Gmail Features: జీమెయిల్ యాప్‌లో అదిరిపోయే ఫీచ‌ర్‌.. నేరుగా వాయిస్ కాల్ చేసుకోవ‌చ్చు

ప్రతీకాత్మక చిత్రం

జీమెయిల్(Gmail) వినియోగ‌దారుల‌కు అదిరిపోయే ఫీచ‌ర్‌(Feature)ను ప‌రిచ‌యం చేస్తోంది. ఇక మీద జీమెయిల్ మెబైల్ యాప్‌ను ఉప‌యోగించి నేరుగా గూగుల్ మీట్(Google Meet) యూజ‌ర్లు వాయిస్ కాల్(Voice Call) చేసే సౌక‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

  • Share this:
    జీమెయిల్(Gmail) వినియోగ‌దారుల‌కు అదిరిపోయే ఫీచ‌ర్‌ను ప‌రిచ‌యం చేస్తోంది. ఇక మీద జీమెయిల్ మెబైల్ యాప్‌ను ఉప‌యోగించి నేరుగా గూగుల్ మీట్(Google Meet) యూజ‌ర్లు వాయిస్ కాల్ చేసే సౌక‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఈ ఫీచ‌ర్ ద్వారా వినియోగ‌దారుల‌కు ఎంతో సౌక‌ర్యాంగా ఉంటుంద‌ని జీమెయిల్ అభిప్రాయ‌ప‌డింది. ఇక‌పై జీమెయిల్ వినియోగ‌దారులు ఒక‌రికి ఒక‌రు వాయిస్ కాల్‌, వీడియో కాల్ చేసుకొనే సౌక‌ర్య‌న్ని క‌ల్పించ‌నున్న‌ట్టు జీమెయిల్ తెలిపింది. భవిష్యత్తులో వాయిస్‌ఇంటర్నెట్‌ ప్రొటోకాల్స్‌ను చేసే సామర్థ్యాన్ని కూడా గూగుల్‌ అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు స‌మాచారం.

    జీమెయిల్‌ యాప్స్‌లో గ్రూప్‌ చాట్‌(Group chat) సర్వీసులను కూడా యూజర్లు(Users) పొందే సౌకర్యాన్ని గూగుల్‌ అందించనుంది. ఈ ఫీచ‌ర్‌తోపాటు గూగుల్ మ‌రిన్ని ఫీచ‌ర్ల‌ను వినియోగ‌దారుల‌కు అందించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌వేశ‌పెట్టిన ఈ ఫీచ‌ర్ ద్వారా క్యాలెండర్, డ్రైవ్, డాక్స్, షీట్‌, స్లయిడ్‌లు, మీట్, టాస్క్‌లతో సహా ఇతర గూగుల్ వర్క్‌స్పేస్ టూల్స్‌ను వినియోగించుకొని గూగుల్ మీటింగ్‌ల‌ను ఎంతో మెరుగ్గా వినియోగించుకోవ‌చ్చ‌ని గూగుల్ తెలిపింది.

    Gmail Password: జీమెయిల్ పాస్‌వర్డ్ మార్చడం చాలా సింపుల్... ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి




    అంతే కాకుండా గ్రూప్ చాట్‌ల‌ను ప్రోత్స‌హించేలా మ‌రింత సౌక‌ర్యంగా గ్రూప్ చాట్‌లో డాక్యుమెంట్‌లను షేర్ చేయడానికి సులువుగా ఉండేలా చూస్తోంది. అంతే కాకుండా ఈ గ్రూప్ చాట్‌లోని ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాల‌ను సేవ్ చేసుకొనే అవ‌కాశాన్ని జీమెయిల్ అందిస్తోంది. అంతే కాకుండా జీమెయిల్ వినియోగ‌దారుకు వ‌ర్క్ డే లొకేష‌న్ (Location) స్టోర్  సౌక‌ర్యాన్ని
    అందించనుంది.

    ప్ర‌స్తుతం గూగుల్(Google) అందిస్తున్న ఈఫీచ‌ర్స్ అన్ని గూగుల్ సంబంధిత యాప్‌లతోపాటు చాట్‌, స్పేసెస్‌, గూగుల్‌మీట్‌కు సంబంధించిన యాప్‌ల‌ను అనుసంధానంగా ప‌ని చేయ‌నున్నాయి. ప్ర‌స్తుతం గూగుల్‌ మీట్‌ బటన్‌పై క్లిక్‌(Click) చేసిన తరువాత జనరేట్‌(Generate) ఐనా లింక్‌ను ఇతరులకు పంపడం ద్వారా వీడియో కాలింగ్‌ను చేయవచ్చును ప్రస్తుతం తెచ్చిన ఫీచర్‌తో నేరుగా జీమెయిల్‌ ఖాతాతో గూగుల్‌ మీట్‌ పాల్గొనే సదుపాయం కల్గనుంది. తాజాగా గూగుల్‌ మీట్‌ కంపానియన్‌ మోడ్‌ను నవంబర్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్‌ ప్రయత్నిస్తుంది.
    పొరపాటున పంపించిన మెయిల్ ను Undo చేయొచ్చు..
    అయితే జీమెయిల్ ద్వారా ఏదైనా మెయిల్ ను పొరపాటున పంపిస్తే మళ్లీ దానిని అన్ సెండ్ చేయడం కష్టమని చాలా మంది వినియోగదారుల భావన. అయితే.. జీమెయిల్ లో అన్ సెండ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇందు కోసం ముందుగా Gmail ని ఓపెన్ చేయండి. Gmail ఓపెన్ చేసిన తర్వాత, మీకు కుడి వైపున సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు అక్కడ మీకు Undo Send అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పక్కనే Send cancellation period అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కనిపించే డ్రాప్ డౌన్ బాక్స్ లో 5, 10, 20, 30 సెకండ్స్ ఆప్షన్లలో ఏదో ఓకటి ఎంచుకోవాలి. తర్వాత ‘Save Changes’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఈ ఫీచర్ యాక్టివేట్ చేయబడుతుంది. ఇప్పటి నుంచి మీరు ఎవరికైనా ఇమెయిల్ పంపిన వెంటనే, దిగువన Undo బటన్ కనిపిస్తుంది. దీంతో మీరు ఇప్పటి నుంచి ఎవరికైనా పంపిన ఈమెయిల్ ను సులభంగా తొలగించుకోవచ్చు.
    Published by:Sharath Chandra
    First published: