అతని చేతిపై పురుషాంగం... అరుదైన ఆపరేషన్ చేసిన డాక్టర్

పురుషాంగాన్ని చేతిపై కూడా మొలిపించవచ్చని ఆ డాక్టర్ నిరూపించారు. ఇప్పుడా వ్యక్తి ఆ కొత్త పురుషాంగంతో ఊరట చెందుతున్నారు.

news18-telugu
Updated: August 3, 2020, 7:06 AM IST
అతని చేతిపై పురుషాంగం... అరుదైన ఆపరేషన్ చేసిన డాక్టర్
అతని చేతిపై పురుషాంగం... అరుదైన ఆపరేషన్ చేసిన డాక్టర్ (credit - twitter - The_bearded_Dr_Sina)
  • Share this:
చేతిపై పురుషాంగమేంటి? అని ఆశ్చర్యం కలగడం సహజం. వైద్యరంగం చాలా డెవలప్ అయ్యింది. చేతిపైనా పురుషాంగాన్ని మొలిపించి చూపిస్తున్నారు. అసలీ పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం తెలుసుకొని తీరాలి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా... వైద్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల్ని గ్రహించగలం. అసలేమైందంటే... బ్రిటన్‌కి చెందిన 45 ఏళ్ల మాల్కమ్ డొనాల్డ్‌ రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చింది. దాన్ని పెరీనియం అంటారు. ఈ ఇన్ఫెక్షన్ పుణ్యమా అని పురుషాంగం దెబ్బతిని 2014లో పూర్తిగా పోయింది. వృషణాలు మాత్రమే మిగిలాయి. ఆస్పత్రికి వెళ్తే తాము చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. అదే సమయంలో ఫ్యామిలీ డాక్టర్, ప్రొఫెసర్ డేవిడ్‌ రాల్ఫ్‌‌కి ఈ విషయం తెలిసింది.

అతని చేతిపై పురుషాంగం... అరుదైన ఆపరేషన్ చేసిన డాక్టర్ (credit - twitter - The_bearded_Dr_Sina)


లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆస్పత్రిలో పురుషాంగ మార్పిడిలో డేవిడ్ ఎక్స్‌పర్ట్. పురుషాంగం లేకుండా పుట్టిన ఆండ్రూ వార్డెల్‌‌కి ప్రత్యేక బయోనిక్‌ పురుషాంగం అమర్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మాల్కమ్ ఆయన్ని కలిసి మేటర్ చెప్పాడు. ధైర్యం చెప్పిన ఆండ్రూ... కొత్త అంగాన్ని మొలిపిస్తాననీ... కాకపోతే... దాన్ని చేతిపైన మాత్రమే మొలిపించగలనని చెప్పారు. ఎక్కడో చోట మొలిపించమని మాల్కమ్ కోరారు. పురుషాంగం పూర్తిగా తయారవ్వడానికి రెండేళ్లు పడుతుందని చెప్పారు ఆండ్రూ. సరే అన్నారు మాల్కమ్. ఇందుకు రూ.50 లక్షలు రెడీ చేసుకోమని చెప్పగా... ఆ డబ్బును ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. దాంతో ట్రీట్‌మెంట్ మొదలైంది.

డాక్టర్ల టీమ్... పాడైన అంగానికి సంబంధించిన రక్త నాళాలు, నాడుల్ని తీసుకొని... కొత్త అంగం మొలిపించేందుకు ట్రై చేశారు. ఎడమ చేతి మీద చర్మాన్ని కొద్దికొద్దిగా సేకరించి... దాన్ని అంగం ఆకారంలో తయారుచేశారు. తద్వారా అతను మూత్రం వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. నాలుగేళ్లకు పూర్తిగా అంగం తయారైంది. మరి అది అలా ఎడమ చేతికే ఉంటే ఇబ్బంది కదా. త్వరలో మరో ఆపరేషన్ చేయబోతున్నారు. దాన్ని చేతి నుంచి తొలగించి... రెగ్యులర్ ప్లేస్‌లో సెట్ చెయ్యబోతున్నారు. ఇందుకు కూడా కరోనా వైరస్ సమస్యగా మారింది. ఈ వైరస్ పోతే... ఇదే సంవత్సరం చివర్లో... ఆపరేషన్ జరిగే ఛాన్సుంది. ప్రస్తుతానికి మాల్కమ్... పొడుగు చేతుల షర్ట్స్ వాడుతూ... కవర్ చేసుకుంటున్నారు. డాక్టర్లు చెప్పిన దాని కంటే... రెండు అంగుళాలు పెద్దగానే ఉండాలని కోరినందుకు ఇప్పుడు మాల్కమ్ ఇబ్బంది పడుతున్నారు. పెద్దగా ఉన్న పురుషాంగాన్ని కవర్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఈ అద్భుత ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.
Published by: Krishna Kumar N
First published: August 3, 2020, 7:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading