హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon: అమెజాన్‌ డెలివరీతో అవాక్కయిన కస్టమర్‌.. ఏమొచ్చిందో తెలుసా?

Amazon: అమెజాన్‌ డెలివరీతో అవాక్కయిన కస్టమర్‌.. ఏమొచ్చిందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెజాన్ లేటెస్ట్‌ సేల్‌లో ఓ వ్యక్తి PS5 గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ బండిల్‌ను కొనుగోలు చేశారు. అతని ఆర్డర్‌ను అమెజాన్‌ యాక్సెప్ట్‌ చేసింది. చివరికి ఆర్డర్‌ డెలివరీ అందుకున్న వినియోగదారుడు అవాక్కయ్యాడు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ప్రస్తుతం ఈకామర్స్‌ బిజినెస్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాదాపు అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో (Online) బుక్‌ చేస్తున్నాయి. అయితే ఒక వస్తువుకు బదులు మరో వస్తువు డెలివరీ అవుతున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అమెజాన్ లేటెస్ట్‌ సేల్‌లో ఓ వ్యక్తి PS5 గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ బండిల్‌ను కొనుగోలు చేశారు. అతని ఆర్డర్‌ను అమెజాన్‌ (Amazon) యాక్సెప్ట్‌ చేసింది. చివరికి ఆర్డర్‌ డెలివరీ అందుకున్న వినియోగదారుడు అవాక్కయ్యాడు. అమెజాన్‌ నుంచి వచ్చిన పార్శిల్‌లో గేమింగ్ కన్సోల్‌కు బదులుగా రెండు బ్లూటూత్ స్పీకర్‌లు ఉన్నాయి. అమెజాన్‌ సేవలపై వినియోగదారుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Redditలో కొనుగోలుదారు (r/checknmater) చేసిన పోస్ట్ ప్రకారం.. అతను 2023 ఫిబ్రవరి 07 మధ్యాహ్నం 12 గంటలకు కే కే ఓవర్సీస్ కార్పొరేషన్ నుంచి PS5 గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ బండిల్‌ను కొనుగోలు చేశాడు. ఈ ప్రొడక్ట్‌ అమెజాన్‌ ద్వారా ఎలక్ట్రానిక్స్ బజార్ స్టోర్ సెల్లర్‌ పేరిట షిప్‌మెంట్‌ అయిందని కొనుగోలుదారు పేర్కొన్నారు. కొనుగోలుదారు డెలివరీ, అన్‌ప్యాకింగ్‌ను రికార్డ్ కూడా చేశారు. ప్రస్తుతం అమెజాన్ నుంచి పరిష్కారం కోసం వేచి ఉన్నారు. అమెజాన్‌లో ఈ సమస్యను ఇన్వెస్టిగేట్‌ చేస్తున్న అధికారులు ప్రతిస్పందించడానికి కనీసం మూడు రోజుల సమయం తీసుకుంటారు.

ఈ సెల్లర్స్‌ నుంచి PS5 కన్సోల్‌ను కొనుగోలు చేయవద్దని, బదులుగా ఆఫ్‌లైన్ స్టోర్‌లకు వెళ్లండని కొనుగోలుదారులకు తన పోస్ట్‌లో తెలియజేశాడు. తాను చాలా కఠినమైన పాఠం నేర్చుకున్నానని, ఎంతో ఆశగా ఉన్న నాకు నిరాశే మిగిలిందని, మానసికంగా బాధపడ్డానని, వాస్తవంగా చెప్పాలంటే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితని పేర్కొన్నారు. అమెజాన్ రీఫండ్ చేస్తుందని లేదా PS5ని పంపుతుందని ఆశగా ఎదురు చూస్తున్నానని చెప్పారు.

రూ.10 వేల 4 బర్నర్స్ ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్ రూ.1,900కే.. సూపర్ డూపర్ ఆఫర్!

ఈ క్రమంలో ప్లే స్టేషన్ ఇండియా సబ్‌రెడిట్‌లోని ఇంకొందరు వినియోగదారులు కూడా ఇలాంటి సంఘటనలను పేర్కొన్నారు. OTPని డెలివరీ బాయ్‌కి తెలియజేసే ముందు ఒక్కసారి ఆర్డర్‌ను ధ్రువీకరించుకోవడం ఉత్తమమని ఓ వినియోగదారుడు సూచించారు. కొంతమంది వినియోగదారులు కే కే ఓవర్సీస్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ బజార్ స్టోర్(Kay Kay Overseas and Electronics Bazar Store) చట్టబద్ధమైన సెల్లర్స్‌ అని, వారి నుంచి ఆర్డర్ చేసినప్పుడు తమకు ఎటువంటి సమస్యలు రాలేదని పేర్కొన్నారు. సెల్లర్‌ తరఫున కొందరు స్పందించారు. సెల్లర్‌ చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తారని, ఆర్డర్‌ని మిస్‌హ్యాండిల్‌ చేసి ఉంటారని చెప్పారు. మరొక వినియోగదారు అదే సెల్లర్‌ నుంచి PS5ని కొనుగోలు చేస్తే సక్రమంగా డెలివరీ అయిందని వివరించాడు.

రూ.19,990 స్మార్ట్‌టీవీ రూ.7 వేలకే.. మూడేళ్లు వారంటీ!

భారతదేశంలో PS5 గాడ్ ఆఫ్ వార్ బండిల్ ధర రూ.59,390గా ఉందని, ఇంత మొత్తంలో నష్టపోవడం ఎవరికైనా భారమే. ఈ సమస్యపై అమెజాన్ స్పందన చూడాల్సి ఉంది. మరోవైపు PS5 ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తక్షణమే అందుబాటులో ఉండేలా సోనీ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల రీస్టాక్ విక్రయాలు విజయవంతమయ్యాయి. ఆఫ్‌లైన్ స్టాక్‌లు పుష్కలంగా ఉన్నాయి.

First published:

Tags: Amazon, AMAZON INDIA, Home delivery, Latest offers

ఉత్తమ కథలు