ఒక్క క్లిక్‌తో అమ్మాయిల్ని నగ్నంగా మార్చే యాప్... కలకలం రేపుతున్న టెక్నాలజీ

DeepNude | టెక్నాలజీతో మేలు కన్నా కీడే ఎక్కువ అని తేల్చిచెప్పే ఉదాహరణ ఇది. ఈ యాప్ కేవలం ఆడవాళ్ల ఫోటోలకు మాత్రమే పనిచేస్తుంది.

news18-telugu
Updated: June 28, 2019, 2:24 PM IST
ఒక్క క్లిక్‌తో అమ్మాయిల్ని నగ్నంగా మార్చే యాప్... కలకలం రేపుతున్న టెక్నాలజీ
ఒక్క క్లిక్‌తో అమ్మాయిల్ని నగ్నంగా మార్చే యాప్... కలకలం రేపుతున్న టెక్నాలజీ
  • Share this:
డీప్‌ఫేక్స్... కొన్నేళ్లుగా వివాదాలకు కారణవుతున్న టెక్నాలజీ. ముఖకవళికల్ని మార్చేసి మాట్లడనివాటిని మాట్లాడినట్టుగా చూపించే టెక్నాలజీ ఇది. ఇప్పుడు కొత్తగా 'డీప్‌న్యూడ్' పేరుతో మరో కలకలం మొదలైంది. 'డీప్‌న్యూడ్' ఓ అప్లికేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ యాప్‌లో ఫోటో అప్‌లోడ్ చేసి ఒక్క క్లిక్ చేస్తే చాలు... ఆ ఫోటోలో ఉన్నవారి దుస్తులు మాయమైపోతాయి. నగ్నంగా కనిపిస్తారు. అసలు దుస్తులు లేకుండా ఫోటోలు దిగారా అన్నట్టుగా ఫోటోల్లో ఉన్నవారిని నగ్నంగా మార్చేస్తుంది ఈ యాప్. టెక్నాలజీతో మేలు కన్నా కీడే ఎక్కువ అని తేల్చిచెప్పే ఉదాహరణ ఇది. ఈ యాప్ కేవలం ఆడవాళ్ల ఫోటోలకు మాత్రమే పనిచేస్తుంది. అమ్మాయిల్ని, మహిళల్లో కలవరం రేపుతోంది ఈ టెక్నాలజీ.

గత నెలలో డీప్‌న్యూడ్ వెబ్‌సైట్ లాంఛైంది. ఆ తర్వాత యాప్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఫ్రీ యాప్‌లో ఫోటోపై వాటర్‌మార్క్ కనిపిస్తుంది. పెయిడ్ వర్షన్ యాప్‌లో ఫోటో వాటర్ మార్క్ లేకుండా ఉంటుంది. పెయిడ్ వర్షన్ ధర 50 డాలర్లు. ఈ యాప్‌ను ఇప్పటివరకు ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారో తెలియదు. కానీ దుమారం రేగడంతో ప్రస్తుతం యాప్‌ను ఆపేసింది సదరు సంస్థ. ఇప్పటికే ఫోటోలను, వీడియోలను మార్ఫ్ చేసి అమ్మాయిల్ని లోబర్చుకునే కీచకులు ఉన్నారు. ఆ టెక్నాలజీని మరింత సులభతరం చేస్తూ ఏకంగా యాప్ తయారు చేయడంపై అనేక వర్గాల్లో కలవరం రేగుతోంది. ఎవరైనా మహిళల ఫోటోలను నగ్నంగా మార్చేసే అవకాశం ఉందని, పోర్న్‌ను ప్రోత్సహించేలా ఉందన్న ఆందోళన కనిపిస్తోంది.

Photos: ఫ్యాషన్‌‌తో ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌గా మారిన జపనీస్ తాత


ఇవి కూడా చదవండి:

Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? ఈ 5 ఫీచర్లు తెలుసుకోండి

Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై వాడుకోండి ఇలాIRCTC Tour: తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ
Published by: Santhosh Kumar S
First published: June 28, 2019, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading