MAHINDRA SCORPIO N LAUNCHED AT RS 11 LAKH 99 THOUSAND UMG GH
Mahindra Scorpio-N: మహీంద్రా నుంచి స్కార్పియో-N SUV లాంచ్.. ప్రారంభ ధర రూ.11.99 లక్షలు
స్కార్పియో కొత్త మోడల్ లాంచ్.
ఆటోమొబైల్ (Auto mobile) దిగ్గజం మహీంద్రా నుంచి మరో కొత్త వెహికల్ రిలీజ్ అయింది. మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) పేరుతో కొత్త తరం స్కార్పియోను కంపెనీ విడుదల చేసింది. దీని ధర, వేరియంట్లు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించింది.
ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా నుంచి మరో కొత్త వెహికల్ రిలీజ్ అయింది. మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) పేరుతో కొత్త తరం స్కార్పియోను కంపెనీ విడుదల చేసింది. దీని ధర, వేరియంట్లు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించింది. 2022 మహీంద్రా స్కార్పియో-N బుకింగ్స్ జులై 30 నుంచి ఓపెన్ అవుతాయి. AT, 4x4 వేరియంట్ల ధరను జులై 21న వెల్లడించనుంది.
మహీంద్రా స్కార్పియో-N ధరలు
మహీంద్రా స్కార్పియో-N ఎంట్రీ లెవల్ పెట్రోల్ MT Z2 వేరియంట్ ధర రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. స్కార్పియో-ఎన్ డీజిల్ వేరియంట్ ధర రూ.12.49 లక్షలు. టాప్-ఎండ్ మహీంద్రా స్కార్పియో-N డీజిల్ MT 4x2 Z8 L వేరియంట్ ధర రూ. 19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). వేరియంట్ల వారీగా ధరల వివరాలు..
ఈ ధరలు మొదటి 25,000 బుకింగ్స్‌కు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. ఎంపిక చేసిన నగరాల్లో టెస్ట్ డ్రైవ్‌లు జులై 5 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్ నుంచి SUV డెలివరీలు ప్రారంభమవుతాయి.
వేరియంట్లు, స్పెసిఫికేషన్లు
స్కార్పియో-N వెహికల్‌ను మహీంద్రా పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో.. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో అందిస్తుంది. ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్లు డీజిల్ పవర్‌ట్రెయిన్‌కు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ ఇవి మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. మహీంద్రా స్కార్పియో-N డీజిల్ 2.2-లీటర్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ 175bhp గరిష్ట శక్తి, 400Nm గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. అయితే పెట్రోల్ వేరియంట్ 203bhp పవర్, 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ మోటార్‌తో వస్తుంది.
ట్రిమ్స్ పరంగా Z2, Z4, Z6, Z8, Z8 L వంటి ఐదు ఆప్షన్లు ఉన్నాయి. టాప్-ఎండ్ Z8 L మాత్రమే ఆరు లేదా ఏడు సీట్ల ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. మిగిలిన లైనప్‌కు ప్రామాణికంగా ఏడు సీట్లు లభిస్తాయి. కొత్త మహీంద్రా స్కార్పియో-N 4,662mm పొడవు, 1,917mm వెడల్పు, 1,857mm ఎత్తు ఉంటుంది. ఇది 2,750ఎమ్ఎమ్ వీల్ బేస్ కలిగి ఉంది. ఈ SUVని కొత్త ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించారు. ఇది 57 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. కొత్త మహీంద్రా స్కార్పియో-N మొత్తం ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.