Home /News /technology /

MAN SURPRISINGLY FINDS APPLE IPHONE IN WORKING CONDITION 10 MONTHS AFTER DROPPING IT IN RIVER DETAILS HERE VB

Smart Phone: 10 నెలలు నీటిలో ఉన్నా ఆ ఫోన్ పని చేసింది.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వివరాలిలా..

Mobile Tips

Mobile Tips

యునైటెడ్ కింగ్‌డమ్‌(లండన్ ) లోని ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. పది నెలల క్రితం తన ఫోన్‌ను ఓ నదిలో పోగొట్టుకున్నాడు. అది తిరిగి తనకు దొరికినట్లు తెలిపారు.

యునైటెడ్ కింగ్‌డమ్‌(United Kingdom)(లండన్ ) లోని ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. పది నెలల క్రితం తన ఫోన్‌ను(Smart Phone) ఓ నది(River)లో పోగొట్టుకున్నాడు. అది తిరిగి తనకు దొరికినట్లు తెలిపారు. ఆ ఫోన్ ప‌ది నెల‌ల త‌ర్వాత(Ten Months Later) కూడా నీటిలో ప‌డ‌క ముందు ఎలా ప‌నిచేస్తుందో అదే విధంగా ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను మిగ్వేల్ ప‌చేకో అనే వ్య‌క్తి త‌న ఫేస్‌బుక్ పోస్ట్‌లో(Facebook Post) వెల్ల‌డించాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూకే లోని(UK) ఎండింగ్‌బ‌ర్గ్‌కు చెందిన ఒవేన్ డేవిస్ (Davis) అనే వ్య‌క్తి గ‌తేడాది ఆగ‌స్టులో(August) త‌న కుటుంబ స‌భ్యుల‌తో కలిసి సిండ‌ర్ ఫోర్డ్ స‌మీపంలోని వేయ్ న‌దిలో విహారానికి వెళ్లాడు. పడవలో అతడు వెళ్తుండగా.. తన యాపిల్ ఫోన్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది.

Mega Job Mela In Hyderabad: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు మెగా జాబ్ మేళా..


నీటి మీద కాకుండా బయట ఎక్కడైనా పడితే వెతికే వారు.. కానీ ఆ ఫోన్ నీటిలో పడటంతో అతడు చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లాడు. ఆ ఫోన్ సంగతే మరచిపోయాడు. దాదాపు 10 నెలల తర్వాత ఆ ఫోన్ మిగ్వెల్ అనే వ్యక్తికి దొరికింది. ఆశ్చర్యం ఏంటంటే.. ఆ ఫోన్ ను శుభ్రం చేసి ఆరబెట్టాడు. తర్వాత రోజు ఆ ఫోన్ కు చార్జింగ్ పెట్టగానే పని చేసింది.

అయితే ఆ ఫోన్ ఎవరో నదిలో పొగొట్టుకున్నారని గ్రహించిన మిగ్వెల్ అందులో నిక్షిప్తమైన ఫొటోలను, సమాచారాన్ని సేకరించాడు. ఎలాగైన దొరికిన ఈ ఫోన్ ను అతడు పోగొట్టుకున్న వ్యక్తికి అందించాలని నిర్ణయించుకున్నాడు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఆ ఫోన్ దొరికిన తీరును పోస్ట్ చేశారు. ఆ పోస్టు కాస్త వైరల్ కావడంతో.. సోష‌ల్ మీడియాలో ప‌లువురి సాయంతో ఆ ఫోన్ య‌జ‌మాని డేవిస్ త‌న మొబైల్‌ను తాను ద‌క్కించుకోగ‌లిగాడు.

TS EAMCET 2022 Preparation Tips: ఎంసెట్ లో మంచి స్కోర్ సాధించడం ఎలా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..


ఈ సందర్బంగా అతడు ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిగ్వెల్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఫోన్ దొరకదని తాను అనుకున్నట్లు చెప్పాడు. 10 నెలలు నీటిలో ఉన్నా గానీ.. తన ఫోన్ పనిచేస్తుండటంతో అతడు సంతోషం వ్యక్తం చేశాడు. అయితే అది ఐ ఫోన్ అయినా.. ఏ మోడల్ ఫోన్ అనేది మాత్రం తెలియ రాలేదు. కానీ ప్రస్తుతం విడుద‌లైన అన్ని iPhone లు IP68 రేటింగ్‌తో త‌యారు చేయ‌బ‌డుతున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Apple iphone, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు