Home /News /technology /

MESSANGER APP END TO END ENCRYPTION IN FACEBOOK MESSENGER KNOW HOW IT IS WORK GH EVK

Messanger app: ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్.. ఇదెలా పని చేస్తుందంటే..

ఫేస్‌బుక్ మెసేంజ‌ర్ లోగో

ఫేస్‌బుక్ మెసేంజ‌ర్ లోగో

Messanger app | మెటాకు చెందిన సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. తమ యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎట్టకేలకు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సెక్యూరిటీ ఫీచర్‌ను మెసెంజర్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

మెటా (META)కు చెందిన సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ (Facebook).. తమ యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎట్టకేలకు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సెక్యూరిటీ ఫీచర్‌ను మెసెంజర్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త అప్‌డేట్  (New Update) ఎలా ఉంటుందనే వివరాలను సంస్థ షేర్ చేసింది. ఇదివరకు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ ఫీచర్‌ కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే మెసేంజర్‌లో యూజర్లు చేసే చాట్స్‌, కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ (E2EE) సెక్యూరిటీ ఫీచర్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెస్తున్నట్టు మెటా వెల్లడించింది. వ్యక్తిగత ప్రైవసీ (Privacy) , సమాచార భద్రత కోసం ఈ ఎన్‌క్రిప్షన్ అవసరమని మెటా చెబుతోంది.

Flat Tyre: కారు టైర్ పంక్చర్ అయిందా? ఫ్లాట్ టైర్‌ను ఇలా మార్చుకోండి..

ఎలా పని చేస్తుందంటే..
ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ అనేది ఒక ముఖ్యమైన సెక్యూరిటీ ఫీచర్ (Security Feature). ఎన్‌క్రిప్షన్ అంటే.. ఏదైనా సమాచారాన్ని చదవటానికి వీలులేకుండా కోడ్స్ రూపంలోకి మార్చేయటం. మనకు తెలియకుండా ప్రతి రోజూ ఆన్‌లైన్‌లో ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీని వాడుతూనే ఉన్నాం. ఎన్ క్రిప్షన్ (Encryption)  అంటే.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలు మూడో వ్యక్తి చదవకుండా వేసే లాక్ లాంటిది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈమెయిల్స్ (E-Mails) వంటి సేవల్లో ఈ ఎన్‌క్రిప్షన్‌ను ఎక్కువగా వాడుతుంటారు.

అందరికీ అప్ డేట్..
అంతకుముందు వరకూ ఈ ఫీచర్ లిమిటెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది ఇప్పుడు మెసెంజర్‌ని ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు మెటా తెలిపింది. అయితే ఈ ఫీచర్ (Feature) డిఫాల్ట్‌గా పనిచేయదు. ఎవరికి వారు వారి వ్యక్తిగత ప్రైవేట్ చాట్‌ల కోసం E2EE ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి. రాబోయే వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Redmi Note 11 Series: రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌లు.. అదిరిపోయే ఫీచ‌ర్స్‌.. అందుబాటు ధ‌ర‌ల్లో!


కొత్త అప్‌డేట్స్‌ ఇవే..
ఫేస్‌బుక్ మెసెంజర్‌లో రాబోతున్న ‘ఆప్ట్-ఇన్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ చాట్‌’ అప్‌డేట్‌లో మరికొన్ని కొత్త ఫీచర్లు కూడా రాబోతున్నాయి. ఇందులో సదరు యూజర్‌కు పంపిన మెసేజ్‌ను స్క్రీన్‌ షాట్‌ (Screen Shot) తీస్తే రెసిపెంట్‌కు ఇట్టే తెలిసిపోయేలా ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఎన్‌క్రిప్షన్‌తో పని లేకుండా కొన్ని ఇతర అప్ డేట్స్ కూడా రాబోతున్నాయి. ఇందులో సరికొత్త జిఫ్(GIF)లు, స్టిక్కర్‌లు, టైపింగ్ సజెషన్స్ లాంటి అప్‌డేట్స్ కూడా ఉండబోతున్నాయి.

మెసేజ్ ఫార్వర్డింగ్‌లో కూడా కొన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి. మెసేజ్ ఫార్వర్డ్‌ను ట్యాప్ చేసినప్పుడు ముందుగా షేర్ షీట్ డిస్ ప్లే అవుతుంది. దాన్ని ఉపయోగించి మీరు ఒకరితో లేదా గ్రూప్ తో మెసేజ్ షేర్ చేసుకోవచ్చు.

WhatsApp: వాట్స‌ప్ వాడుతున్నారా.. అయితే ఈ ఫీచ‌ర్స్‌.. జాగ్ర‌త్త‌లు తెలుసుకోండి!

మెసేజ్ ను ఫార్వార్డ్ చేయడానికి ముందు కొత్త గ్రూప్‌ (New Group) ను కూడా క్రియేట్ చేయొచ్చు. ఎండ్ టు ఎండ్ చాట్ లు చేసేటప్పుడు వెరిఫైడ్ బ్యాడ్జ్‌లు కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఈ సరికొత్త అప్‌డేట్‌లో మీడియాను సేవ్ చేయడానికి కూడా సులువైన ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీడియా ఫైల్ పై హోల్డ్ చేసి ఉంచడం ద్వారా ఈ ఆప్షన్స్ ను పొందొచ్చు.

ఇకపోతే గ్యాలరీ నుండి ఫోటో లేదా వీడియో (Video) ను పంపుతున్నప్పుడు దాన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇప్పుడు రాబోతుంది. ఫైల్‌ను షేర్ చేసే ముందు ఎడిట్ స్క్రీన్ పై ఫోటో లేదా వీడియోను ఎడిట్ చేసి పంపొచ్చు. క్రాపింగ్, టెక్స్ట్ జోడించడం, కలర్స్ ఎడిట్, ఆడియో ఎడిట్ లాంటివి కూడా చేసే వీలుంటుంది.
Published by:Sharath Chandra
First published:

Tags: Facebook, Latest Technology, Meta, Social Media

తదుపరి వార్తలు