Home /News /technology /

Koo App: టైగర్ గ్లోబల్ నేతృత్వంలో 30 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సేకరించిన కూ

Koo App: టైగర్ గ్లోబల్ నేతృత్వంలో 30 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సేకరించిన కూ

Koo App: టైగర్ గ్లోబల్ నేతృత్వంలో 30 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సేకరించిన కూ
(ప్రతీకాత్మక చిత్రం)

Koo App: టైగర్ గ్లోబల్ నేతృత్వంలో 30 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సేకరించిన కూ (ప్రతీకాత్మక చిత్రం)

Koo App | కూ లో ఉన్న అన్ని భారతీయ భాషలలో ఇంజనీరింగ్, ప్రోడక్ట్ మరియు కమ్యూనిటీ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి తాజా నిధులు ఉపయోగించబడతాయి.

  భారతదేశం యొక్క స్వంత మైక్రో బ్లాగింగ్ యాప్ కూ, సిరీస్ బి నిధుల కోసం 30 మిలియన్లను సేకరించింది. టైగర్ గ్లోబల్ పెట్టుబడి రౌండ్ కి నాయకత్వం వహించింది, ప్రస్తుత పెట్టుబడిదారులు అక్సెల్ పార్టనర్స్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్ మరియు డ్రీమ్ ఇంక్యుబేటర్ కూడా ఈ రౌండ్లో పాల్గొన్నారు. ఐఐఎఫ్ఎల్ మరియు మిరే ఎస్టేట్స్ ఈ రౌండ్‌ తో క్యాప్ టేబుల్‌ పైకి వచ్చిన ఇతర కొత్త పెట్టుబడిదారులు. కూ అనేది భారతీయ భాషలలో అభిప్రాయాలు పంచుకునేందుకు ఉన్న మైక్రోబ్లాగింగ్ సైట్. ఇది కేవలం ఒక సంవత్సర కార్యకలాపాలలో దాదాపు 6 మిలియన్ల డౌన్లోడ్ లను సంపాదించి ప్రతిరోజూ కమ్యూనిటీ పోస్ట్ చేసే కంటెంట్ తో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్ మరియు స్మృతి ఇరానీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్, జెడిఎస్ అధినేత మరియు మాజీ ప్రధాని దేవేగౌడ, ఎన్సిపి సుప్రియ సులే, భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్, జెడియు నుండి ఉపేంద్ర ఖుష్వాహా, ఏఏపీ నుండి రాజేంద్ర పాల్ గౌతమ్, సైనా నెహ్వాల్, భైచుంగ్ భూటియా, జవగల్ శ్రీనాథ్, మేరీ కోమ్, దీపక్ హూడా ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు.

  Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్

  Jio 4G Data Plans: మొబైల్ డేటా సరిపోవట్లేదా? జియో అందిస్తున్న 4జీ ప్లాన్స్ ఇవే

  కూ ని అప్రమేయ రాధాకృష్ణ టాక్సీ ఫర్ స్యూర్ వ్యవస్థాపకుడు మరియు గతంలో మీడియా యాంట్ మరియు గుడ్ బాక్స్ వంటి సంస్థలను స్థాపించిన మయాంక్ బిదావత్కా స్థాపించారు. కూ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈవో అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ “ రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా ఎదగడానికి మాకు శక్తివంతమైన ప్రణాళికలు ఉన్నాయి. ప్రతి భారతీయుడు మేము త్వరలో అక్కడికి చేరుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు. ఈ కలను సాకారం చేసుకోవడానికి టైగర్ గ్లోబల్ సరైన భాగస్వామి” అని అన్నారు.

  Credit Card: ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే 71 లీటర్ల పెట్రోల్ ఉచితం

  OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ టీవీ... ధర రూ.21,999 మాత్రమే

  కూ అనేది 2020 మార్చిలో భారతీయ భాషలతో ఏర్పడిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్. పలు భారతీయ భాషల్లో యాప్ అందుబాటులో ఉంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ మాతృభాషలో తమను తాము వ్యక్తపరుచుకోవడానికి వీలుగా కూ ను రూపొందించారు. మనదేశంలో కేవలం 10% మంది మాత్రమే ఇంగ్లీష్‌లో మాట్లాడగలరు. భావాలను వ్యక్తపరచగలరు. అందుకే భారతీయ భాషల్లో యూజర్లు వారి అభిప్రాయాలను పంచుకోవడానికి, ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి సహాయపడేందుకు ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎంతో అవసరం. అలాంటి వేదికను, భారతీయ భాషలను ఇష్టపడే మనకు కూ అందిస్తోంది.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Koo App

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు