Home /News /technology /

MARUTI SUZUKI LAUNCHES POWERFUL CNG CAR IF YOU LOOK AT THE PRICE AND FEATURES IT IS CALLED ADURS UMG GH

Swift CNG: మారుతి సుజుకి పవర్ ఫుల్ సీఎన్జీ కార్ లాంఛ్.. ధర , ఫీచర్స్ చూస్తే అదుర్స్ అంటారు !

 మారుతి సుజుకి పవర్ ఫుల్  సీఎన్జీ కార్ లాంఛ్.. ధర , ఫీచర్స్ చూస్తే అదుర్స్ అంటారు !

మారుతి సుజుకి పవర్ ఫుల్ సీఎన్జీ కార్ లాంఛ్.. ధర , ఫీచర్స్ చూస్తే అదుర్స్ అంటారు !

కొత్త సీఎన్‌జీ (CNG) కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది మారుతి సుజుకి (Maruti Suzuki India). ఇండియాలో స్విఫ్ట్ CNG వేరియంట్‌ను కంపెనీ శుక్రవారం లాంచ్(Launch) చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
కొత్త సీఎన్‌జీ (CNG) కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది మారుతి సుజుకి (Maruti Suzuki India). ఇండియాలో స్విఫ్ట్ CNG వేరియంట్‌ను కంపెనీ శుక్రవారం లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కొత్త స్విఫ్ట్ CNG.. Vxi, Zxi వంటి రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. స్విఫ్ట్(Swift) CNG Vxi వేరియంట్ ధర రూ. 7.77 లక్షలు (ఎక్స్-షోరూమ్), స్విఫ్ట్ CNG Zxi వేరియంట్ ధర రూ. 8.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. స్విఫ్ట్ సీఎన్‌జీ కోసం మారుతి సుజుకి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర రూ. 16,499 నుంచి ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి CNG ఆప్షన్‌లో ఇప్పటికే ఆల్టో, వ్యాగన్ఆర్, సెలెరియో, డిజైర్, ఎర్టిగా, ఈకో, సూపర్ క్యారీ, టూర్-ఎస్‌ ఉన్నాయి. స్విఫ్ట్ సీఎన్‌జీ వీటికి యాడ్ అయింది.

2022 మారుతి స్విఫ్ట్ CNG మైలేజ్
కొత్త 2022 స్విఫ్ట్ CNG సరికొత్త స్పెసిఫికేషన్లతో లాంచ్ అయింది. ఈ కారులో హైలైట్.. అడ్వాన్స్‌డ్ 1.2L K-సిరీస్ డ్యుయల్ జెట్, డ్యుయల్ VVT ఇంజిన్. ఇది CNG మోడ్ అవుట్‌పుట్‌లో 6,000rpm వద్ద 57kW (77.49PS) శక్తిని, 4300rpm వద్ద 98.5Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. పెట్రోల్(Petrol) మోడ్‌లో అవుట్‌పుట్ రూపంలో ఇంజిన్ 89 PS పవర్‌ను, 113 Nm టార్క్‌ను అందిస్తుంది. స్విఫ్ట్ సీఎన్‌జీ కారు 30.90 కిమీ/కిలో ఫ్యూయల్ ఎఫీషియన్సీని అందిస్తుంది. కొత్త స్విఫ్ట్ CNG భారతదేశంలో అత్యంత శక్తివంతమైన CNG హ్యాచ్‌బ్యాక్ అని మారుతి సుజుకి చెబుతోంది. ఇది అత్యంత మైలేజ్ ఇచ్చే CNG ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా నిలుస్తోంది.

ఇదీ చదవండి: Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


 మారుతి సుజుకి కంపెనీ సీఎన్‌జీ వాహనాల్లో డ్యుయల్ ఇంటర్‌డిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్ (ECU), ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను అందిస్తోంది. పర్ఫార్మెన్స్, ఎఫీషియన్సీ పరంగా అత్యుత్తమ ఎయిర్-ఫ్యూయల్ రేషియోను అందించేందుకు ఈ సెటప్‌ను అందించినట్లు కంపెనీ పేర్కొంది.



‘పనితీరు, స్టైలింగ్, రోడ్ ప్రెజెన్స్‌తో 26 లక్షల మందికి పైగా కస్టమర్లను స్విఫ్ట్ ఆకట్టుకుంది. 30.90 కిమీ/కిలో అద్భుతమైన మైలేజ్‌తో వినియోగదారులను సర్‌ప్రైజ్ చేసేందుకు స్విఫ్ట్ ఇప్పుడు S-CNG ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇది మా CNG పోర్ట్‌ఫోలియోలో 9వ మోడల్. క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్‌మెంట్ కోసం ఈ వేరియంట్‌తో మావంతు కృషి చేస్తున్నాం.’ అని మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
Published by:Mahesh
First published:

Tags: Automobiles, Car prices, MARUTI SUZUKI, Swift

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు