హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Apple Watch: సముద్రంలో పోయిన యాపిల్ వాచ్.. ఫైండ్ మై యాప్ ద్వారా గుర్తించిన వ్యక్తి..!

Apple Watch: సముద్రంలో పోయిన యాపిల్ వాచ్.. ఫైండ్ మై యాప్ ద్వారా గుర్తించిన వ్యక్తి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్, వాచ్, ఇతర డివైజ్‌లు మిస్ అయితే, వాటిని ఈజీగా ట్రాక్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తాజాగా సముద్రంలో కొట్టుకుపోయిన యాపిల్ స్మార్ట్‌వాచ్‌ను ఇలాంటి టెక్నాలజీతో కనిపెట్టారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Apple Watch: నిన్న మొన్నటి వరకు స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్(Smart watch) వంటి డివైజ్‌లను పొగొట్టుకుంటే తిరిగి వాటిని కనుగొనడం కష్టం. అలా పొగొట్టుకున్నవారు చేసేదిలేక కొత్త డివైజ్‌లను కొనుగోలు చేసేవారు. లేదంటే పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చి, రికవరీ కోసం వెయిట్ చేసేవారు. అయితే ఇటీవల వస్తున్న స్మార్ట్ గాడ్జెట్స్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ(Advanced technology) కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్, వాచ్, ఇతర డివైజ్‌లు మిస్ అయితే, వాటిని ఈజీగా ట్రాక్(Track) చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తాజాగా సముద్రంలో కొట్టుకుపోయిన యాపిల్ స్మార్ట్‌వాచ్‌ను ఇలాంటి టెక్నాలజీతో కనిపెట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిలియన్ వెబ్‌సైట్ R1 రిపోర్ట్ ప్రకారం, జెఫెర్సన్ రోచా అనే వ్యక్తికి యాపిల్ వాచ్ ఉంది. ఇటీవల అతడు బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోకు సమీపంలోని బుజియోస్‌‌లో ఉన్న సముద్రంలో స్కూనర్ ట్రిప్ చేస్తూ స్మార్ట్‌వాచ్‌ పొగొట్టుకున్నాడు. అయితే ఫైండ్ మై యాప్ (Find My app) ఉపయోగించి కొన్ని రోజుల తరువాత దాన్ని తిరిగి పొందాడు.

* ట్రాకింగ్ కోసం ఫైండ్ మై యాప్

రోచా సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్లినప్పుడు, అతడి మణికట్టు నుంచి పట్టీ జారడంతో యాపిల్ వాచ్ నీటిలో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత వాచ్ పొయిందన్న విషయం గుర్తించి నీటిలో వెతికాడు. అయితే ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. వాచ్ కనపడకపోవడంతో ఆశ వదులుకున్నాడు. అయితే కొన్ని రోజుల తరువాత ఫైండ్ మై యాప్‌‌ ద్వారా తన యాపిల్ వాచ్‌ను ట్రాక్ చేయడానికి ప్రయత్నించాడు.

ఇటీవల కాలంలో యాపిల్ స్మార్ట్‌వాచ్‌లలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో బెస్ట్ ఫీచర్స్ ఉంటున్నాయి. రోచా పొగొట్టుకున్న వాచ్‌ GPSతో పాటు అడ్వాన్స్‌డ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్స్ కారణంగా రోచాకు ఫైండ్ మై యాప్ ద్వారా వాచ్ ఆన్ అయిందని నోటిఫికేషన్ వచ్చింది. దీంతో తన యాపిల్ స్మార్ట్‌వాచ్ దొరికిన వ్యక్తిని గుర్తించడానికి అతడు ప్రయత్నించాడు.

3D Bridge: ఐఐటీ హైదరాబాద్​ అరుదైన ఘనత... 3D టెక్నాలజీతో బ్రిడ్జ్ తయారీ

* 16 ఏళ్ల అమ్మాయి నుంచి మెసేజ్

రోచా లాస్ట్ మోడ్‌ను ఆన్ చేసి, వాచ్ దొరికిన వ్యక్తికి సంబంధించిన కొంత సమాచారాన్ని సేకరించాడు. తర్వాత యాపిల్ వాచ్‌ను కనుగొన్నట్లు అతడికి 16 ఏళ్ల అమ్మాయి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ వచ్చింది. యాపిల్ వాచ్‌ను కనుగొన్న వ్యక్తి కుమార్తె రోచాకు మెసేజ్ చేసింది. వారు బుజియోస్‌లో ఉన్నప్పుడు వాచ్ దొరికిందని, దాన్ని తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారని రోచా పేర్కొన్నారు.

* డ్రైవర్‌కు దొరికిన స్మార్ట్‌వాచ్

యాపిల్ స్మార్ట్‌వాచ్‌ 50 ఏళ్ల డైవర్ ఫిల్హోకు దొరికింది. అతనికి 16 ఏళ్ల అమ్మాయి ఉంది. పోగొట్టుకున్న వస్తువులను వాటి యజమానులకు తిరిగి ఇవ్వడానికి ఫిల్హో ఆసక్తి చూపుతుంటాడు. అతని కుమార్తె కూడా ఇందుకు సాయం చేస్తుంది. వీరు యాపిల్ వాచ్‌ను ఆన్ చేయగానే, రోచా ఫైండ్ మై యాప్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో దాన్ని వెంటనే యజమానికి అందజేయాలని ఫిల్హో తన కూతురితో చెప్పాడు. అలా వారు రోచాకు యాపిల్ వాచ్‌ను తిరిగి ఇచ్చారు. కాగా, రెండు రోజుల పాటు నీటిలో ఉన్నా, యాపిల్ స్మార్ట్ వాచ్ తిరిగి పనిచేయడం గమనార్హం.

First published:

Tags: Apple watch, Smartwatch

ఉత్తమ కథలు