Reliance Jio | ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ ఒప్పొ తాజాగా తీపికబురు అందించింది. కంపెనీకి చెందిన చాలా వరకు 5జీ (5G) స్మార్ట్ఫోన్లలో స్టాండలోన్ 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. దీని కోసం దిగ్గజ టెలికం కంపెనీ రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో భాగంగా ఒప్పొ 5జీ స్మార్ట్‌ఫోన్స్ అన్నింటిలోనూ జియో ట్రూ 5జీ (Jio True 5G) సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అంటే ఒప్పొ 5జీ ఫోన్ కలిగిన వారు సుపీయర్ క్వాలిటీతో హై స్పీడ్ జియో ట్రూ 5జీ సేవలు పొందొచ్చు.
ఒప్పొ కంపెనీ 5జీ స్మార్ట్ఫోన్లు స్టాండలోన్ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసేలా పలు మోడళ్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకువచ్చింది. రెనో 8, రెనో 8 ప్రో, రెనో 7, ఎఫ్21 ప్రో 5జీ, ఎఫ్19 ప్రో ప్లస్, కే10, ఏ53ఎస్ స్మార్ట్ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్స్ వాడే వారు వారి ఫోన్‌ను అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకున్న వారికి జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.
రూ.9 వేల గ్యాస్ స్టవ్ రూ.1600కే.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్!
ఒప్పొ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఆర్అండ్డీ హెడ్ తస్లీమ్ అరీఫ్ మాట్లాడుతూ.. దేశంలో 5జీ అభివృద్ధికి అంకిత భావంతో పని చేస్తున్నామని తెలిపారు. అలాగే వినియోగదారులకు ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. 5జీ సర్వీసులకు సంబంధించి రిలయన్స్ జియో అందిస్తున్న మద్దతు, సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
5జీ ఫోన్‌పై రూ.20 వేల డిస్కౌంట్.. 108MP కెమెరా, 17 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్!
5G సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఒప్పొ 5జీ స్మార్ట్‌ఫోన్స్ అన్నీ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయని తస్లీమ్ వెల్లడించారు. కంపెనీ నుంచి మార్కెట్లోకి రానున్న అన్ని 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఇకపై ఎస్ఏ, ఎన్ఎస్ఏ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయని వివరించారు. కాగా జియో ట్రూ 5జీ అనేది ప్రపంచంలోని అత్యంత అధునాతన, నెక్ట్స్ జనరేషన్ వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీలలో ఒకటి. స్టాండలోన్ అర్కిటెక్షర్ ఆఫ్ 5జీ (4జీ నెట్‌వర్క్‌పై ఆధారపడాల్సిన పని లేదు), లార్జెస్ట్ అండ్ బెస్ట్ మిక్స్ ఆఫర్ 5జీ స్పెక్ట్రమ్ (వివిధ రకాల స్పెక్ట్రమ్ బ్యాండ్స్ కలిగి ఉంది), కారియర్ అగ్రిగేషన్ వంటివి జియో ట్రూ 5జీ సర్వీసులను ఉన్నత స్థాయిలో ఉంచాయని పేర్కొన్నారు.
కాగా ఒప్పొ ఇండియా తన వినియోగదారులకు అత్యంత సమర్థవంతమైన 5జీ అనుభవాన్ని అందించడానికి వివిధ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో, అనేక నగరాల్లో మొదటి సారిగా 5జీ ఫీల్డ్ టెస్ట్‌లను నిర్వహించింది. గత సంవత్సరం మొదటి వాట్సాప్ వీడియో కాల్ నుంచి, తొలి వీఓఎన్ఆర్ కాల్ వరకు ఒప్పొ ఇండియా దేశంలో అనేక 5జీ ఫస్ట్ సర్వీసులు ఆవిష్కరించింది. ఒప్పొ దేశంలోని ఇతర సాంకేతికతలతో పాటు డీఎస్ఎస్, వీఓఎన్ఆర్, ఎస్ఏ నెట్వర్క్ స్లైసింగ్‌లో అగ్రగామిగా ఉంది. అలాగే 5జీ స్టాండర్డ్ సంబంధిత పేటెంట్ల సంఖ్యలోనూ అగ్రగామిగా కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g phones, 5G Smartphone, Jio 5G, Oppo, Reliance Jio