Home /News /technology /

MAKE SURE YOU HAVE MOTOR INSURANCE THIRD PARTY POLICY IS MANDATORY UMG GH

Motor Insurance: వర్షాకాలంలో కార్లు పాడైపోయే ప్రమాదం.. నష్టాలను కవర్ చేసే మోటార్‌ ఇన్సూరెన్స్‌ బెనిఫిట్స్ ఇవే..!

car insurance

car insurance

ఈ సీజన్‌లో వాహనాలకు మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అదనపు రక్షణ అందించే యాడ్-ఆన్ ఫీచర్‌లలో పెట్టుబడి పెట్టడం కూడా అంతే ముఖ్యం. వర్షాకాలంలో వాహనాన్ని భద్రంగా ఉంచుకునేందుకు.. రైడ్‌ను ఎంజాయ్‌ చేసేందుకు ఈ సూచనలు పాటించండి.

వేసవి ఉష్ణోగ్రతలతో ఉక్కపోతల మధ్య గడిపిన భారతీయ ప్రజలకు రుతుపవనాల రాక చల్లని శుభవార్త వంటిది. ఈ సమయం కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. లాంగ్ డ్రైవ్‌లు, వారాంతపు విహారయాత్రలు ఎంజాయ్‌ చేయడానికి ప్లాన్‌లు చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో చినుకులతోపాటు రోడ్డుపై గుంతలు కూడా పడతాయి. అధ్వానంగా మారిన రహదారులపై ప్రయాణాలు ప్రయాసతో కూడుకున్నవి. ఈ అధ్వాన్న పరిస్థితులు ఎవ్వరూ విస్మరించలేరు. సాధారణంగా ఈ సమస్యల భారాన్ని ప్రధానంగా భరించేది వాహనాలు. ఆహ్లాదకరమైన ప్రయాణం కోసం దాని భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.

మాన్‌సూన్ డ్రైవ్‌లో బయలుదేరే ముందు, మోటార్ ఇన్సూరెన్స్ కవర్‌ ఉందో లేదో చూసుకోవాలి. ఈ సీజన్‌లో అదనపు రక్షణ అందించే యాడ్-ఆన్ ఫీచర్‌లలో పెట్టుబడి పెట్టడం కూడా అంతే ముఖ్యం. వర్షాకాలంలో వాహనాన్ని భద్రంగా ఉంచుకునేందుకు.. రైడ్‌ను ఎంజాయ్‌ చేసేందుకు ఈ సూచనలు పాటించండి.

* ఎల్లప్పుడూ సమగ్రమైన పాలసీని ఎంచుకోండి
థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవర్ అనేది చట్టం ప్రకారం తప్పనిసరి అవసరం అయినప్పటికీ, వాహనాన్ని రక్షించడానికి ఇది సరిపోదు. థర్డ్‌పార్టీకి కలిగే నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది. కాబట్టి సొంత వాహనానికి కూడా కవరేజీ అవసరం. ఇప్పుడు వాహనాలు ప్రీ-పాండమిక్ రన్‌ను పునఃప్రారంభిస్తున్నందున, సమగ్ర పాలసీని కొనుగోలు చేయడం అవసరం. అధ్వాన్నమైన రోడ్లు, ఇతర సమస్యలతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పాలసీ ప్రమాదాలకు కవరేజీని అందించడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, అగ్నిప్రమాదం లేదా మొత్తం నష్టం వంటి ప్రమాదాల నుంచి వాహనానికి ఇన్సూరెన్స్‌ లభిస్తుంది.

* నీటి సంబంధిత సమస్యలకు ఇంజిన్ ప్రొటెక్షన్‌ కవర్‌ తప్పనిసరి
ఈ యాడ్-ఆన్ ఫీచర్ వర్షాకాలంలో కారు యజమానికి అద్భుతమైన విలువను అందిస్తుంది. వాహనంలో ఇంజిన్ చాలా ముఖ్యమైన భాగం. దాని రక్షణ మరిచిపోకూడదు. ఇది వాహనం అత్యంత ఖరీదైన భాగం కూడా. ఒక ప్రామాణిక మోటారు ఇన్సూరెన్స్‌ పాలసీ ఇంజిన్ నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. నీరు చేరడం లేదా లూబ్రికెంట్ లీకేజీ వల్ల కలిగే నష్టాలు డిఫాల్ట్‌గా పాలసీలో కవర్ కావు. దీని కోసం, పాలసీలో ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్‌ని ఎంచుకోవాలి. వాటర్ ఇన్‌గ్రెషన్ లేదా గేర్‌బాక్స్ దెబ్బతినడం మొదలైన వాటి వల్ల ఇంజిన్‌కు కలిగే నష్టాలకు కవర్ చేస్తుంది. అలాగే, వాటర్‌లాగింగ్, సీపేజ్ కారణంగా హైడ్రోస్టాటిక్ లాక్ అనేది ఈ సమయంలో ఒక సాధారణ సమస్య, ఇది ఈ యాడ్-ఆన్ ద్వారా కవర్ అవుతుంది. ప్రత్యామ్నాయంగా, మోటారు ఇన్సూరెన్స్‌ పాలసీని ఎంచుకోవడానికి హైడ్రోస్టాటిక్ లాక్ కవర్ కూడా అందుబాటులో ఉంది.

* దెబ్బతిన్న పార్ట్స్‌కు జీరో డిప్రిసియేషన్‌ కవర్(Zero Depreciation Cover)
బంపర్-టు-బంపర్ కవర్ లేదా నిల్ డిప్రిసియేషన్ కవర్ ఏది ఎంచుకున్నా గొప్ప యాడ్-ఆన్ అవుతుంది. కొత్త కారు యజమానికి విలువైన ఆస్తిగా మారుతుంది. షోరూమ్ నుంచి బయటకు వెళ్లిన వెంటనే కొత్త కారు విలువ తగ్గినట్లు పరిగణిస్తారు. కాబట్టి కారు పాడైపోతే, పార్ట్స్‌ లేదా కారు విలువ ప్రకారం పరిహారం అందుతుంది. వర్షాకాలంలో నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, జీరో డిప్రిసియేషన్ కవర్‌ని ఎంచుకోకపోవటం వలన చాలా ఖర్చు అవుతుంది. ఈ కవర్‌ను ఎంచుకుంటే, మార్కెట్ విలువ ప్రకారం క్లెయిమ్ పూర్తిగా పొందే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ కేవలం ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న కార్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

* అత్యవసర పరిస్థితుల కోసం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌
ఎక్కడో మధ్యలో వాహనం పాడైపోవడం వల్ల ఉత్తమ ప్రయాణాలు ఆగిపోతాయి. ఒంటరిగా ప్రయాణిస్తుంటే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్‌ని ఎంచుకుంటే ఎక్కువ గంటలు ఎలాంటి సహాయం లేకుండా ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. వృత్తిపరమైన సహాయం సకాలంలో మీకు అందుతుంది. అలాగే, క్లెయిమ్ సమయంలో ఏవైనా నిరాశలను నివారించడానికి, లాక్, కీ కవర్, వినియోగ వస్తువుల కవర్ ఇతర సంబంధిత యాడ్-ఆన్‌లను పాలసీకి జోడించడం మర్చిపోవద్దు.
Published by:Mahesh
First published:

Tags: Cars, Insurance, Security, Term insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు