హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Meta India: మెటా ఇండియా హెడ్, వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్‌.. కంపెనీ అప్‌డేట్‌ వివరాలివే..

Meta India: మెటా ఇండియా హెడ్, వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్‌.. కంపెనీ అప్‌డేట్‌ వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఇండియా విభానికి హెడ్‌గా, వైస్‌ ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్‌ను నియమించింది. జనవరి 1 నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

గ్లోబల్‌ కంపెనీలు ఇటీవల వరుసగా ఉద్యోగాల కోతను (Layoffs) ప్రకటించాయి. అమెజాన్‌ (Amazon), ట్విట్టర్‌ (Twitter), మెటా (Meta) వంటి సంస్థలు వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుతం కంపెనీల్లో కీలక స్థానాలను భర్తీ చేసే ప్రయత్నాల్లో యాజమాన్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌ కూడా మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌ను తిరిగి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఇండియా విభానికి హెడ్‌గా, వైస్‌ ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్‌ను నియమించింది. జనవరి 1 నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఈరోజు మెటా ఇండియా హెడ్‌గా, వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆమె సంస్థ బిజినెస్‌, రెవెన్యూ ప్రయారిటీస్‌పై దృష్టి సారిస్తారు. భాగస్వాములు, క్లయింట్‌లకు మెరుగైన సర్వీస్‌ అందించేందుకు కృషి చేస్తారు. స్నాప్ ఇంక్‌లో చేరడానికి అజిత్ మోహన్ వైదొలిగిన కొద్ది రోజుల తర్వాత మెటా ప్లాట్‌ఫారమ్‌లు సంధ్యా దేవనాథన్‌ను ఇండియా హెడ్‌గా నియమించాయి.

Elon Musk: మస్క్‌తో పెట్టుకుంటే మడతడిపోద్ది.. ట్విటర్ యాప్ డెవలపర్‌కు దిమ్మతిరిగే షాక్

రెవెన్యూ గ్రోత్‌పై దృష్టి

వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్, భారతదేశంలోని మెటా ప్లాట్‌ఫారమ్‌ల పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ కూడా ఈ వారం ప్రారంభంలో రాజీనామా చేశారు. సంధ్యా దేవనాథన్ వచ్చే ఏడాది జనవరి 1న తన కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. మెటా APAC వైస్ ప్రెసిడెంట్ డాన్ నియరీకి రిపోర్ట్‌ చేస్తారు, APAC లీడర్‌షిప్‌ టీంలో భాగమవుతారు. ఇండియా ఆర్గనైజేషన్‌, స్ట్రాటజీలను లీడ్‌ చేయడానికి ఆమె తిరిగి ఇండియాకు చేరుకుంటారు.

ఆమె నియామకంపై కంపెనీ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. సంధ్యా దేవనాథన్ కంపెనీ ఇండియా చార్టర్‌కు నాయకత్వం వహిస్తారని పేర్కొంది. భారతదేశంలోని కీలక ఛానెల్‌లలో మెటా రెవెన్యూ గ్రోత్‌ పెంచడానికి దేశంలోని ప్రముఖ బ్రాండ్‌లు, క్రియేటర్లు, అడ్వెర్టైజర్లు, భాగస్వాములతో స్ట్రాటెజిక్‌ రిలేషన్‌షిప్‌ బలోపేతం చేస్తారని తెలిపింది.

డిజిటల్‌ అడాప్షన్‌లో ఇండియా బెస్ట్‌

మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ మాట్లాడుతూ.. డిజిటల్ అడాప్షన్‌లో భారతదేశం ముందంజలో ఉందన్నారు. రీల్స్, బిజినెస్ మెసేజింగ్ వంటి ప్రొడక్టులను మెటా భారతదేశంలో మొదటగా లాంచ్‌ చేసిందని, భారతదేశంలో మొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందించే WhatsAppలో JioMartని ఇటీవల లాంచ్‌ చేసినందుకు గర్విస్తున్నామన్నారు. భారతదేశానికి కొత్త నాయకురాలిగా సంధ్యను నియమించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఫేస్‌బుక్‌ సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో నియామకం

దేవనాథన్‌ గ్లోబల్‌ బిజినెస్‌ లీడర్‌. ఆమెకు ఇంటర్నేషనల్ కెరీర్‌ ఇన్‌ బ్యాంకింగ్‌, పేమెంట్‌, టెక్నాలజీలో 22 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె 2016లో మెటాలో చేరారు. సింగపూర్, వియత్నాం బిజినెస్‌, ఆగ్నేయాసియాలో మెటా ఈ-కామర్స్ యాక్టివిటీస్‌ను రూపొందించారు. 2020లో ఆమె APAC కోసం గేమింగ్‌ను లీడ్‌ చేశారు. ఆమె పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్లోబల్ బోర్డ్‌లో కూడా పనిచేస్తున్నారు. బిగ్ టెక్ కంపెనీలను నియంత్రించే ప్రభుత్వ చట్టాలను కఠినతరం చేయడంతో భారతదేశంలో ఫేస్‌బుక్ నియంత్రణ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో దేవనాథన్ నియామకం జరిగింది.

First published:

Tags: Facebook, Meta

ఉత్తమ కథలు