హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Honor MagicBook X: హానర్ మ్యాజిక్​బుక్ ఎక్స్ సిరీస్​లో రెండు ల్యాప్​టాప్స్

Honor MagicBook X: హానర్ మ్యాజిక్​బుక్ ఎక్స్ సిరీస్​లో రెండు ల్యాప్​టాప్స్

Honor MagicBook X: హానర్ మ్యాజిక్​బుక్ ఎక్స్ సిరీస్​లో రెండు ల్యాప్​టాప్స్
(image: Honor)

Honor MagicBook X: హానర్ మ్యాజిక్​బుక్ ఎక్స్ సిరీస్​లో రెండు ల్యాప్​టాప్స్ (image: Honor)

Honor MagicBook X | హానర్ నుంచి మ్యాజిక్ బుక్ ఎక్స్ పేరుతో రెండు ల్యాప్‌టాప్స్ రిలీజ్ అయ్యాయి. వాటి ప్రత్యేకతలు తెలుసుకోండి.

కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్, విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసులు అనివార్యమయ్యాయి. దీంతో స్మార్ట్​ఫోన్​, ల్యాప్​టాప్​, నోట్​బుక్​లకు డిమాండ్​ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ హానర్ తన మ్యాజిక్​బుక్ ఎక్స్​ సిరీస్లో రెండు కొత్త ల్యాప్​టాప్​ల​ను విడుదల చేసింది. మ్యాజిక్​బుక్ ఎక్స్ 14, మ్యాజిక్​ బుక్​ ఎక్స్​ 15 పేరుతో వీటిని లాంచ్​ చేసింది. ఈ రెండు ల్యాప్​టాప్​లు ఇంటెల్ 10వ జనరేషన్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. వీటిలో కోర్ i5-10210U, కోర్ i3-10110U ప్రాసెసర్లు, 8GB లేదా 16GB DDR4 మెమరీ ఆప్షన్లను అందించింది. అంతేకాక, PCIe NVMe SSD 256GB లేదా 512GB స్టోరేజ్​ని అందించింది. ఈ రెండు ల్యాప్‌టాప్‌లలో 56Wh బ్యాటరీని అందించింది. ఇవి USB-C కనెక్టర్ ద్వారా 65W ఫాస్ట్​ ఛార్జింగ్‌కు మద్దతిస్తాయి.

OnePlus Nord CE 5G: రూ.22,999 ధరకే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... కాసేపట్లో సేల్

iQoo Z3 5G: రూ.19,990 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,490 ధరకే కొనండి ఇలా

మ్యాజిక్​బుక్​ ఎక్స్ 14 డివైజ్.. 14 అంగుళాలతో, 16: 9 (1080p) ఐపిఎస్ డిస్‌ప్లే అందించగా.. ఎక్స్ 15లో మాత్రం 15.6 ఇంచెస్​ డిస్​ప్లేను చేర్చింది. ఈ రెండు ల్యాప్​టాప్​లు టియువి రీన్లాండ్ సర్టిఫికేషన్​తో వస్తాయి. వీటిలో ఒకే రకమైన యూఎస్​బి పోర్ట్​లను అందించడం విశేషం. యుఎస్‌బి-ఎ 3.0 జెన్ 1, యుఎస్‌బి–సి, యుఎస్‌బి–ఎ 2.0, ఫుల్ సైజ్​ హెచ్‌డిఎంఐ, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి యూఎస్​బి పోర్ట్​లను చేర్చింది. ఇక, 14 -అంగుళాల మోడల్ బరువు 1.38 కిలోలు, 15 అంగుళాల మోడల్​ 1.56 కిలోల బరువు కలిగి ఉంటాయి.

BSNL Plan: మూడు నెలలకు రూ.94 మాత్రమే... బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

Realme Narzo 30: రియల్‌మీ మరో సంచలనం... ధర రూ.13,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్


రెండు వేరియంట్లలో లభ్యం


ఈ రెండు ల్యాప్​టాప్​ మూలలు సన్నటి బెజెల్స్‌ కలిగి ఉంటాయి. దీని 14 అంగుళాల మోడల్​ టాప్​, సైడ్​ బార్డర్లు 4.8 మి.మీ. డైమెన్షన్స్​తో వస్తాయి. ఇక, 15 అంగుళాల ల్యాప్​టాప్​ విషయానికి వస్తే... ఇది 5.8 మి.మీ. బెజెల్స్‌ కలిగి ఉంటుంది. కాగా, ఈ ల్యాప్​టాప్​లు ప్రస్తుతం రష్యా మార్కెట్​లోనే లభిస్తాయి. గ్లోబల్​ మార్కెట్​లో వీటి లభ్యతపై హానర్​ నుంచి ఎటువంటి స్పష్టత లేదు. మ్యాజిక్‌ ​బుక్ ఎక్స్ 14 ధర RUB 49,990 /$ 690 (భారత కరెన్సీలో సుమారు రూ. 50,500) వద్ద మొదలవుతుంది. మ్యాజిక్ బుక్ X 15 ధర RUB 52,990 /$ 730 (భారత కరెన్సీలో సుమారు రూ. 53,500) వద్ద ప్రారంభమవుతుంది. రష్యన్​ మార్కెట్​లో ఈ రెండు ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

First published:

Tags: Honor

ఉత్తమ కథలు