Moscow Metro: ఇది విన్నారా..? అక్కడ డబ్బులు మీ ముఖమే చెల్లిస్తుందట.. కార్డులూ, ఫోన్ పే, టికెట్​లు అవసరమే లేదు.. ఎక్కడో తెలుసా..?

మాస్కో మెట్రోలో ప్రయాణికుడు (photo: MosSobyanin /twitter)

మెట్రో స్టేషన్లోకి ప్రవేశించే ముందే కార్డును ఉపయోగించడం ద్వారా ప్రయాణం (Journey) చేసే వెలుసుబాటు వచ్చింది. అయితే రష్యా (Russia) రాజధాని మాస్కో (mascow)లో ప్రజా రవాణా వ్యవస్థ మెట్రో అధికారులు (metro officials) మరో ముందడుగేశారు

  • Share this:
మామూలుగా మనం రైలు, బస్సు, మెట్రో రైలు, విమానాల్లో ప్రయాణాలు చేయాలంటే ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకుంటాం. కొన్ని మెట్రో (Metro)లు అయితే ప్రయాణం చేయడానికి నెలవారీ కార్డులు (Cards) కూడా అందుబాటులోకి తీసుకు వచ్చాయి. మెట్రో స్టేషన్లోకి ప్రవేశించే ముందే కార్డును ఉపయోగించడం ద్వారా ప్రయాణం (Journey) చేసే వెలుసుబాటు వచ్చింది. అయితే రష్యా (Russia) రాజధాని మాస్కో (mascow)లో ప్రజా రవాణా వ్యవస్థ మెట్రో అధికారులు (metro officials) మరో ముందడుగేశారు.ఫేస్ రీడింగ్ ద్వారా చెల్లింపులు చేసే వెలుసుబాటు కల్పించారు. దీంతో ప్రయాణం మరింత సులువైంది. ప్రపంచంలోనే మొదటిసారిగా మాస్కో మెట్రో అధికారులు 240 స్టేషన్లలో ఫేషియల్ ఐడీ (facial ID) ద్వారా చెల్లింపులు చేసే వ్యవస్థను శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలాంటి వ్యవస్థ ఇంత వరకు ఎక్కడా లేదని తెలిపింది.

కోటి 27 లక్షల జనాభా కలిగిన మాస్కో నగరంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వీడియో నిఘా వ్యవస్థ (video security system)ను అందుబాటులోకి తీసుకువచ్చారు. కోవిడ్ 19 సమయంలో జనం విచ్చలవిడిగా తిరగకుండా నియంత్రించడం, అలాంటి వారిని గుర్తించి క్వారంటైన్ కు తరలించడం, రాజకీయ ర్యాలీలకు హాజరైన నిరసన కారులను గుర్తించడం, వారిని అరెస్టు చేసేందుకు కూడా ఈ వీడియో నిఘా వ్యవస్థ (video security system) ఉపయోగపడిందని పోలీసు అధికారులు తెలిపారు. ఇదే వ్యవస్థ (System)ను ఇప్పుడు ఫేస్ పే చేసేందుకు పోలీసులు అనుమతించారు. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో మరే నగరంలోనూ లేదని, మొదటి సారిగా మాస్కోలో అందుబాటులోకి వచ్చిందని రాజధాని రవాణా వ్యవస్థ అధిపతి మాగ్జిమ్ లిస్క్సుటోవ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రపంచంలోనే తొలిసారిగా..

ఫేస్ పే (face pay) అనేది ఇష్టమైన వారు చేయవచ్చు. దీనికితోడు గతంలో ఉన్న ఇతర చెల్లింపు వ్యవస్థలు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. ఫేస్ పే ఉపయోగించుకోవాలనుకునే ప్రయాణీకులు ముందుగా వారి ముఖ చిత్రాన్ని ఇవ్వాలి. బ్యాంకు కార్డులను (bank cards) మాస్కో మెట్రో యాప్ ద్వారా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అనుసంధానం చేసుకున్న వారు ఫేస్ పే ద్వారా టర్నస్టైల్ వద్ద కెమెరాను ఒక్కసారి చూసి మెట్రోలో ఎక్కవచ్చని మాగ్జిమ్ లిస్క్సుటోవ్ తెలిపారు. ప్రయాణీకుల డేటా సురక్షితంగా ఉంటుందని మాస్కో మెట్రో అధికారులు చెబుతున్నారు.



అయితే ఈ వ్యవస్థ ప్రజల గోప్యతను, మానవ హక్కులను దెబ్బతీసేదిగా ఉందని డిజిటల్ హక్కుల (digital rights) సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఫేస్ పేను నిఘా ప్రయోజనాల కోసం ఉపయోగించే అవకాశం ఉందని డిజిటల్ హక్కులు, సమాచార హక్కుల పరిరక్షణ సంస్థ రోస్కోమ్స్ వోబోడా అభిప్రాయపడింది. 2018లో మాస్కోలో సాకర్ వరల్డ్ కప్ (soccer world cup) నిర్వహించినప్పుడు నేరస్థులను గుర్తించడానికి ఈ వ్యవస్థను అభివృద్ధి (develop) చేసినట్టు మాస్కో మేయర్ కార్యాలయం (mascow mayor office) ప్రకటించడం విశేషం.
Published by:Prabhakar Vaddi
First published: