Home /News /technology /

MARUTI SUZUKI BREZZA VARIANTS EXPLAINED THE BEST ONE IS TO BUY BUY UMG GH

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా వేరియంట్‌లలో ఏది కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? ఈ పూర్తి వివరాలు తెలుసుకోండి!

మారుతి సుజుకి బ్రెజ్జా గురించి పూర్తి వివరాలు ఇవిగో..  (Photo: Maruti Suzuki)

మారుతి సుజుకి బ్రెజ్జా గురించి పూర్తి వివరాలు ఇవిగో.. (Photo: Maruti Suzuki)

మారుతి సుజుకి తన సెకండ్‌ జనరేషన్‌ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ(SUV) బ్రెజ్జాను స్టార్టింగ్‌ ప్రైస్‌ రూ.7.99 లక్షల(ఎక్స్-షోరూమ్)తో లాంచ్‌ చేసింది. ఈ కారు ఇప్పుడు కొన్ని ముఖ్యమైన కాస్మెటిక్ మార్పులతో వస్తుంది, ముఖ్యంగా ఫ్రంట్ ఎండ్‌లో కొన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
మారుతి సుజుకి తన సెకండ్‌ జనరేషన్‌ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ(SUV) బ్రెజ్జాను స్టార్టింగ్‌ ప్రైస్‌ రూ.7.99 లక్షల(ఎక్స్-షోరూమ్)తో లాంచ్‌ (Launch) చేసింది. ఈ కారు ఇప్పుడు కొన్ని ముఖ్యమైన కాస్మెటిక్ మార్పులతో వస్తుంది, ముఖ్యంగా ఫ్రంట్ ఎండ్‌లో కొన్ని అదనపు ఫీచర్లు (Features) ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను అందించే మొట్టమొదటి మారుతి సుజుకి (Mauti Suzuki) కారు కొత్త బ్రెజ్జా కావడం గమనార్హం.

మారుతి LXi, VXi, ZXi, ZXi+ వంటి నాలుగు ట్రిమ్‌లలో బ్రెజ్జా కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. హుడ్ కింద, కారు కొత్త 1.5-లీటర్ K15C ఇంజిన్‌తో వస్తుంది. ఇది 137 Nm గరిష్ట టార్క్, 101.6 hp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది, అయితే 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా VXi, ZXi, ZXi+ వేరియంట్‌లతో అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్లు అన్నింటికీ ఇక టైప్ C ఛార్జరే.. మరి ఐ ఫోన్‌కు యూజర్ల పరిస్థితి ఏంటంటే..?


కొత్త బ్రెజ్జా బేస్ మోడల్ లేదా LXi MT వేరియంట్ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఇది అనేక ఫీచర్లతో వస్తుంది. ఇంటీరియర్‌లో, మోనోటోన్ ఇంటీరియర్ కలర్ థీమ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 12V పవర్ సాకెట్, వెనుక AC వెంట్‌లు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నారు. ఎస్‌యూవీలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

VXi MT, VXi AT వేరియంట్‌లు వరుసగా రూ.9.46 లక్షలు , రూ. 10.96 లక్షలకు లభిస్తాయి. ఈ వేరియంట్‌లు 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రికల్‌ అడ్జస్టబుల్, ఫోల్డబుల్ ORVM, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తున్నాయి.



ZXi MT, ZXi AT వేరియంట్‌లు వరుసగా రూ.10.86 లక్షలు, రూ. 12.36 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ఈ వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ప్రధాన హైలైట్. అదనంగా ఎస్‌యూవీ క్రూయిజ్ కంట్రోల్, Arkamys సౌండ్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ వాయిస్ అసిస్టెంట్, స్మార్ట్ కీతో పుష్-బటన్ స్టార్ట్, MID, TFT కలర్ డిస్‌ప్లే ఫీచర్‌లు ఉన్నాయి. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, వెనుక వైపర్, వాషర్, 60/40 సీట్ స్ప్లిట్ ఉన్నాయి.

అదే విధంగా ZXi MT వేరియంట్‌ ధర రూ.12.30 లక్షలుగా ఉంది. ZXi AT వేరియంట్ రూ.13.80 లక్షలు. వీటిలో సుజుకి-కనెక్ట్ కారు ఫీచర్‌లు, 360 వ్యూ కెమెరా, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, హెడ్స్-అప్ డిస్‌ప్లే, స్మార్ట్‌ప్లే ప్రో + సాఫ్ట్‌వేర్‌తో 9-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, యాంబియంట్ లైటింగ్ వంటి అన్ని ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నారు. ఎక్స్‌టీరియర్‌లో కారు డ్యూయల్-టోన్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటో-ఫోల్డింగ్ మిర్రర్‌లు వస్తున్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Auto News, Maruti cars, MARUTI SUZUKI, New cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు