హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Maruti Suzuki: బ్రెజ్జా కాంపాక్ట్ SUV లేటెస్ట్ వెర్షన్ బుకింగ్స్ ఓపెన్.. ప్రకటించిన మారుతి సుజుకి

Maruti Suzuki: బ్రెజ్జా కాంపాక్ట్ SUV లేటెస్ట్ వెర్షన్ బుకింగ్స్ ఓపెన్.. ప్రకటించిన మారుతి సుజుకి

బుకింగ్‌కి సిద్ధంగా మారుతీ సుజుకీ కారు.

బుకింగ్‌కి సిద్ధంగా మారుతీ సుజుకీ కారు.

మారుతి సుజుకి నుంచి రానున్న బ్రెజ్జా లేటెస్ట్ వెర్షన్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఏదైనా ARENA షోరూమ్‌లో లేదా ఆన్‌లైన్‌లో రూ.11,000 ఇనిషియల్ పేమెంట్‌తో రాబోయే కాంపాక్ట్ SUVని బుక్ చేసుకోవచ్చు.

మారుతి సుజుకి నుంచి రానున్న బ్రెజ్జా లేటెస్ట్ వెర్షన్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఏదైనా ARENA షోరూమ్‌లో లేదా ఆన్‌లైన్‌లో రూ.11,000 ఇనిషియల్ పేమెంట్‌తో రాబోయే కాంపాక్ట్ SUVని బుక్ చేసుకోవచ్చు. ఈ 2022 వెర్షన్ కారు మోడల్ నుంచి విటారా పేరును కంపెనీ తొలగిస్తోంది. ఇది కొత్త సేఫ్టీ, క్యాబిన్ ఫీచర్లతో పాటు రివైజ్ చేసిన ఫ్రంట్, రియర్ ఫాసియా డిజైన్‌తో వస్తుంది. ఈ లేటెస్ట్ బ్రెజ్జా కారు లాంచ్ అయిన తర్వాత, హ్యుందాయ్ వెన్యూ, సోనెట్, నెక్సాన్, XUV300 వంటి మోడళ్లతో పోటీపడనుంది.

బ్రెజ్జా XL6 నుంచి K15B సిరీస్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా పొందవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో రావచ్చు. దీని ట్యూనింగ్ కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. సామర్థ్యం విషయానికొస్తే, ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 17.03 kmpl, టార్క్ కన్వర్టర్‌తో 18.76 kmpl మైలేజీని అందిస్తుంది.

బుకింగ్స్ ఓపెన్ చేసిన సందర్భంగా మారుతి సుజుకి లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడారు. మారుతి సుజుకి బ్రెజ్జాను 2016లో విడుదల చేసినప్పటి నుంచి ఇండియన్ మార్కెట్లో మంచి సేల్స్ రాబట్టిందని చెప్పారు. అప్పటి నుంచి ఈ మోడల్ మార్కెట్‌ను ఏలిందన్నారు. ‘దేశంలో కాంపాక్ట్ SUVల కొత్త ట్రెండ్‌ను బ్రెజ్జా ప్రారంభించింది. కేవలం 6 సంవత్సరాలలో 7.5L యూనిట్లకు పైగా సేల్స్ నమోదయ్యాయి. దేశంలోని కాంపాక్ట్ SUV విభాగంలో బ్రెజ్జాకు బలమైన మార్కెట్ వాటా ఉంది.’ అని శశాంక్ వెల్లడించారు.

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్) సివి రామన్ కూడా బుకింగ్స్ ఓపెనింగ్ అనౌన్స్‌మెంట్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా పోర్ట్‌ఫోలియోలో బ్రెజ్జాకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. మారుతి సుజుకి భారతదేశంలో డిజైన్, డెవలప్ చేసిన మొదటి ప్రొడక్ట్ ఇది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌కు దీని ద్వారా మావంతు సహకారం అందించాం. బ్రెజ్జా స్టైలిష్ లుక్స్, బోల్డ్ డిజైన్, మంచి డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఇండియన్ కాంపాక్ట్ SUV. ఈ మోడల్ ఇండియన్ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. ఈ నేపథ్యంలో కంపెనీ నుంచి లేటెస్ట్ బ్రెజ్జా SUVని రూపొందించాం. ఇది కూడా కస్టమర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని భావిస్తున్నాం.’ అని తెలిపారు.

కొన్ని రోజుల క్రితం మారుతి సుజుకి జూలై 30న ఓ కొత్త కారును లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే అప్పట్లో బ్రెజ్జా గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ దీని బుకింగ్స్ తాజాగా ఓపెన్ అయిన నేపథ్యంలో.. జూలై 30వ తేదీన ఈ కారు లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Published by:Mahesh
First published:

Tags: Auto News, Best cars, CAR, MARUTI SUZUKI

ఉత్తమ కథలు