హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Meta App: ట్విట్టర్‌కి పోటీగా మెటా నుంచి కొత్త సోషల్ నెట్‌వర్కింగ్ యాప్.. ప్రత్యేకతలు ఇవే..

Meta App: ట్విట్టర్‌కి పోటీగా మెటా నుంచి కొత్త సోషల్ నెట్‌వర్కింగ్ యాప్.. ప్రత్యేకతలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta), ట్విట్టర్ లాంటి కొత్త యాప్ తీసుకొచ్చే పనిలో పడింది. ప్లాట్‌ఫార్మర్ ప్రకారం, "P92" అనే కొత్త సోషల్ మీడియా యాప్‌పై కంపెనీ పని చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta), ట్విట్టర్ లాంటి కొత్త యాప్ తీసుకొచ్చే పనిలో పడింది. ప్లాట్‌ఫార్మర్ ప్రకారం, "P92" అనే కొత్త సోషల్ మీడియా యాప్‌పై కంపెనీ పని చేస్తోంది. P92 అనేది ఈ ప్రాజెక్టు కోడ్‌ నేమ్. టెక్స్ట్ బేస్డ్ అప్‌డేట్స్‌ పోస్ట్ చేయడానికి ఈ యాప్ పనికొస్తుంది. యూజర్లు ఇప్పటికే ఉన్న తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌ ఉపయోగించి యాప్‌కి లాగిన్ కావొచ్చు. Meta పబ్లిక్ ఫిగర్లు, క్రియేటర్లు టైమ్-టు-టైమ్ అప్‌డేట్‌లను పంచుకునే ప్రత్యేక వేదికను సృష్టించాలని చూస్తోంది. ఈ యాప్ డీసెంటర్లైజ్డ్ సోషల్ నెట్‌వర్క్‌గా ఉండనుంది. అంటే ఇది వివిధ ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, సర్వర్ల నెట్‌వర్క్ ద్వారా పనిచేస్తుంది. ఈ సోషల్ మీడియా నెట్‌వర్క్‌పై ఏ ఒక్క సంస్థకు పూర్తి కంట్రోల్ ఉండదు. దీనివల్ల యూజర్లకు ప్రైవసీ, సెక్యూరిటీ ఉంటుంది.

ట్విట్టర్‌కి జరిగే నష్టం ఎంత

మెటా కొత్త యాప్ పబ్లిక్ ఫిగర్లు, క్రియేటర్లకు టైమ్-టు-టైమ్ అప్‌డేట్లను షేర్ చేయడానికి ప్లాట్‌ఫామ్‌ను అందించడంలో విజయవంతమైతే, అది ట్విట్టర్‌పై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మెటా యాప్ ప్రత్యేక ఫీచర్లు లేదా ట్విట్టర్ కంటే ఎక్కువ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తే మెటా వైపు మొగ్గు చూపొచ్చు. కాగా ప్రస్తుతం ట్విట్టర్‌కి స్ట్రాంగెస్ట్ యూజర్ బేస్ ఉంది. అలాగే ఇంటర్నెట్ యూజర్లలో చాలా పాపులర్ అయిన Twitterని మెటా కొత్త యాప్ పూర్తిగా భర్తీ చేసే అవకాశాలు మొదట్లో చాలా తక్కువగా ఉంటాయి. మెటా కొత్త యాప్ తీసుకొస్తే ట్విట్టర్ వెంటనే మరిన్ని ఫీచర్లను పరిచయం చేసే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ట్విట్టర్ తన యూజర్ బేస్ కాపాడుకునే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పవచ్చు.

ఆడమ్ మోస్సేరి లీడర్‌షిప్‌లో కొత్త యాప్ రెడీ

ట్విట్టర్‌ మాదిరిగానే కొత్త యాప్‌ను అభివృద్ధి చేయడంలో ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి కీలక రోల్ పోషిస్తున్నారు. కాగా ఈ యాప్ లాంచ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి యాప్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది, అయితే చట్టపరమైన, నియంత్రణ బృందాలు ఇప్పటికే ప్రైవసీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయా అనే దిశలో టెస్టులు చేస్తున్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో పెను మార్పులు తీసుకు వచ్చాక చాలామంది యూజర్లు ట్విట్టర్ ఆల్టర్నేటివ్స్ కోసం వెతికారు. ఆ క్రమంలో వారు Mastodon, Post.news, T2 వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు తరలిపోయారు. దాంతో అవి రీసెంట్ టైమ్స్‌లో బాగా పాపులర్ అయ్యాయి.

Google Translation: గూగుల్ కొత్త ఫీచర్.. ఇమేజ్‌లోని టెక్స్ట్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసే ఆప్షన్..

మెటా యూజర్లను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు అతుక్కుపోయేలా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. కొత్త సోషల్ మీడియా యాప్స్ అందుబాటులోకి రావడం వల్ల ఫేస్‌బుక్ యంగ్ యూజర్లను భారీగా కోల్పోతోంది. టిక్‌టాక్ వంటి కొత్త యాప్స్ బాగా పాపులర్ అవుతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ ఔట్‌డేటెడ్‌గా మారుతోంది. ఫోర్బ్స్ ప్రకారం, 2021 చివరి మూడు నెలల్లో ఫేస్‌బుక్ 5 లక్షల డైలీ యూజర్లను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లాంటి కొత్త సోషల్ మీడియా యాప్‌ని తీసుకురావడానికి మెటా సిద్ధమైంది.

First published:

Tags: Facebook, Meta, Twitter

ఉత్తమ కథలు