Uber Air : ఉబెర్ నుంచీ ఇక హెలికాప్టర్ సేవలు... ఛార్జీ ఎంతో తెలుసా?

ఇన్నాళ్లూ... కార్ల సర్వీసులు అందించిన ఉబెర్... మరో అడుగు ముందుకేసింది. ఫ్లైయింగ్ టాక్సీలను అమెరికాలో అందుబాటులోకి తెచ్చింది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 10, 2019, 2:26 PM IST
Uber Air : ఉబెర్ నుంచీ ఇక హెలికాప్టర్ సేవలు... ఛార్జీ ఎంతో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: July 10, 2019, 2:26 PM IST
మన అవసరాలకు తగ్గట్టుగా... టెక్నాలజీని అందించాలి అప్పుడే ఏ కంపెనీ అయినా మనుగడ సాధించగలదు. ప్రముఖ కార్ల కంపెనీ ఉబెర్ ఈ ఫార్ములాని పక్కాగా పాటిస్తోంది. ఇప్పటికే కార్ల సర్వీసులు అందిస్తున్న ఈ సంస్థ... కొత్తగా ఉబెర్ ఎయిర్ సర్వీసులను ప్రారంభించింది. వీటి ద్వారా ఎవరైనా సరే... హెలికాప్టర్‌లో చేరాల్సిన చోటికి చేరవచ్చు. ఇప్పటివరకూ సొంత హెలికాప్టర్లలో లేదా ప్రైవేట్ హెలికాప్టర్లలో ఎక్కువ ఛార్జీలు చెల్లించి ప్రయాణించేవారు... ఇకపై తమ సర్వీసులలో తక్కువ ఛార్జీలకే వెళ్లవచ్చని ఉబెర్ ప్రకటించింది. ముందుగా... ఈ సర్వీసులను అమెరికా... న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచీ జాన్ ఎఫ్.కెనడి ఎయిర్‌పోర్ట్ వరకూ అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికిప్పుడు ఈ సేవలు ఉబెర్ డైమండ్, ప్లాటినం కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

న్యూజెర్సీకి చెందిన 'హెలీఫ్లైట్' అనే కంపెనీతో డీల్ కుదుర్చుకుంది ఉబెర్. ప్రస్తుతానికి రోజుకు 8 నుంచి 10 సర్వీసుల్ని నడుపుతోంది. 8 నిమిషాల ప్రయాణానికి రూ.15వేలు తీసుకుంటోంది. ఇది చాలా ఎక్కువ అని మనకు అనిపించవచ్చు. ఉబెర్ మాత్రం... ప్రస్తుతం ప్రైవేట్ జెట్స్‌కి చెల్లిస్తున్న రెంట్ల కంటే ఇది చాలా తక్కువే అవుతుందని చెబుతోంది. ఒక్కో హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు.

Loading...
ఈ సేవలు సక్సెస్ అయితే... అమెరికా అంతటా విస్తరిస్తారు. అలాగే... మరిన్ని దేశాల్లో కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి. ఐతే... ఇండియాలో ఈ సేవలు అందిస్తారా అన్నది మాత్రం కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. ఇండియాలో ఉబెర్ క్యాబ్ సర్వీసులు దేశమంతా విస్తరించాయి కాబట్టి... ఉబెర్ ఎయిర్ కూడా తీసుకొచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు.
First published: July 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...