Home /News /technology /

MARUTI SUZUKI NEW CAR LAUNCH IF YOU SEE THE PRICE AND FEATURES YOU WILL BOOK IMMEDIATELY UMG GH

Swift CNG: మారుతీ సుజుకి కొత్త సీఎన్‌జీ కార్ లాంచ్ .. ధర, ఫీచర్స్ చూస్తే వెంటనే బుక్ చేస్తారు !

మారుతీ  సుజుకి కొత్త సీఎన్ జీ కార్ లాంఛ్ .. ధర, ఫీచర్స్ చూస్తే వెంటనే బుక్ చేస్తారు !

మారుతీ సుజుకి కొత్త సీఎన్ జీ కార్ లాంఛ్ .. ధర, ఫీచర్స్ చూస్తే వెంటనే బుక్ చేస్తారు !

ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజికి(Maruti Suzuki) మరో CNG వెహికల్‌ను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అతిపెద్ద CNG వాహనాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న ఈ సంస్థ, మరిన్ని కార్లకు CNG ఆప్షన్‌ను పరిచయం చేస్తూనే ఉంది. తాజాగా స్విఫ్ట్(Swift)మోడళ్లకు సీఎన్‌జీ వేరియంట్‌ను పరిచయం చేయనుంది ?

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఆటోమొబైల్(Automobile) కంపెనీ మారుతి సుజి(Maruti Suzuki)కి మరో CNG వెహికల్‌ను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అతిపెద్ద CNG వాహనాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న ఈ సంస్థ, మరిన్ని కార్లకు CNG ఆప్షన్‌ను పరిచయం చేస్తూనే ఉంది. తాజాగా స్విఫ్ట్ మోడళ్లకు సీఎన్‌జీ వేరియంట్‌ను పరిచయం చేయడంపై దృష్టి పెట్టింది. మరికొన్ని రోజుల్లో స్విఫ్ట్(Swift) సీఎన్‌జీ వేరియంట్స్‌ను కంపెనీ లాంచ్ చేయనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

ఇటీవలి కాలంలో CNG కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. CNG చౌకగా లభించడంతో పాటు మరింత ఫ్యూయల్ ఎకానమీని అందిస్తుంది. ఫలితంగా అధిక మైలేజీ లభిస్తుంది. దీంతో ఈ కార్(Car)కు సహజంగానే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మారుతి CNG పోర్ట్‌ఫోలియోను సెలెరియో, డిజైర్‌ మోడళ్లకు విస్తరించింది. సెలెరియో CNG ఈ జనవరిలో రూ. 6.58 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. డిజైర్ CNG మార్చిలో రూ. 8.14 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. CNG ఆప్షన్‌తో వచ్చిన ఇతర మారుతి కార్లలో ఆల్టో, వ్యాగన్ఆర్, ఎర్టిగా, ఈకో ఉన్నాయి. బ్రెజ్జా, కొన్ని NEXA సిరీస్ కార్లకు కూడా CNG ఆప్షన్‌ను పరిచయం చేయడానికి కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

2022 స్విఫ్ట్ CNG ప్రత్యేకతలు
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. మారుతి సుజుకి స్విఫ్ట్ CNG ఆప్షన్ VXI, ZXI వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్విఫ్ట్ VXI 5MT పెట్రోల్, ZXI 5MT పెట్రోల్ వేరియంట్‌ల ధరలు వరుసగా రూ.6.82 లక్షలు, రూ.7.50 లక్షలు. పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే స్విఫ్ట్ CNG వేరియంట్ల ధరలు రూ. 80 వేల నుంచి రూ. 90 వేల వరకు ఎక్కువగా ఉంటాయి. వీటిలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది.

ఇదీ చదవండి: Airlines Fares: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఫ్లయిట్ చార్జీలు.. ఎప్పటినుంచంటే !


స్విఫ్ట్ సీఎన్‌జీ వేరియంట్ కీ ఫీచర్లు..

- స్విఫ్ట్ CNG VXI, ZXI వంటి రెండు మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇవి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్‌తో రానున్నాయి.

- వీటిలో హెడ్‌లైట్ రివెలర్‌ పక్కన CNG స్విచ్‌ ఇన్‌స్టాల్ చేసి ఉండవచ్చు. అలాగే కొత్త కార్ల స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్ లిస్ట్.. స్విఫ్ట్ VXI 5MT, ZXI 5MT పెట్రోల్ వేరియంట్ల మాదిరిగానే ఉండవచ్చు.

- ప్రస్తుతం డిజైర్ CNG మోడల్ 31.12 km/kg మైలేజ్‌తో దేశంలోనే అత్యంత ఫ్యూయల్ ఎఫీషియంట్ వెహికల్‌గా నిలుస్తున్న CNG సెడాన్. అయితే తాజా స్విఫ్ట్ సీఎన్‌జీ 30-35 km/kg మైలేజీని కలిగి ఉంటుందని అంచనా.

- ఈ మోడళ్ల CNG ట్యాంక్ అదనపు బరువు ఉండటం ఒక డ్రాబ్యాక్. దీనివల్ల పవర్ టు వెయిట్ రేషియో తగ్గవచ్చు.

- స్విఫ్ట్ CNG మోడల్ పెట్రోల్ వేరియంట్‌ల కంటే దాదాపు రూ. 80,000 నుంచి రూ.90,000 వరకు ఖరీదైనది కావచ్చు.



అనధికార బుకింగ్స్
మారుతి సుజుకి డీలర్‌షిప్స్‌లో స్విఫ్ట్ CNG కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో వీటిని కంపెనీ అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ సంస్థ కొత్త ఆల్టో K10ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీని బుకింగ్స్ అధికారికంగా ఓపెన్ అయ్యాయి.
Published by:Mahesh
First published:

Tags: CNG, Electric cars, MARUTI SUZUKI, Swift

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు