హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Top-10 Selling Cars: కార్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకీ.. టాప్ 10 మోడల్స్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్నవి ఇవే !

Top-10 Selling Cars: కార్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకీ.. టాప్ 10 మోడల్స్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్నవి ఇవే !

కార్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకీ . టాప్ 10 మోడళ్లలో లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు  ఇవే !

కార్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకీ . టాప్ 10 మోడళ్లలో లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఇవే !

ఇండియాలో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి(Maruti Suzuki) కంపెనీ మరోసారి సత్తా చాటింది. ఈ ఏడాది జూన్‌లో అమ్మకాల పరంగా టాప్ 10లో ఈ కంపెనీ కార్లు ఎక్కువగా నిలవడం విశేషం. టాటా మోటార్స్(Tata Motors) కొంత కాలంగా సేల్స్‌లో స్థిరంగా రాణిస్తోంది. అయినా ప్రస్తుతం సేల్స్‌ ఛార్ట్‌లో కిందకు దిగజారింది.

ఇంకా చదవండి ...

ఇండియా(India)లో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి(Maruti Suzuki)  కంపెనీ మరోసారి సత్తా చాటింది. ఈ ఏడాది జూన్‌లో అమ్మకాల పరంగా టాప్ 10లో ఈ కంపెనీ కార్లు ఎక్కువగా నిలవడం విశేషం. టాటా మోటార్స్ కొంత కాలంగా సేల్స్‌లో స్థిరంగా రాణిస్తోంది. అయినా ప్రస్తుతం సేల్స్‌ ఛార్ట్‌లో కిందకు దిగజారింది. టాటా మోటార్స్‌కు భారతదేశపు అతిపెద్ద ఫోర్-వీలర్ మాన్యుఫాక్చరర్‌ మారుతి సుజుకి నుంచి ఎప్పుడూ పోటీ ఎదురవుతోంది. మే నెలలో టాటా నెక్సాన్ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. జూన్‌లో మారుతి సుజుకి మొదటి మూడు స్థానాలను ఆక్రమించడంతో.. టాటా నెక్సాన్‌ నాలుగో స్థానానికి పరిమితమైంది. సేల్స్‌లో మొదటి పది స్థానాల్లో ఉన్న కార్లు ఇవే..

10. హ్యుందాయ్ వెన్యూ

2022 జూన్ నెలలో 10,321 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ వెన్యూ 10వ స్థానంలో ఉంది. 2021 జూన్‌లో, హ్యుందాయ్ వెన్యూ 4,865 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంటే సేల్స్‌ 112 శాతం పెరిగాయి. నెలవారీ ప్రాతిపదికన, వెన్యూ విక్రయాలు 8,300 నుంచి 24 శాతం పెరిగాయి. వాస్తవానికి, మే నెలలో, హ్యుందాయ్ వెన్యూ నెలవారీ విక్రయాల చార్ట్‌లలో 14వ స్థానంలో నిలిచింది. టాప్-10 జాబితాలో కూడా చోటు సంపాదించలేదు. ఫేస్‌లిఫ్టెడ్ 2022 హ్యుందాయ్ వెన్యూ గత నెలలో రిఫ్రెష్ చేసిన ఎక్స్‌టీరియర్స్, కొన్ని కొత్త ఇంటీరియర్స్‌తో లాంచ్‌ చేసింది. వెన్యూ ఇప్పుడు పెద్ద గ్రిల్,సొగసైన స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో పెద్ద పాలిసేడ్‌ను పోలి ఉంది. సైడ్ కొత్త 16-అంగుళాల అల్లాయ్‌లు, వెనుక భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. కొత్త రిక్లైనింగ్ రియర్ సీట్లు, డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, USB టైప్-సి పోర్ట్‌లు, అప్‌డేట్ చేసిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు లోపలి భాగంలో మార్పులు ఆకట్టుకుంటున్నాయి. మూడు ఇంజిన్‌ల వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది 83 hpని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ పవర్‌ట్రైన్, రెండోది 120 hpని ఉత్పత్తి చేసే 1-లీటర్ టర్బో-పెట్రోల్, మూడోది 100 hp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ వేరియంట్‌.

9. టాటా పంచ్

టాటా పంచ్ ఎట్టకేలకు 10,414 యూనిట్లను విక్రయించి 9వ స్థానంలో నిలిచింది. నెలవారీ ప్రాతిపదికన, పంచ్ అమ్మకాలు 10,241 యూనిట్ల నుంచి కేవలం 1 శాతం మాత్రమే పెరిగాయి. దీంతో పంచ్‌ గత నెల 11వ స్థానం నుంచి రెండు స్థానాలు ఎగబాకింది. గత సంవత్సరం అక్టోబరులో తిరిగి లాంచ్‌ అయిన టాటా పంచ్, మిగిలిన కార్లు, ముఖ్యంగా నెక్సాన్‌ల మాదిరిగానే చాలా బాగా పని చేస్తోంది. పంచ్ అనేది ఓవరాల్ డిజైన్‌తో పంచ్‌గా కనిపించే మైక్రో-SUV. ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్‌లు, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7-అంగుళాల సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, పుడిల్ ల్యాంప్స్, రియర్-వ్యూ వంటి సాంకేతికతతో పంచ్ ఫీచర్ రిచ్‌గా ఉంది. టాటా పంచ్‌లో 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌ ఉన్నాయి. ఇంజిన్‌ 86 hp శక్తిని, 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పంచ్ మాన్యువల్‌లో 18.97 km/l, ఆటోమేటిక్ వేరియంట్‌లపై 18.82 km/l ARAI మైలేజ్‌ అందిస్తుంది.

ఇదీ చదవండి: కొవ్వొత్తి, అగ్గిపెట్టె ఉందని కేసు..! కోర్టులో పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?


8. మారుతి సుజుకి ఎర్టిగా

ఎనిమిదో నంబర్‌లో మారుతి సుజుకి కారు ఉంది. 10,423 యూనిట్ల అమ్మకాలతో, ఇది టాటా పంచ్‌ను అధిగమించింది. ఏడాది ప్రాతిపదికన, ఎర్టిగా అమ్మకాలు గతేడాది జూన్‌ 9,920 యూనిట్ల నుంచి 5 శాతం పెరిగాయి. అయితే నెలవారీగా విక్రయాలు పడిపోయాయి. మేలో 12,226 విక్రయించగా, ఎర్టిగా అమ్మకాలు 14 శాతం తగ్గి జూన్‌లో 10,423 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే మొత్తం ర్యాంకింగ్ కూడా గత నెలలో 6వ స్థానం నుండి 8వ స్థానానికి పడిపోయింది. అప్‌డేట్ చేసిన ఎర్టిగా ఇటీవలే 2022 ఏప్రిల్‌లో లాంచ్‌ అయింది. అప్‌డేట్ చేసిన ఫ్రంట్ గ్రిల్, డ్యూయల్-టోన్ అల్లాయ్‌లు, టెయిల్ గేట్‌లోని క్రోమ్ వంటి చిన్న డిజైన్‌లు హైలైట్ చేస్తాయి. అయితే లోపలి భాగంలో కొత్త మెటాలిక్ టేకు చెక్క ముగింపు కొత్తది. డాష్, సీట్లు ఇప్పుడు డ్యూయల్-టోన్ ఫాబ్రిక్‌తో వస్తాయి. మారుతి కొత్త 1.5-లీటర్ డ్యూయల్‌జెట్ ఇంజిన్‌తో ఎర్టిగా ఇంజిన్‌‌ను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 103 hp శక్తిని, 136.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో 5-స్పీడ్ మాన్యువల్ స్టాండర్డ్‌గా ఉంది. పాత 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో ప్యాడిల్ షిఫ్టర్‌లతో భర్తీ అయింది.

7. మారుతి సుజుకి డిజైర్

ఈ జాబితాలోని తదుపరి కారు మారుతి సుజుకి ఎంట్రీ-లెవల్ సెడాన్, డిజైర్. 2022 జూన్‌లో 12,597 యూనిట్ల అమ్మకాలతో, వార్షిక ప్రాతిపదికన వృద్ధి చాలా స్తబ్దుగా ఉంది. 2021 జూన్‌లో, మారుతి సుజుకి 12,639 యూనిట్ల డిజైర్‌లను విక్రయించింది. నెలవారీ ప్రాతిపదికన కూడా, మారుతి సుజుకి మేలో కేవలం 11,603 యూనిట్ల డిజైర్‌ను విక్రయించింది. కేవలం 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. డిజైర్ ఈ జాబితాలో ఉన్న ఏకైక సెడాన్. ఒకే 90 hp 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో వస్తుంది. కంపెనీ ప్రకారం.. డిజైర్ మాన్యువల్ వెర్షన్ కోసం 23.26 km/l, AMT వేరియంట్ కోసం 24.12 km/l మైలేజ్‌ అందిస్తుంది. ఇప్పుడు కొత్త గ్రిల్, ఫ్రంట్ బంపర్‌లు, ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్‌లు ఎక్స్‌టీరియర్‌ లుక్‌ను హైలైట్ చేస్తాయి. లోపలి భాగంలో, కొత్త SmartPlay Studio ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో అన్నీ చాలావరకు ఒకే విధంగా ఉంటాయి. కొన్ని ఫీచర్ అప్‌డేట్‌లలో క్రూయిజ్ కంట్రోల్, కలర్ TFT, ESC, హిల్-హోల్డ్ ఉన్నాయి. ఈ కారు ఇటీవలే ఫ్యాక్టరీకి ఫిట్టెడ్‌ CNG ఆప్షన్‌తో రూ.8.14 లక్షలతో లాంచ్‌ అయింది.

6. మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి చౌకైన కారు, ఆల్టో ఈసారి 13,970 యూనిట్ల విక్రయాలతో ఆరో స్థానంలో ఉంది. ఏడాది ప్రాతిపదికన, 2021 జూన్లో ఆల్టో అమ్మకాలు 12,513 యూనిట్ల నుంచి 10 శాతం పెరిగాయి. నెలవారీ ప్రాతిపదికన కూడా, ఆల్టో అమ్మకాలు మే 2022లో 12,933 యూనిట్ల నుంచి 6.5 శాతం పెరిగాయి. ఒక సింగిల్ 796cc పెట్రోల్ ఇంజిన్‌ 6,000 rpm వద్ద 48 hp గరిష్ట శక్తిని, 3,500 rpm వద్ద 69 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్టోకు కొంతకాలంగా పెద్దగా అప్‌డేట్ కనిపించలేదు. అయితే కొత్త ఆల్టో పొడవాటి-బాయ్ స్టాన్స్, స్క్వేర్ హౌసింగ్‌లో టెయిల్ ల్యాంప్స్‌తో రిఫ్రెష్డ్ డిజైన్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. లోపలి భాగంలో కూడా, కనీసం టాప్-స్పెక్ వేరియంట్‌లలో కీలెస్ ఎంట్రీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి కొత్త ఫీచర్లు ఉండవచ్చు.

5. హ్యుందాయ్ క్రెటా

టాప్-ఫైవ్‌లో ఈ కార్‌ ఉంది. జూన్‌లో 13,790 యూనిట్లను విక్రయించగా. గతేడాది జూన్‌లో 9,941 యూనిట్ల నుండి ఏడాది ప్రాతిపదికన 39 శాతం వృద్ధిని సాధించింది. నెలవారీ ప్రాతిపదికన కూడా, 2022 మే నెలలో క్రెటా 10,973 యూనిట్ల నుంచి 25 శాతం వృద్ధిని సాధించింది. మే నెలలో హ్యుందాయ్ క్రెటా కూడా అమ్మకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. హ్యుందాయ్ క్రెటా ఎల్లప్పుడూ కొరియన్ కార్ కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఉంది. హ్యుందాయ్ క్రెటా విషయానికొస్తే, SUV ఆఫర్‌లో మూడు ఇంజిన్‌ల ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ గరిష్టంగా 115 హెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత ఆఫర్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. 1.5-లీటర్ 115 hp శక్తిని, 143.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ 140 hp గరిష్ట శక్తిని, 242 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేసే మోడళ్లు ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, iMT, -స్పీడ్ DCT ఉన్నాయి.

4. టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ గత కొన్ని నెలలుగా అద్భుతంగా రాణిస్తోంది. 2022 జూన్‌లో 14,295 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మే నెలలో 14,614 యూనిట్ల కంటే స్వల్పంగా తక్కువగా ఉంది. అయితే, వార్షిక ప్రాతిపదికన, 2021 జూన్ అమ్మకాలు 8,033 యూనిట్ల నుంచి 78 శాతం పెరిగాయి. ఇది భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV. హ్యుందాయ్ క్రెటాను కేవలం 325 యూనిట్లతో ఓడించింది. అయితే, నెక్సాన్ నెలవారీ ర్యాంకింగ్ మేలో రెండవ స్థానం నుండి గత నెలలో నాలుగో స్థానానికి పడిపోయింది. Nexon రెండు టర్బోచార్జ్డ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. 1.2-లీటర్ పెట్రోల్ గరిష్టంగా 120 హెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మరోవైపు 1.5-లీటర్ డీజిల్ 110 హెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ AMT రూపంలో వస్తాయి.

ఇదీ చదవండి:  Liquor Consumption: అయ్యబాబోయ్.. దేశంలో మహిళలు ఎక్కువగా తాగే రాష్ట్రాలు ఏంటో తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !


3. మారుతి సుజుకి బాలెనో

మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో మూడవ స్థానంలో ఉంది. గత నెలలో 16,103 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2021 జూన్‌లో 14,701 యూనిట్ల నుంచి వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధిని సాధించింది. నెలవారీ ప్రాతిపదికన కూడా, బాలెనో మే 13,970 యూనిట్ల నుంచి 15 శాతం పెరిగింది. మేలో, బాలెనో అమ్మకాల చార్టులలో నాలుగో స్థానంలో నిలిచింది. బాలెనో కొత్త స్పోర్టీ లుక్‌ని అందించే సరికొత్త ఎక్స్‌టీరియర్‌లతో అప్‌డేట్ అయింది. కారు లోపలి భాగం కొత్త 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అనేక ఇతర ఫీచర్లతో వచ్చింది. వీటిలో అతిపెద్దది సెగ్మెంట్-ఫస్ట్ హెడ్స్-అప్ డిస్‌ప్లే. బాలెనో 90 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే ఒక 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ట్రాన్స్‌మిషన్‌లో 5-స్పీడ్ మాన్యువల్‌ని స్టాండర్డ్‌గా కొనసాగిస్తోంది. పాత CVT ట్రాన్స్‌మిషన్ ఎంపిక 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌ను తొలగించింది.

2. మారుతి సుజుకి స్విఫ్ట్

ఈసారి రెండో స్థానంలో నిలిచిన మారుతి సుజుకి స్విఫ్ట్, 16,213 యూనిట్ల విక్రయాలతో దూసుకుపోయింది. నెలవారీ విశ్లేషణలో, స్విఫ్ట్ అమ్మకాలు మేలో 14,133 యూనిట్ల నుండి 14.7 శాతం పెరిగాయి. అయితే వార్షిక ప్రాతిపదికన, గత ఏడాది జూన్‌లో 17,727 అమ్మకాలు జరిపి 9 శాతం మేర అమ్మకాలు పడిపోయాయి. అయినప్పటికీ, సుజుకి స్విఫ్ట్ స్థిరంగా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ 6,000 rpm వద్ద 88.5 hp గరిష్ట శక్తిని, 4,400 rpm వద్ద 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే ఏకైక 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో పని చేస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్‌లు ఉన్నాయి.

1. మారుతి సుజుకి వ్యాగనార్‌

2022 జూన్‌లో 19,190 యూనిట్ల అమ్మకాలతో మారుతి సుజుకి వ్యాగనార్ అగ్ర స్థానాన్ని నిలుపుకుంది. మే నెలలో, కంపెనీ 14 శాతం వృద్ధిని నమోదు చేస్తూ 16,814 యూనిట్లను విక్రయించింది. అయితే, సంవత్సరానికి సంబంధించిన విశ్లేషణలో, 2021 జూన్‌లో వ్యాగనార్‌ అమ్మకాలు స్వల్పంగా 1 శాతం తగ్గి 19,447 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. వ్యాగనార్‌ రెండు పెట్రోల్ ఆప్షన్‌లతో వస్తుంది. 1-లీటర్ పెట్రోల్ 67 hp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది, అయితే 1.2-లీటర్ గరిష్టంగా 90 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, డిజైర్ తరహాలోనే ఇంజిన్‌లు ఉంటాయి.

First published:

Tags: Best cars, Electric cars, MARUTI SUZUKI, Tech news

ఉత్తమ కథలు