• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • MAHARASHTRA YOUNG ENGINEER TURNED ACTIVA INTO EV INNOVATION HERE THE FULL DETAILS GH SRD

Activa Into EV Innovation: వారెవ్వా..పెట్రోల్​ వాహనాన్ని ఎలక్ట్రిక్​ వాహనంగా మార్చేశాడు.. ఎలాగంటే?

Activa Into EV Innovation: వారెవ్వా..పెట్రోల్​ వాహనాన్ని ఎలక్ట్రిక్​ వాహనంగా మార్చేశాడు.. ఎలాగంటే?

Photo Credit : You Tube

Activa Into EV Innovation: నూతన ఆవిష్కరణకు తన ఇంటి పెరటిలోని చిన్న గ్యారేజీనే వేదికగా చేసుకున్నాడు. ఆయన చేసిన ఈ ఆవిష్కరణతో పెట్రోల్​ వాహనాన్ని ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకోవచ్చు. అంతేకాక, రెట్రోఫిటింగ్ బటన్ను నొక్కితే పెట్రోల్, ఎలక్ట్రిక్ మోడ్ మధ్య మారవచ్చని పేర్కొన్నాడు.

  • Share this:
కరోనా లాక్​డౌన్ సమయంలో చాలామంది తమలో దాగి ఉన్న కళలను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంతమంది వ్యవసాయం​పై దృష్టి సారించగా.. మరికొందరు సరికొత్త ఆవిష్కరణలకు పూనుకున్నారు. ఇదే తరహాలో మహారాష్ట్రకు చెందిన ఓంకార్​ థాలే (31) అనే సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ తన మెదడుకు పదునుపెట్టి పెట్రోల్​ వాహనాన్ని ఎలక్ట్రిక్​ వాహనంగా మార్చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన ఆవిష్కరణకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. దేశంలో ​పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగుతుండటంతో చాలా మంది ఎలక్ట్రిక్​ వాహనాల వైపు చూస్తున్నారు. అంతేకాక, పొల్యూషన్​ తగ్గించే క్రమంలో ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్​ వాహనాల తయారీకి రాయితీలు కూడా అందజేస్తుంది. దీంతో, 2019, 2020 మధ్య కాలంలో భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 129% వృద్ధిని నమోదు చేసింది. రాబోయే దశాబ్దంలో ఎలక్ట్రిక్ వాహనాలు జోరు మరింత పెగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్​ వాహనాల వృద్ధికి ఈవీ ఛార్జింగ్​ స్టేషన్లు పెద్ద ఎత్తున అందుబాటులో లేకపోవడం ప్రతిరోధకంగా మారింది. వాహనం నడుపుతున్నప్పుడు మధ్యలో ఛార్జింగ్​ అయిపోతే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా మంది వాహనదారులు భావిస్తున్నారు. ఈ సమస్యకు చెక్​ పెట్టి సరికొత్త పరిష్కారాన్ని చూపించాడు ఓంకార్​ థాలే. కొత్త EV కొనుగోలు చేసే బదులు ప్రస్తుతం ఉన్న పెట్రోల్​ వాహనాన్నే రెట్రోఫిట్ చేసి రెండు విధాలుగా వాడొచ్చని నిరూపించాడు.

నూతన ఆవిష్కరణకు తన ఇంటి పెరటిలోని చిన్న గ్యారేజీనే వేదికగా చేసుకున్నాడు. ఆయన చేసిన ఈ ఆవిష్కరణతో పెట్రోల్​ వాహనాన్ని ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకోవచ్చు. అంతేకాక, రెట్రోఫిటింగ్ బటన్ను నొక్కితే పెట్రోల్, ఎలక్ట్రిక్ మోడ్ మధ్య మారవచ్చని పేర్కొన్నాడు. ఈ ఎలక్ట్రిక్​ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే చాలు గంటకు 60 కి.మీ వేగంతో 85 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. పెట్రోల్​ వాహనాన్ని రెట్రో ఫిల్ చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ఓంకార్​ చెబుతున్నాడు. కొత్త ఎలక్ట్రిక్​ వాహనాన్ని కొనే బదులు మీ వద్ద ఉన్న పాత పెట్రోల్​ వాహనాన్నే రెట్రోఫిల్​ చేసి ఎలక్ట్రిక్​ వాహనంగా మార్చుకోవచ్చని చెబుతున్నాడు. దీనికి కొత్త వాహనం కంటే 40% మేర తక్కువ ఖర్చు అవుతుందని, ఇది ఉద్గారాలను తగ్గించడానికి ఇది మీకు సహాయపడుతుందని ఓంకార్​ అంటున్నాడు. అయితే, ఆయన చేసిన ఈ నూతన ఆవిష్కరణకు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) నుండి ఆమోదం లభించాల్సి ఉంది.

40% మేర ఖర్చును తగ్గిస్తుంది..
ఈ నూతన ఆవిష్యరణపై ఓంకార్​ మాట్లాడుతూ “నేను 2010లో థానేకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరాను. ప్రతి రోజు నా కారులో 45 కిలోమీటర్ల మేర ప్రయాణించేవాన్ని.. తద్వారా ప్రయాణం కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేంది. నా జీతంలో పెద్ద మొత్తం ప్రయాణానికే ఖర్చయ్యేది. అంతేకాక, సీఎన్​జీ స్టేషన్లలో గ్యాస్​ నింపుకోవడానికి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చేది. అందుకే, ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనాలనుకున్నాను. దీంతో, 2019 నవంబర్​లో కళ్యాణ్ మార్కెట్ నుండి సెకండ్​ హ్యండ్​ యాక్టివాను కొనుగోలు చేశాను. ఇతర దేశాల నుండి విడి భాగాలను సమీకరించి కొత్త ఆవిష్కరణకు నాంది పలికాను. మధ్య తరగతి వారికి కూడా అందుబాటులోకి ఉండేలా తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్​ వాహనాన్ని రూపొందించాలనుకున్నా. మన దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి కనీసం లక్ష రూపాయలు ఖర్చవుతుంది.

పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనానికి సుమారు రూ. 80,000 ఖర్చవుతుంది. అందువల్ల, రెట్రో ఫిటింగ్​తో చౌకైన పరిష్కారం చూపాలనుకున్నాను. రూ .40,000లకే పెట్రోల్​ వాహనాన్ని ఎలక్ట్రిక్​ వాహనంగా మార్చవచ్చని నిరూపించాను.” అని అన్నాడు. కాగా, ఓంకార్​ ఆవిష్కరణ విజయవంతం కావడంతో ఆటోబాట్ ఇ-మోటో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. రెట్రోఫిల్​ కిట్​ను బహిరంగ మార్కెట్​లోకి తెచ్చేందుకు గాను అన్ని అనుమతుల కోసం ARAI, ICAT కి దరఖాస్తు చేశాడు, 2021 మే నాటికి ARAI నుండి అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నాడు.
Published by:Sridhar Reddy
First published: