నేడు భూమివైపు నుంచి వెళ్తబోతున్న భారీ గ్రహశకలం...

Corona Lockdown | Corona Update : ఓ భారీ గ్రహశకలం నేడ‌ు భూమివైపు రాబోతోంది. అది భూమికి కాస్త దూరంగానే ఉంటున్నా.. సైజు పెద్దది కావడంతో దానిపై నాసా దృష్టిపెట్టింది.

news18-telugu
Updated: April 29, 2020, 6:07 AM IST
నేడు భూమివైపు నుంచి వెళ్తబోతున్న భారీ గ్రహశకలం...
నేడు భూమివైపు నుంచి వెళ్తబోతున్న భారీ గ్రహశకలం...
  • Share this:
Corona Lockdown | Corona Update : గ్రహశకలాలు భూమివైపు రావడం, పోవడం సహజమే. రోజూ చిన్నా పెద్దా నాలుగైదు గ్రహశకలాలు వస్తూనే ఉంటాయి. తాజాగా 1.5 కిలోమీటర్ల పొడవున్న ఓ గ్రహశకలం (Asteroid) నేడు భూమివైపు వస్తోంది. ఈ గ్రహశకలం వల్ల ఇప్పుడే కాదు... కొన్ని దశాబ్దాల తర్వాత కూడా భూమికి ఎలాంటి హానీ ఉండదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా (NASA) తెలిపింది. దాదాపు ఎవరెస్టు శిఖరమంత సైజుండే ఈ గ్రహశకలం నేటి మధ్యాహ్నం వేళ... 3.26 నిమిషాలకు భూమి వైపు నుంచి వెళ్లనుంది. భూమికి దగ్గరగా వచ్చిన సమయంలో... ఇది మనకు 39 లక్షల మైళ్ల దూరంలో ఉంటుంది. అంటే... భూమి, చందమామ మధ్య ఎంత దూరం ఉందో... అంతకు 16 రెట్లు ఎక్కువ దూరం అన్నమాట. అందువల్ల అది భూమిని ఢీకొట్టే అవకాశాలే లేవు.


ఈ గ్రహశకలం ప్రస్తుతం గంటకు... 31319 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. నిమిషానికి 521 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. అంటే విశాఖ నుంచి హైదరాబాద్‌కి ఇది 80 సెకండ్లలోనే వెళ్లగలదు. ఇంత వేగంతో ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీ కొంటే... జరిగే వినాశనం ఊహలకు అందనిదే. అందుకే నాసా... ఈ గ్రహశకలాన్ని ఎక్కువగా గమనిస్తోంది. ఈమధ్య కాలంలో ఇంత పెద్ద గ్రహశకలం భూమివైపు రాలేదు. ప్రస్తుతం భూ కక్ష్యా మార్గంలో ఇలాంటివి 125 గ్రహశకలాల్ని నాసా ఇప్పటివరకు గుర్తించింది.

ప్యూర్టోరికోలోని అరెసిబో అబ్జర్వేటరీ... ఈ గ్రహశకలాన్ని ఫొటో తీసింది. దీని ముఖానికి N-95 మాస్క్ ధరించినట్లుగా ఉంది. అంతే... ఇప్పుడా ఫొటో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉంది కదా... మనుషులమైన మనం సోషల్ డిస్టాన్స్ పాటిస్తున్నాం. అలాగే భూమివైపు వస్తోంది కాబట్టి.. ఆ గ్రహశకలం కూడా ఫేస్ మాస్క్ పెట్టుకుందని జోక్స్ వేస్తున్నారు.


దీనికి 52768 (1998 OR2) అనే పేరుంది. ఎందుకంటే... ఇది తొలిసారిగా 1998లో కనిపించింది.
Published by: Krishna Kumar N
First published: April 29, 2020, 6:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading