హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Maruti Special Edition: Altoలో టచ్ స్క్రీన్.. మారుతి స్పెషల్ ఫెస్టివ్ ఎడిషన్స్ అదరహో

Maruti Special Edition: Altoలో టచ్ స్క్రీన్.. మారుతి స్పెషల్ ఫెస్టివ్ ఎడిషన్స్ అదరహో

మారుతి ఆల్టో(Photo: Maruti Suzuki)

మారుతి ఆల్టో(Photo: Maruti Suzuki)

మారుతి సుజుకి Alto, Celerio, WagonR స్పెషల్ ఎడిషన్ వేరియంట్స్ (special edition variants) భలే ఆకర్షణీయంగా ఉన్నాయి. అసలు ఇవన్నీ మార్కెట్లోకి ఎప్పుడు వచ్చాయనే కదా మీ అనుమానం.

మారుతి సుజుకి Alto, Celerio, WagonR స్పెషల్ ఎడిషన్ వేరియంట్స్ (special edition variants) భలే ఆకర్షణీయంగా ఉన్నాయి. అసలు ఇవన్నీ మార్కెట్లోకి ఎప్పుడు వచ్చాయనే కదా మీ అనుమానం. జస్ట్ ఒక్క రోజు క్రితమే ఇవి దీపావళి స్పెషల్ ఎడిషన్ కింద లాంచ్ అయ్యాయి. ఇప్పటికే బోలెడు ఫెస్టివ్ బొనాంజాలు (festive bonanza) అందిస్తున్న మారుతి, ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ తో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో దూసుకుపోయే ఎత్తుగడలు ప్రకటించింది. మారుతి కార్లంటే మనదేశంలో సామాన్య, మధ్యతరగతివారికి దశాబ్దాలుగా ఫేవరెట్ గా ఉంటూ వస్తున్నాయ. మరి ఆ ఫెస్టివ్ వేరియంట్స్ ఏంటో వాటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా?

లుక్కే మారింది

దీపావళి పండుగంటేనే మన ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అతిపెద్ద సీజన్. అలాంటి సీజన్ లో సేల్స్ ను విపరీతంగా పెంచుకునేందుకు మారుతి సుజుకి ఏకంగా ఫెస్టివ్ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసి కస్టమర్లను ఆకట్టుకుంటోంది. స్పెషల్ ఎడిషన్ మోడల్స్ అయిన ఆల్టో, సెలెరియో, వాగన్ ఆర్ ను లాంచ్ చేస్తున్నట్టు గురువారం మారుతి చేసిన ప్రకటనకు మంచి స్పందన వస్తోంది. స్పెషల్ ఎడిషన్ మోడల్స్ లో సరికొత్త యాక్సెసరీస్ తో కారు లుక్కును పూర్తిగా మార్చేలా ఉండటం విశేషం. అంతేకాదు ఇవి అప్ డేటెడ్ ఫీచర్స్ ఉన్న మోడల్స్అని మారుతి వివరించింది. మారుతి ఆల్టో ఫెస్టివ్ ఎడిషన్ మోడల్ లో పయనీర్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టం ఉండగా కెన్ వుడ్ స్పీకర్స్, డ్యూయల్ టోన్ సీట్ కవర్స్, సెక్యూరిటీ సిస్టం, స్టీరింగ్ వీల్ కవర్ ఇలా బోలెడు కొత్త ఫీచర్లను జతచేయడం విశేషం.

25,000 విలువైన కిట్

ఎంట్రీ లెవెల్ సెలెరియో హ్యాచ్ బ్యాక్ కు బ్లూటూత్ ఉన్న సోనీ డబుల్ డిన్ ఆడియో సిస్టం, ఆకట్టుకునే కొత్త సీట్ కవర్స్, పియానో బ్లాక్ బాడీ సైడ్ మౌల్డింగ్స్, డిజైనర్ మ్యాట్స్ వంటివి జత చేసి సరికొత్తగా కనిపించేలా డిజైన్ చేశారు. ఈ స్పెషల్ కిట్ (special kit) విలువ పాతిక వేలవరకు ఉంది. ఆల్టో స్పెషల్ కిట్స్ రూ.25,490 కాగా సెలెరియో స్పెషల్ కిట్స్ ధర రూ. 25,990గా ఉంది.

కొత్తగా వాగన్ ఆర్ లుక్

మనదేశంలో మోస్ట్ పాప్యులర్ వాగన్ ఆర్ కారు ఫెస్టివ్ కిట్ లో భాగంగా రేర్ బంపర్ ప్రొటెక్టర్స్, సైడ్ స్కర్ట్స్, ఫ్రంట్ అప్పర్ గ్రిల్ క్రోమ్ గార్నిష్, న్యూ ఫ్రంట్, స్టైలిష్ గా ఉన్న కవర్ సీట్స్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ వంటి చాలా ఫీచర్లను జత చేశారు. పెద్ద ఎత్తున కస్టమర్లను ఊరించేందుకు వీలుగా ఈ స్పెషల్ మోడల్స్ ను దీపావళి సందర్భంగా లాంచ్ చేసినట్టు సంస్థ ప్రకటించింది.

స్టాల్ వర్ట్స్ వే సేల్స్

ఈఏడాది ఎంట్రీ కార్ సెగ్మెంట్ (entry car segment) లో మారుతి సేల్స్ గణనీయమైన వృద్ధి రేటు నమోదు చేసుకున్నాయి. మారుతి సుజుకి స్టాల్ వర్ట్స్ (stalwarts) గా మార్కెట్లో ఎదిగిన ఆల్టో, వ్యాగన్ ఆర్, సెలెరియో సేల్స్ మొత్తం కలిపితే ఎంట్రీ సెగ్మెంట్లో 75శాతం షేరును సొంతం చేసుకున్నాయంటే మార్కెట్లో వీటికున్న ఆదరణ ఇట్టే అర్థమవుతుంది. మంచి పర్ఫామెన్స్ ఇచ్చే కార్లు, స్టైలిష్ గా కనిపించే కార్ల మోడల్స్ కు మనదేశంలో ఇబ్బడి ముబ్బడిగా డిమాండ్ ఉండడంతో దీన్ని అందిపుచ్చుకునేందుకు మారుతి సరికొత్త కసరత్తులు చేస్తోంది. ఫెస్టివ్ ఎడిషన్ వేరియంట్స్ (festive edition variants) అంటే దివాలీకి మంచి క్రేజ్ ఉందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్(Maruti Suzuki India Limited) ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ వెల్లడించారు.

Published by:Sumanth Kanukula
First published:

Tags: Automobiles

ఉత్తమ కథలు