• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • MARS 360 DEGREE STUNNING 360 DEGREE VISUALISATION FROM MARS SURFACE GOES VIRAL BUT HERES A CATCH NK

Mars 360 Degree: మార్స్‌పై 360 డిగ్రీస్‌లో అంతరిక్షాన్ని చూడండి... నాసా వీడియో

Mars 360 Degree: మార్స్‌పై 360 డిగ్రీస్‌లో అంతరిక్షాన్ని చూడండి... నాసా వీడియో

మార్స్‌పై 360 డిగ్రీస్‌లో అంతరిక్షం (image credit - NASA)

Mars 360 Degree: మన భూమిపై నుంచి చూస్తే అంతరిక్షం ఎలా ఉంటుందో మనకు తెలుసు. అదే మార్స్ గ్రహంపై నుంచి చూస్తే ఎలా ఉంటుందో వీడియో ద్వారా మీరే చూడండి.

  • Share this:
    Mars 360 Degree: మీకు మార్స్ (అంగారక గ్రహం లేదా అరుణ గ్రహం లేదా కుజ గ్రహం లేదా మంగళ గ్రహం) అంటే ఇష్టమా. రెక్కలు కట్టుకొని మార్స్‌పైకి వెళ్లి వాలాలనుకుంటున్నారా. ప్రస్తుతానికి అది సాధ్యం కాకపోవచ్చు గానీ... మార్స్ పై నుంచి రాత్రి వేళ అంతరిక్షాన్ని చూసేందుకు ఇప్పుడు వీలవుతోంది. ఆర్టిస్ట్ హ్యూగ్ హౌ... ఈ వీడియోని తయారుచేశారు. ఈమధ్య నాసా పంపిన పెర్సెవరెన్స్ (పట్టుదల) రోవర్... మార్స్‌పై క్షేమంగా దిగి... కంటిన్యూగా ఫొటోలు తీసి పంపిస్తోంది. వాటిని చూడాలని మనలాగే ఎంతో తాపత్రయ పడిన హ్యూగ్ హౌ... వాటిని సెట్ చేసి... 360 డిగ్రీ ఇంటరాక్టివ్ త్రీజీ వ్యూ నైట్ స్కై తయారుచేశారు. ఆ వీడియో చూస్తే... అది ఫొటోలతో సెట్ చేసిందంటే నమ్మలేరు.

    ఈ వీడియోని చూసేందుకు వర్చువల్ రియాలిటీ (VR) హెడ్ సెట్ ఉంటే మంచిదే. అది లేకపోయినా చూడవచ్చు. ఈ వీడియోను ఎలా చూడాలో తన ఫేస్ బుక్ పోస్టులో కొన్ని సలహాలను హ్యూగ్ ఇచ్చారు. కుడివైపు ఉన్న మార్క్ ఆధారంగా 360 డిగ్రీస్‌లో తిప్పి చూడొచ్చు.

    ఈ ఫొటోలను ఫిబ్రవరి 20న అమెరికా అంతిరక్ష పరిశోధనా సంస్థ - నాసా (NASA)... రోవర్ పెర్సెవరెన్స్ నావ్ కామ్స్ (Navcams) నుంచి సేకరించినట్లు హ్యూగ్ హౌ తెలిపారు. మొత్తం 6 ఫొటోలను కలిపి దీన్ని తయారుచేసినట్లు వివరించారు. ఈ పోస్టును ఇప్పటికే 16 లక్షల మంది షేర్ చేసుకున్నారు.



    అంతా బాగానే ఉన్నా... హౌ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఈ వీడియోలో కనిపిస్తున్న స్కై... పూర్తిగా పెర్సెవరెన్స్ పంపిన ఫొటోలదని కాదని హౌ తెలిపారు. స్కై కోసం కొన్ని మార్పులు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ... వర్చువల్ రియాల్టీ హెడ్ సెట్లతో దీన్ని చూస్తున్న వారు... నిజంగా మార్స్‌పై ఉన్నట్లే ఉందని ఫీల్ అవుతున్నారు.

    NASA, Mars, Perseverance, Perseverance images, Perseverance videos, International Space Station, life on mars, nasa study, మార్స్ గ్రహం, జీవించే అవకాశాలు, మార్స్ పై సూక్ష్మజీవులు, నాసా పరిశోధన,
    మార్స్ ఉపరితలం (image credit - NASA/JPL-Caltech/ASU)


    ఈ వీడియో సరే... మరి పెర్సెవరెన్స్‌కి సంబంధించి నాసా నిజంగా రెడీ చేసిన వీడియోలు చూడాలంటే... ఈ లింక్ లోకి వెళ్లండి. (https://mars.nasa.gov/mars2020/multimedia/videos/)

    అంతేకాదు... పెర్సెవరెన్స్ ఇప్పటివరకూ నాసాకు 5,614 ఫొటోలు పంపింది. వాటిని మీరే స్వయంగా చూడొచ్చు. అందు కోసం ఈ లింక్ లోకి వెళ్లండి (https://mars.nasa.gov/mars2020/multimedia/raw-images/)



    ఇది కూడా చదవండి: Covid 19: సోషల్ డిస్టాన్స్ పాటించే ప్రాణులు... ఇంట్రస్టింగ్ విషయాలు

    ఈ ఫొటోలను చూసి మీరు కూడా మార్స్ ఉపరితలంపై ఏముందో కనిపెట్టవచ్చు. మీకు ఏ గ్రహాంతర వాసో, వింత జీవి లాంటిదో కనిపిస్తే నాసాకు చెప్పొచ్చు. ఆలస్యం ఎందుకు శోధించండి మరి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు