హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Meta Cross-Check: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో వివాదాస్పద క్రాస్-చెక్ ప్రోగ్రామ్‌కు సవరణలు.. అంగీకరించిన మెటా

Meta Cross-Check: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో వివాదాస్పద క్రాస్-చెక్ ప్రోగ్రామ్‌కు సవరణలు.. అంగీకరించిన మెటా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Meta Cross-Check: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ క్రాస్-చెక్ ప్రోగ్రామ్‌ను మాడిఫై చేయడానికి మెటా కంపెనీ అంగీకరించింది. మరికొన్ని సూచనలను పక్కనపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి అప్‌డేట్స్‌ తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఫేస్‌బుక్‌ (Facebook) కంపెనీ ప్రైవసీ, కంటెంట్‌, యూజర్ల హక్కులకు సంబంధించిన అంశాల్లో చాలా ఆరోపణలు ఎదుర్కొంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) అకౌంట్‌ను తొలగించి పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలోనే 2020లో ఓవర్‌సైట్ బోర్డ్ క్రియేట్‌ అయింది. ఇది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నిర్దిష్ట కంటెంట్‌కు సంబంధించిన నిర్ణయాలను సమీక్షించడానికి, సోషల్ మీడియా కంపెనీ చర్యలను సమర్థించాలా లేదా రద్దు చేయాలా అనే దానిపై తీర్పులు ఇవ్వడానికి ఏర్పాటైంది. ఇప్పుడు బోర్డ్‌ సూచనల్లో భాగమైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ క్రాస్-చెక్ ప్రోగ్రామ్‌ను మాడిఫై చేయడానికి మెటా కంపెనీ అంగీకరించింది. మరికొన్ని సూచనలను పక్కనపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి అప్‌డేట్స్‌ తెలుసుకుందాం.

* ఓవర్‌సైట్‌ బోర్డ్‌ రికమండేషన్లు ఇవే

క్రాస్‌ చెక్‌ ప్రోగ్రామ్‌ కంపెనీ ఆటోమేటెడ్ మోడరేషన్ సిస్టమ్ నుంచి హై-ప్రొఫైల్ వినియోగదారులను మినహాయిస్తుంది. క్రాస్-చెక్ సిస్టమ్‌ను రెగ్యులర్‌ రిపోర్టింగ్‌ ద్వారా మరింత పారదర్శకంగా చేస్తామని, ప్రోగ్రామ్‌కు యూజర్లను యాడ్‌ చేసే ప్రమాణాలను మానవ హక్కుల ఆసక్తులు, సమానత్వాన్ని కాపాడేలా మారుస్తామని మెటా తెలిపింది.

ఓవర్‌సైట్ బోర్డ్ లేదా మెటా కంటెంట్ నియంత్రణ నిర్ణయాలను సమీక్షించే స్వతంత్ర సంస్థ గత డిసెంబర్‌లో మెటా క్రాస్-చెక్ ప్రోగ్రామ్‌ను మెరుగుపరిచే అంశంపై మొత్తం 32 రికమండేషన్‌లను చేసింది. అందులో 11 రికమండేషన్‌లను పూర్తిగా అమలు చేయాలని మెటా నిర్ణయించింది. మరో 15 రికమండేషన్‌లను పాక్షికంగా డెవలప్‌ చేయాలని, ఐదింటిని అమలు చేయకూడదని భావిస్తున్నట్లు మెటా స్పష్టం చేసింది. ఒక రికమండేషన్‌ గురించి ఇంకా చర్చిస్తున్నట్లు తెలిపింది.

* ఫేస్‌బుక్‌ స్పందన ఇదే

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ క్రాస్-చెక్ ప్రోగ్రామ్ 2021 వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తర్వాత వివాదాస్పదమైంది. మెటా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ప్రముఖ అథ్లెట్‌లను తన ఆటోమేటెడ్ మోడరేషన్ సిస్టమ్ నుంచి రక్షించడానికి క్రాస్‌-చెక్‌ ప్రోగ్రామ్‌ను ఉపయోగిస్తుందని ఆరోపించింది. దీనిపై మెటా స్పందిస్తూ.. హై-ప్రొఫైల్ వ్యక్తులు చేసిన పోస్ట్‌లను తప్పుగా తీసివేయకుండా నిరోధించే ప్రయత్నంలో హ్యూమన్‌ రివ్యూకి అడిషనల్‌ లెవల్స్‌ మాత్రమే యాడ్‌ చేస్తుందని పేర్కొంది.

ఈ ప్రోగ్రామ్‌ను ఓవర్‌సైట్ బోర్డ్ విమర్శించింది. ఇది గతంలో పేర్కొన్నట్లుగా సంస్థ హ్యూమన్‌ రైట్స్‌ కమిట్‌మెంట్స్‌ను మరింతగా పెంచే మార్గంలా కాకుండా బిజినెస్‌ అవసరాలను సంతృప్తి పరచడానికి అన్నట్లు ఉందని పేర్కొంది. దీంతో ‘ఐడెంటిఫైడ్‌ యాజ్‌ పొటెన్షియల్లీ సివియర్లీ వయోలేటింగ్‌’గా గుర్తించిన క్రాస్-చెక్ చేసిన కంటెంట్‌పై తక్షణ చర్య తీసుకోవాల్సిన రికమండేషన్‌లను అమలు చేయడానికి మెటా అంగీకరించింది. క్రాస్-చెక్ ప్రోగ్రామ్ బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి కూడా ముందుకొచ్చింది. ఓవర్‌సైట్ బోర్డ్ కనుగొన్న ఒక సమస్య హానికరమైన కంటెంట్ ఆన్‌లైన్‌లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ కాలం ఉండేందుకు కారణమయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : వాట్సాప్‌ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఎక్స్‌పైరీ డేట్‌ను సెట్ చేసుకోవచ్చు!

అయినప్పటికీ మెటా ఇప్పటికీ క్రాస్‌ చెక్‌ ప్రోగ్రామ్‌ నుంచి బయటకు వెళ్లే అవకాశం కల్పించే నియమం సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తోంది. మెటా అమలు చేయడానికి సిద్ధంగా లేని ఐదు రికమండేషన్‌లలో ఇది కూడా ఒకటి. అదే విధంగా ప్రోగ్రామ్‌ నుంచి ప్రయోజనం పొందుతున్న ప్రముఖులను పబ్లిక్‌గా మార్క్‌ చేసే రూల్‌ కూడా అమలకు నోచుకునే అవకాశం లేదు. క్రాస్-చెక్ ప్రోగ్రామ్‌లో ఉన్న ఒకరి పోస్ట్‌ను రిపోర్ట్‌ చేసినప్పుడు, చర్యలు తీసుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చని వినియోగదారులకు తెలియజేయాలనే ఓవర్‌సైట్ బోర్డ్ రికమండేషన్‌ను కూడా మెటా తిరస్కరించింది.

* ఓవర్‌సైట్‌ బోర్డ్‌ అసంతృప్తి

మెటా ప్రతిస్పందనను ఓవర్‌సైట్ బోర్డ్ ‘ల్యాండ్‌మార్క్ మూమెంట్‌’ అని ట్వీట్‌ చేసింది. కానీ కంపెనీ చేయడానికి సిద్ధంగా ఉన్న మార్పులతో ఓవర్‌సైట్‌ బోర్డ్‌ పూర్తిగా సంతృప్తి చెందలేదు. మరింత పారదర్శకమైన, సమానమైన వ్యవస్థను సాధించడానికి మేము సూచించిన అంశాల అమలుకు ఆశించిన స్థాయిలో మెటా సహకరించలేదని పేర్కొంది. క్రాస్‌ చెక్‌ ద్వారా లభించే ప్రొటెక్షన్‌ పొందడానికి యూజర్లు రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించాలనే సూచనను కూడా మెటా పక్కన పెట్టింది.

First published:

Tags: Facebook, Instagram, Meta, Tech news

ఉత్తమ కథలు