TikTok: టిక్‌టాక్‌ ఫ్యాన్స్‌కు ఊరట... నిషేధం ఎత్తేసిన మద్రాస్ హైకోర్ట్

TikTok | తమ అంతర్గత భద్రతా విధానం ద్వారా కంటెంట్‌పై నిఘా పెడతామని, అసభ్యకరమైన, అశ్లీలమైన వీడియోలు అప్‌లోడ్ కాకుండా చూస్తామని బైట్‌డ్యాన్స్ హామీ ఇచ్చింది. బైట్‌డ్యాన్స్ వాదనలు విన్న మద్రాస్ హైకోర్ట్ టిక్ టాక్ యాప్‌పై నిషేధాన్ని తొలగించింది.

news18-telugu
Updated: April 24, 2019, 6:49 PM IST
TikTok: టిక్‌టాక్‌ ఫ్యాన్స్‌కు ఊరట... నిషేధం ఎత్తేసిన మద్రాస్ హైకోర్ట్
TikTok: టిక్‌టాక్‌ ఫ్యాన్స్‌కు ఊరట... నిషేధం ఎత్తేసిన మద్రాస్ హైకోర్ట్
news18-telugu
Updated: April 24, 2019, 6:49 PM IST
టిక్ టాక్ యాప్‌పై మద్రాస్ హైకోర్టు నిషేధం ఎత్తేసింది. చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్ యాప్‌పై నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టే. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్ట్... ఈ యాప్‌ను యాప్ స్టోర్ల నుంచి తొలగించాలంటూ కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో చర్యలు మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్ యాప్‌ను యాప్ స్టోర్ల నుంచి తొలగించాలని గూగుల్, యాపిల్‌ను కోరింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కోరడంతో తమ యాప్‌స్టోర్స్ నుంచి టిక్ టాక్ యాప్‌ను తొలగించాయి గూగుల్, యాపిల్. అప్పటికే టిక్ టాక్ డెవలపర్ బైట్‌డ్యాన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్ 22న సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. టిక్ టాక్ యాప్‌పై నిషేధం విషయంలో నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే నిషేధం ఎత్తేస్తామని మద్రాస్ హైకోర్టుకు స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. దీంతో ఈ వ్యవహారం కాస్తా మళ్లీ మద్రాస్ హైకోర్టుకే చేరింది.

టిక్ టాక్ యాప్‌పై నిషేధం ఎత్తివేయాలంటూ బైట్‌డ్యాన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారించింది. తమ అంతర్గత భద్రతా విధానం ద్వారా కంటెంట్‌పై నిఘా పెడతామని, అసభ్యకరమైన, అశ్లీలమైన వీడియోలు అప్‌లోడ్ కాకుండా చూస్తామని బైట్‌డ్యాన్స్ హామీ ఇచ్చింది. బైట్‌డ్యాన్స్ వాదనలు విన్న మద్రాస్ హైకోర్ట్ టిక్ టాక్ యాప్‌పై నిషేధాన్ని తొలగించింది. ఇక ఈ యాప్ ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్స్‌లోకి రాగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ యాప్ ఇండియాలో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ యాప్‌లో అశ్లీల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయని, పోర్నోగ్రఫీని ప్రోత్సహించేలా ఉందన్న కారణంతో ఈ నెల మొదటి వారంలో నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టు. ఇప్పుడు నిషేధం తొలగిపోవడంతో టిక్ టాక్ డెవలపర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3



ఇవి కూడా చదవండి:

SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే జాగ్రత్త
Loading...
SBI New Rules: మే 1 నుంచి ఎస్‌బీఐలో మారనున్న రూల్స్ ఇవే...

Tata Sky New Packs: డీటీహెచ్ ప్లాన్స్‌ ధరల్ని తగ్గించిన టాటా స్కై... కొత్త తెలుగు ప్యాక్స్ ఇవే
First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...