశం కొత్త ఐటీ రూల్స్‌ను గతేడాది రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ రూల్స్ అమలులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ నుంచి తప్పుడు పనులు చేస్తున్న అకౌంట్స్ వరకు అందరికీ షాక్ తగుల్తోంది. కొత్త ఐటీ రూల్స్ 2021 (IT Rules 2021) ప్రకారం మెటా సెప్టెంబర్‌లో 26 లక్షల వాట్సప్ అకౌంట్స్‌ని (WhatsApp Accounts) నిషేధించింది. ఈ విషయాన్ని మెటా తాజాగా ప్రకటించింది. భారతదేశంలో 50 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో 666 కంప్లైంట్స్ వచ్చాయి. 23 ఫిర్యాదులపై చర్యలు తీసుకుంది వాట్సప్. ఇక కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగా లేని 26 లక్షల వాట్సప్ అకౌంట్స్‌ని బ్యాన్ చేసింది. ఆగస్టులో వాట్సప్ 23 లక్షల బ్యాడ్ అకౌంట్స్‌ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.
"IT రూల్స్ 2021 ప్రకారం, మేము సెప్టెంబర్ 2022 నెలలో మా నివేదికను ప్రచురించాం. స్వీకరించబడిన ఫిర్యాదులు, వాట్సప్ తీసుకున్న చర్యల వివరాలు వినియోగదారుల భద్రతా నివేదికలో ఉన్నాయి. అలాగే మా ప్లాట్‌ఫామ్‌లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి వాట్సప్ యొక్క సొంత నివారణ చర్యలు తీసుకుంది" అని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు.
Mi Clearance Sale: స్మార్ట్‌ఫోన్ క్లియరెన్స్ సేల్... ఈ 33 షావోమీ మొబైల్స్‌పై అనూహ్యమైన డిస్కౌంట్
ఐదు మిలియన్లు అంటే 50 లక్షలకు పైగా యూజర్లు ఉన్న డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఐటీ రూల్స్ 2021 ప్రకారం ప్రతీ నెలా కాంప్లయెన్స్ రిపోర్ట్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, బహిరంగంగా, సురక్షితమైన, విశ్వసనీయమైన, జవాబుదారీగా ఉండే ఇంటర్నెట్ వైపు అడుగులు వేసే దిశగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 'డిజిటల్ నాగరిక్' హక్కులను కాపాడే లక్ష్యంతో కొన్ని సవరణలు చేసింది.
ప్రస్తుతం, సోషల్ మీడియా మధ్యవర్తులు హానికరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్ అప్‌లోడ్ చేయకూడదని యూజర్లకు తెలియజేయాలి. అటువంటి కంటెంట్‌ను అప్‌లోడ్ చేయకుండా వినియోగదారులను నిరోధించడానికి సహేతుకమైన ప్రయత్నాలు చేసేలా మధ్యవర్తులపై చట్టపరమైన బాధ్యత ఉండేలా పలు సవరణలు చేసింది ప్రభుత్వం.
Mobile Offer: రూ.30 వేల లోపు రిలీజైన మొబైల్‌ను రూ.15 వేల లోపే కొనండి
భారత పౌరుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ తప్పనిసరి అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల అన్నారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వాటాదారులందరితో సమగ్రమైన ప్రజా సంప్రదింపులు జరిపిన తర్వాత సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం మధ్యవర్తి బాధ్యత కేవలం లాంఛనప్రాయమైనది కాదు. అంటే యూజర్లు ఐటీ రూల్స్‌కు అనుగుణంగా ప్లాట్‌ఫామ్ ఉపయోగించేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈ ప్లాట్‌ఫామ్స్‌పై ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.