Meizu Zero: బటన్స్, సిమ్ ట్రే, హెడ్‌ఫోన్ స్లాట్ లేని స్మార్ట్‌ఫోన్... ఫీచర్లు ఇవే

Meizu Zero | ఈ స్మార్ట్‌ఫోన్‌లో సిమ్ ట్రే కూడా ఉండదు. సరికొత్త ఇ-సిమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ డిస్‌ప్లే లోపల ఉంటుంది. ఇయర్‌పీస్ కూడా ఉండదు. డిస్‌ప్లే కింద ఉండే పైజోఎలక్ట్రిక్ ట్రాన్స్యూడర్ నుంచి శబ్దం వినిపిస్తుంది. మైక్రో యూఎస్‌బీ, టైప్-సీ పోర్ట్ కూడా లేదు.

news18-telugu
Updated: January 24, 2019, 6:15 PM IST
Meizu Zero: బటన్స్, సిమ్ ట్రే, హెడ్‌ఫోన్ స్లాట్ లేని స్మార్ట్‌ఫోన్... ఫీచర్లు ఇవే
Meizu Zero: బటన్స్, సిమ్ ట్రే, హెడ్‌ఫోన్ స్లాట్ లేని స్మార్ట్‌ఫోన్... ఫీచర్లు ఇవే
news18-telugu
Updated: January 24, 2019, 6:15 PM IST
మైజూ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. 'మైజూ జీరో' పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫిజికల్ బటన్స్, స్లాట్స్ లేకపోవడం విశేషం. ఒక సైడ్‌లో ఉన్న కెపాసిటీవ్ బటన్ ద్వారా వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక ఛార్జింగ్ కోసం 12w వైర్‌లెస్ ఛార్జర్ ఉపయోగించాలి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సిమ్ ట్రే కూడా ఉండదు. సిమ్ కార్డు అవసరమే లేదు. సరికొత్త ఇ-సిమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ డిస్‌ప్లే లోపల ఉంటుంది. ఇయర్‌పీస్ కూడా ఉండదు. డిస్‌ప్లే కింద ఉండే పైజోఎలక్ట్రిక్ ట్రాన్స్యూడర్ నుంచి శబ్దం వినిపిస్తుంది. ఎంఐ మిక్స్ 3, షార్ప్ ఆక్వాస్ క్రిస్టల్‌లో ఈ టెక్నాలజీ ఇప్పటికే వాడుతున్నారు. ఇక మైక్రో యూఎస్‌బీ, టైప్-సీ పోర్ట్ కూడా లేదు.

ఇవి కూడా చదవండి:

WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?

IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...



మైజూ జీరో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.99 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, 1080x2160 పిక్సెల్స్
ర్యామ్: 4జీబీ/6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ/128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 845
రియర్ కెమెరా: 12+20 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్

ఇవి కూడా చదవండి:

Paytm Food: స్విగ్గీ, ఊబెర్‌కు పోటీ... హైదరాబాద్‌లో మొదలైన పేటీఎం 'ఫుడ్ ఆర్డరింగ్'

IRCTC Tatkal Autofill: తత్కాల్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ

Paytm Offer: డబ్బులు లేకపోయినా పేటీఎంలో రూ.60,000 షాపింగ్
First published: January 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...