MarQ M3 Smart: MarQ నుంచి తొలి స్మార్ట్​ఫోన్ లాంచ్.. బడ్జెట్​ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు

ప్రతీకాత్మకచిత్రం

ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని మార్క్యూ స్మార్ట్​బ్రాండ్ భారత మార్కెట్​లోకి తన​ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్​ను లాంచ్​ చేసింది. మార?

  • Share this:
ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని మార్క్యూ స్మార్ట్​బ్రాండ్ భారత మార్కెట్​లోకి తన​ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్​ను లాంచ్​ చేసింది. మార్క్యూ ఎం 3 స్మార్ట్ (MarQ M3 Smart) పేరుతో ఇది విడుదలైంది. ఈ సంస్థ ఇప్పటికే స్మార్ట్ టీవీలు, స్పీకర్​లను విడుదల చేయగా.. ఇప్పుడు స్మార్ట్​ఫోన్ మార్కెట్​లోకి ప్రవేశించింది. మార్క్యూ ఎం 3 స్మార్ట్​ హ్యాండ్‌సెట్​ను బడ్జెట్ రేంజ్​లోనే అందించడం విశేషం. ఇందులో అద్భుతమైన ఫీచర్లను జోడించింది. ఇది వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ డిస్​ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మార్క్యూ ఎమ్ 3 స్మార్ట్ అమ్మకానికి రానుంది.

Amazon Offers On TVs: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​లో స్మార్ట్​టీవీలపై భారీ డిస్కౌంట్లు


MarQ M3 Smart ధర :

కొత్త మార్క్యూ ఎం 3 స్మార్ట్ స్మార్ట్‌ఫోన్ సింగిల్​ వేరియంట్​లోనే లభిస్తుంది. దీని 2GB ర్యామ్​ + 32GB స్టోరేజ్​ వేరియంట్​ రూ. 7,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. అయితే, ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో దీన్ని కేవలం రూ. 6,299 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 7న ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీని విక్రయాలు ప్రారంభమవుతాయి. మార్క్యూ ఎం 3 స్మార్ట్ మొబైల్​ బ్లాక్, బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

మార్క్యూ ఎం 3 స్మార్ట్ స్పెసిఫికేషన్లు

మార్క్యూ ఎం 3 స్మార్ట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇది 6.088 -అంగుళాల హెచ్‌డి+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 2జీబీ ర్యామ్​తో జతచేసిన 1.6GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. 32 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​ను​ కలిగి ఉంటుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్ సహాయంతో దీని స్టోరేజ్​ను 256 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. మార్క్యూ M3 స్మార్ట్​ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్​ కెమెరా, బొకే లెన్స్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలను చేర్చింది. ఈ కెమెరాల్లో నైట్ మోడ్, బ్యూటీ మోడ్, స్లో మోషన్, టైమ్ లాప్స్ వంటి ఆప్షన్లను అందించింది. ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది.

Samsung Galaxy M52 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం52 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే


ఈ బ్యాటరీ 24 గంటల మ్యూజిక్, 9 గంటల మూవీ వ్యూ, 42 గంటల కాల్ టైమ్‌ని అందిస్తుంది. ఇందులో ఫేస్ అన్‌లాక్‌ ఫీచర్ సైతం ఉంది. అయితే ఇందులో బయోమెట్రిక్​ స్కానర్ మాత్రం లేదు. 3.5mm ఆడియో జాక్, మైక్రో యూఎస్​బీ పోర్ట్, డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, వైఫై బ్లూటూత్ v4.2, జీపీఎస్, 4జీ సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.
Published by:Krishna Adithya
First published: