• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • MAGIC PHYSIOTHERAPY MAT THAT CAN TELL YOU EXACT OUTCOME OF EXERCISE SESSION HERE THE DETAILS GH SRD

Physiotherapy mat: మ్యాజిక్ మ్యాట్‌ తయారు చేసిన IIIT-హైదరాబాద్ పరిశోధకులు..లాభాలెంటో తెలుసా..

Physiotherapy mat: మ్యాజిక్ మ్యాట్‌ తయారు చేసిన IIIT-హైదరాబాద్ పరిశోధకులు..లాభాలెంటో తెలుసా..

IIIT-Hyderabad (ఫైల్ ఫోటో)

Physiotherapy mat: వివిధ రకాల అనారోగ్యాలకు చికిత్సలో భాగంగా రోగులకు ఫిజియోథెరపీ అవసరమవుతుంది. రోగి అవసరాన్ని బట్టి సెషన్ల వారీగా ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు అవసరం.. రోగులకు అవసరమైనంత మేరకు ఫిజికల్ ఎక్ససైజ్ అందుతుందా లేదా... అనే వివరాలపై వైద్యులకు కచ్చితమైన అవగాహన ఉండట్లేదు.

  • Share this:
వివిధ రకాల అనారోగ్యాలకు చికిత్సలో భాగంగా రోగులకు ఫిజియోథెరపీ అవసరమవుతుంది. రోగి అవసరాన్ని బట్టి సెషన్ల వారీగా ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు అవసరం.. రోగులకు అవసరమైనంత మేరకు ఫిజికల్ ఎక్ససైజ్ అందుతుందా లేదా... అనే వివరాలపై వైద్యులకు కచ్చితమైన అవగాహన ఉండట్లేదు. ఈ సమస్యకు కృత్రిమ మేధతో పరిష్కారాన్ని కనుగొన్నారు IIIT-హైదరాబాద్ పరిశోధకులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) ఆధారంగా ఫిజియోథెరపీ సెషన్ సమర్థతను అంచనా వేసే మ్యాట్‌ను వారు అభివృద్ధి చేశారు. సెన్సార్లతో ఉండే ఈ మ్యాజిక్ మ్యాట్‌ ఆధారంగా వ్యక్తులకు ఎంత వరకు ఫిజియోథెరపీ అవసరం?, వారికి సెషన్ ఎప్పుడు పూర్తవుతుంది? అనే వివరాలను మరింత కచ్చితత్వంతో అంచనా వేయనున్నారు. ప్రస్తుతం ఫిజియోథెరపిస్టులు రోగుల ప్రోగ్రెస్‌ను ట్రాక్ చేయడానికి కెమెరాలు, ఇతర ఖరీదైన పరికరాలపై ఆధారపడుతున్నారు. వీటి స్థానంలో ఇంటెలిజెంట్ మ్యాట్‌ను పరిశోధకులు రూపొందించారు. IIIT-హైదరాబాద్‌లోని ప్రాసెస్, ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీస్ రిసెర్చ్‌ ఇన్ IoT (PATRIoT) ల్యాబ్, సెంటర్ ఫర్ VLSI అండ్ ఎంబడెడ్ సిస్టమ్స్ టెక్నాలజీస్‌ విభాగాలకు చెందిన పరిశోధకులు ఈ మ్యాట్‌ను అభివృద్ధి చేశారు. దీంట్లో ఉండే కండక్టివ్ ఫోమ్, సెన్సార్లు, AI అల్గారిథమ్.. ఒక్కో సెషన్‌లో రోగుల ఎక్ససైజ్‌ వేగాన్ని, కచ్చితత్వాన్ని అంచనా వేస్తాయి. ఇందుకు వారు ఈ మ్యాట్‌పై ఎక్ససైజ్‌ చేస్తే చాలు. సెన్సార్లు, కృత్రిమ మేధ పని ప్రారంభిస్తాయి.

* రోగులకు ఉపయోగం
ఈ వ్యవస్థ ద్వారా ఫిజియోథెరపీ సెషన్‌ను లెక్కించవచ్చని PATIoT ల్యాబ్ ప్రధాన పరిశోధకుడు అఫ్తాబ్ M హుస్సేన్ చెప్పారు. మ్యాట్‌లో ఉండే ప్రెజర్ సెన్సార్ మాట్రిక్స్‌తో లోడ్ పొజిషనింగ్ వేగం, కచ్చితత్వాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. స్ట్రోక్, ఆర్థరైటిస్, ఇతర అనారోగ్యాలకు గురైనవారు శారీరకంగా బలంగా మారేందుకు ఈ మ్యాట్ సహాయపడుతుంది. ఈ ఎక్ససైజ్ మ్యాట్‌లో ఉండే కండక్టివ్ ఫోమ్‌ను కార్బన్‌తో కలిపి తయారు చేశారు. ఇది స్టాటిక్ ఛార్జ్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఈ మ్యాట్‌ 4X4 విస్తీర్ణంలో ఉంటుంది. దీంట్లో 16 సెన్సార్లు (ప్రెజర్ సెన్సార్ మ్యాట్రిక్స్) ఉంటాయి. మ్యాట్‌ కింది, పైభాగాలకు పేపర్ ఫినిషింగ్ పొర ఉంటుంది.

మ్యాట్ మధ్యలో కాపర్ ఎలక్ట్రోడ్‌లను అమర్చారు. ఈ ఎలక్ట్రోడ్‌లు ఎక్స్టర్నల్ సర్క్యూట్‌కు అనుసంధానమై ఉంటాయి. రోగి మ్యాట్‌పై ఎక్ససైజ్ చేసినప్పుడు దీంట్లో ఉండే పరికరాలన్నీ పనిచేస్తాయి. మ్యాట్‌లో ఉండే ఫోమ్‌పై ఒత్తిడి పడినప్పుడు ఎక్స్టర్నల్ సర్క్యూట్‌ రెసిస్టెన్స్‌ను లెక్కిస్తుంది. ఈ రెసిస్టెన్స్ ఆధారంగా మెషిన్ లెర్నింగ్ మోడల్ టెక్నాలజీ.. ఎక్ససైజ్ సమర్థతను గుర్తిస్తుంది. దీని ధర రూ.1,000 కంటే తక్కువే కావడం విశేషం. కండక్టివ్ ఫోమ్‌ను సింథటిక్ ఆర్గానిక్ కెమెస్ట్రీ ద్వారా తయారు చేస్తే మ్యాట్‌ ధర ఇంకా తక్కువయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.
Published by:Sridhar Reddy
First published: