HOME »NEWS »TECHNOLOGY »maruti suzuki is there such a story behind janata car maruti 800 find out krs

Maruti Suzuki: జనతా కారు ‘Maruti 800’ వెనుక ఇంత కథ ఉందా..? తెలుసుకోండి

Maruti Suzuki: జనతా కారు ‘Maruti 800’ వెనుక ఇంత కథ ఉందా..? తెలుసుకోండి
ఫైల్ ఫొటో

Maruti Suzuki: మారుతి సుజుకీ సంస్థ భారత కార్ల మార్కెట్​ను దశాబ్దాలుగా ఏలుతోంది. ఆ సంస్థ తీసుకొచ్చిన తొలి తరం మోడళ్లు దేశంలో సంచలనం సృష్టించగా.. ఇప్పటికీ అధిక శాతం వాటా మారుతిదే. దీనికి బీజం పడింది మారుతి 800 మోడల్​తోనే. అసలు దీని కథేంటి చూడండి..

  • Share this:
    సుదీర్ఘ కాలంగా ‘మారుతి 800’ కారు భారతీయ సంస్కృతిలో భాగమని చెప్పవచ్చు. ఒకప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే. చాలా మంది వ్యాపారవేత్తలు, ప్రముఖులు ఈ కారునే మొదట కొన్నారు. ఎంతో మంది మారుతి కారును సెంటిమెంట్​గా భావిస్తారు. ఇప్పటికీ నడపకున్నా చాలా మంది ఇళ్లలోనే ఈ కారును దాచుకున్నారు. 36 ఏళ్లలో దేశంలోని ఏదో ఒక సమయంలో కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కారును చూసే ఉంటారు. అంతలా దేశంలో మారుతి సుజుకి 800 మోడల్​ కారు అమ్మకాలు జరిగాయి. 2014 వరకు ఈ కార్లు రోడ్లపై రయ్యిరయ్యి మంటూ తిరిగాయి. జోరుగా ఉత్పత్తి జరిగాయి. ఈ కారు హవాతో 1996లో మారుతీ సుజుతీ మార్కెట్ షేర్ 60 శాతంగా ఉంటే.. ప్రస్తుతం ఎన్నీ పోటీ సంస్థలు వచ్చినా 47.6శాతంతో అదరగొడుతోంది. మారుతి సుజుకీ ఇంత విజయవంతం కావడం వెనుక ఉన్నది మారుతి 800 మోడలు చూపిన దారే.

    మారుతి ఉద్యోగ్ సంస్థను భారత ప్రభుత్వం 1981లో స్థాపించింది. ఆ తర్వాతి ఏడాది అక్టోబర్​లోనే జపాన్​కు చెందిన సుజుకీలో మారుతి విలీనమైంది. దీంతో మారుతి సుజికీ బ్రాండ్ వచ్చింది. దేశంలో కార్ల మార్కెట్​ను శాసించింది. కొత్త సంస్కరణలు, మార్పులకు నాంది పలికి, భారతీయ నుంచి అత్యంత ఆదరణ పొందింది.



    1983లో మారుతి తొలికారును ఉత్పత్తి చేసింది. మొదటి మారుతి 800 కారును హర్పాల్ సింగ్ అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు ఈ కారు తాళం​ అందించారు.

    1983లోనే మారుతి 800 కారును కొనాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కలలుకన్నారు. కాకపోతే డబ్బు సంపాదించే వరకు ఆగారు. సచిన్​కు తన తొలి  మారుతి 800 కారు అంటే ఇప్పటికీ ఎంతో ఇష్టం.

    మారుతి కారుతో డైరెక్టర్ ఇంతియాజ్ అలీ (Instagram Photo)


    మారుతీ 800 కారు మొదట ప్రారంభించినప్పుడు దాని ధర రూ.48వేలు. అప్పట్లో ఈ కారు కొనేందుకు జనాలు ఎగబడ్డారు. ఎంతో పోటీ పడ్డారు.

    1996లో మారుతి 800 మోడల్ కార్లు దేశంలో 1.94లక్షలు ఉండేవి. మార్కెట్లో 41.66 అవే కార్లు అవే ఉండేవి.

    దేశంతో మొత్తం 25 లక్షల మారుతి 800 మోడల్​ కార్లు అమ్ముడయ్యాయి. ఈ కారు చివరి యూనిట్​ను గుర్గావ్​ ప్లాంట్​లో షిల్లాంగ్​ కు చెందిన ఓ వినియోగదారుడి కోసం తయారు చేశారు. ఇప్పటి వరకు అత్యధికంగా అమ్మడైన కారు కూడా మారుతీదే.

    ఒక తరం మొత్తానికి మారుతి 800 డ్రీమ్ కార్​. అందుకు తగ్గట్టే అది అత్యంత విజయవంతం అయింది. 1989లో మారుతి 1000 ను లాంచ్ చేసింది. దేశంలో ఫస్ట్​ సెడాన్ కారు ఇదే. 1993లో మారుతి నుంచి జెన్ కారు వచ్చింది.  1994లో మారుతి మొత్తం పది లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. మొత్తంగా అనుకున్న లక్ష్యాన్ని మారుతి విజయంవంతంగా చేరింది.

    ప్రారంభమైన తర్వాత మారుతి 800 డిజైన్​లో 1998లో తొలిసారి మార్పులు జరిగాయి. అలాగే 1999లో మారుతీ తొలి డీజిల్ వెహికల్ ఓమ్నీ లాంచ్ అయింది.

    అలాగే జిప్సీ, గ్రాండ్ విటారా లాంటి ఎన్నోకార్లు మారుతి సుజుకీ నుంచి మార్కెట్లలోకి వచ్చాయి. అలాగే దేశంలో కాల్ సెంటర్​ను ప్రారంభించిన తొలి కంపెనీ మారుతి సుజుకీనే. ఇది 2000 లో ప్రారంభమైంది.

    సంస్థల నుంచి ఎంత పోటీ ఎదురైనా.. ఎన్ని కార్లు లాంచ్ అయినా ఇప్పటికీ భారత మార్కెట్లో మారుతీ సుజుకీ హవా తగ్గలేదు. ప్రసుతం మార్కెట్లో మారుతి సుజుకీ వాటా 47.6శాతంగా ఉంది. ప్రస్తుతం మరిన్ని మోడళ్లు మారుతీ సుజుకీ నుంచి మార్కెట్లోకి రానున్నాయి.
    Published by:Krishna P
    First published:December 30, 2020, 13:51 IST