Swiggy Delivery: చెన్నైలో ఆర్డర్... రాజస్తాన్‌ నుంచి ఫుడ్ డెలివరీ

భార్గవ్ రాజన్ ట్వీట్ చూసి నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేశారు. అంత దూరం నుంచి డెలివరీకి కేవలం రూ.138 మాత్రమేనా అని ఒకరు, నార్త్ ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేసినందుకు రాజస్తాన్ నుంచి ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టున్నారు అని ఇంకొకరు ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు.

news18-telugu
Updated: February 20, 2019, 7:22 AM IST
Swiggy Delivery: చెన్నైలో ఆర్డర్... రాజస్తాన్‌ నుంచి ఫుడ్ డెలివరీ
Swiggy Delivery: చెన్నైలో ఆర్డర్... రాజస్తాన్‌ నుంచి ఫుడ్ డెలివరీ (Image tweeted by @bhargavrajan / Twitter)
news18-telugu
Updated: February 20, 2019, 7:22 AM IST
మీరెప్పుడైనా స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశారా? పార్శిల్ ఆలస్యంగా వచ్చేటట్టైతే మీకు సమాచారం ఇస్తుంది స్విగ్గీ. అంతేకాదు... స్విగ్గీ ఎంప్లాయ్ ఎంత సేపట్లో మీ దగ్గరకు రావొచ్చో యాప్‌లో చూసుకోవచ్చు కూడా. చెన్నైలో భార్గవ్ రాజన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే 12 నిమిషాల్లో డెలివరీ బాయ్ వచ్చేస్తాడని సమాచారం కనిపించింది. ఇంతకీ డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడో చూద్దామని కస్టమర్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే షాక్. డెలివరీ బాయ్ ఉన్నది చెన్నైలో కాదు. లొకేషన్ రాజస్తాన్‌లో చూపించడంతో అవాక్కయ్యాడు. అనుమానం వచ్చి యాప్ మళ్లీ ఓపెన్ చేసి చూశాడు. నిజంగానే స్విగ్గీ ఎంప్లాయ్ లొకేషన్ రాజస్తాన్‌లో చూపించింది. వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.


భార్గవ్ రాజన్ ట్వీట్ అందర్నీ ఆశ్చర్యపర్చింది. యాప్‌లో బగ్ వల్ల అలా చూపించి ఉండొచ్చని రిప్లై ఇచ్చింది. అలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.




ఇక భార్గవ్ రాజన్ ట్వీట్ చూసి నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేశారు. అంత దూరం నుంచి డెలివరీకి కేవలం రూ.138 మాత్రమేనా అని ఒకరు, నార్త్ ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేసినందుకు రాజస్తాన్ నుంచి ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టున్నారు అని ఇంకొకరు ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు.




ఇక మరో సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అయిన రెడ్డిట్‌లో సైతం ఇదే చర్చ. 2100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే కనీసం 40 గంటల సమయం పడుతుందని, మరి 12 నిమిషాల్లో డెలివరీ ఎలా చేస్తాడంటూ చర్చించుకున్నారు నెటిజన్లు.

Bhargav Rajan tweet on swiggy, chennai order, delivery man rajasthan, food delivery, food delivery app swiggy, food delivery chennai, funny delivery, rajasthan to chennai swiggy, swiggy food delivery app, swiggy funny order, చెన్నై టు రాజస్తాన్ ఫుడ్ డెలివరీ, స్విగ్గీ ఫుడ్ డెలివరీ, భార్గవ్ రాజన్ ట్వీట్, స్విగ్గీ యాప్

మొత్తానికి యాప్‌లో ఓ చిన్న లోపం కారణంగా చెన్నైలో ఆర్డర్ చేస్తే రాజస్తాన్‌ నుంచి ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు కనిపించిందని స్విగ్గీ ఇచ్చిన వివరణతో తేలిపోయింది.
Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Good News: రియల్‌మీ 3 వచ్చేస్తోంది... ట్వీట్ చేసిన కంపెనీ

VIVO V15 PRO: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లతో వివో ఫోన్లు

Ban TikTok: టిక్‌ టాక్ యాప్‌ను బ్యాన్ చేయండి... పెరుగుతున్న డిమాండ్లు
First published: February 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...